daman
-
Shirley Setia: యూట్యూబ్ సంచలనం.. పుట్టింది డామన్.. పెరిగింది స్విట్జర్లాండ్..
హోమ్మేడ్ ఫిల్మ్స్‌తో ఇంటర్నేషనల్ ఫేమ్ కావచ్చు...అని మరోసారి నిరూపించింది స్వీటువాయిస్ షెర్లీ. డామన్‌లో జన్మించిన షెర్లీ షెటియ స్విట్జర్లాండ్‌లో పెరిగింది. యూనివర్శిటీ ఆఫ్ ఆక్లాండ్‌లో చదువుకునే రోజుల్లో పార్ట్–టైమ్ రేడియో జాకీగా పనిచేసింది. తాను పాడిన పాటలను సరదాగా యూట్యూబ్‌లో పోస్ట్ చేసేది. యూఎస్,యూకే, కెనడా, ఇండియాలలో ఉన్న ఎందరో కళాకారులతో ఆన్లైన్ వేదికగా కలిసి పనిచేసింది. ‘యూట్యూబ్ సెన్సేషన్’గా పేరు తెచ్చుకొంది. ముంబైకి వచ్చేసిన తరువాత... హిందీ యాక్షన్ కామెడి ఫిల్మ్ ‘ఏ జెంటిల్మెన్’లో డిస్కో...డిస్కో, ‘మస్కా’ సినిమాలో ‘ఐవన హ్యాంగ్ విత్ యూ’....మొదలైన పాటలు షెర్లీకి ఎంతో పేరు తెచ్చాయి. ‘బాలీవుడ్ నెక్ట్స్ బిగ్ సింగింగ్ సెన్సేషన్’ అనిపించుకుంది. ప్రసిద్ధ టీ–సిరీస్ మిక్స్‌టేప్, ఎలక్ట్రో ఫోక్లకు పాడింది. ‘మన హృదయం చెప్పినట్లు నడుచుకుంటే విజయం మనదే’ అంటుంది షెర్లీ షెటియ. చదవండి: ఎలాన్ మెచ్చిన మన ఎల్లుస్వామి View this post on Instagram A post shared by Shirley (@shirleysetia) -
డామన్‌లో ఉగ్రవాదుల చొరబాటు!
డామన్: కేంద్రపాలిత ప్రాంతం డయ్యూడామన్‌లో ఉగ్ర కలకలం పోలీసులతోపాటు ప్రజలకూ కంటిమీద కునుకులేకుండా చేసింది. నేవీ అధికారుల దుస్తుల్లో, ఏకే-47 తుపాకులు చేతబట్టుకుని డామన్ జిల్లా కేంద్రంలోకి చొరబడ్డ నలుగురు అనుమానితుల్ని గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 'తుపాకులతో నలుగురు వ్యక్తులు సంచరిస్తున్నారని స్థానికులు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు, మొదట తీరప్రాంతంలో ఏర్పాటుచేసిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, ఒక బోటు నుంచి నేవీ అధికారుల దుస్తుల్లో నలుగురు వ్యక్తులు తుపాకుతో దిగిన దృశ్యాలు కనిపించాయి. వెంటనే అప్రమత్తమైన డామన్ ఎస్సీ ఈశ్ సింఘాట్.. నగరంలోని అన్నిప్రాంతాలకు సుశిక్షితులైన సాయుధబృందాలను పంపారు. రహదారుల వెంబడి గస్తీని పెంచారు. రాత్రి 1:30 ప్రాంతంలో ఒక మినీట్రక్కులో ప్రయాణిస్తున్న అనుమానితులను అటకాయించిన పోలీసులు.. ఆయుధాలను లాక్కొని విచారణ నిమిత్తం నలుగురినీ ఎస్సీ ఆఫీసుకు తరలించారు. డామన్‌కు ఎందుకొచ్చారిని ప్రశ్నించగా '200 కేజీల బరువున్న ఒక వస్తువు కోసం వచ్చాం'అని అనుమానితులు సమాధానమిచ్చారు. మరికొన్ని ప్రశ్నలకు కూడా ఇలా తలతిక్క సమాధానం చెప్పడంతో పోలీసులు తమదైన శైలి విచారణకు ఉద్యుక్తులయ్యారు. అప్పుడుకానీ నిజం బయటపడటేదు! నేవీ దుస్తుల్లో వచ్చిచ్చిన ఆ నలుగురూ నిజంగా నేవీ అధికారులని, మాక్ డ్రిల్‌లో భాగంగా డామన్ పట్టణంలో ఒక చోట ఉన్న 'జెమిని' అనే 200 కేజీల బోటును తీసుకెళ్లడం వారి టార్గెట్ అని, లక్ష్యాన్ని చేరుకునే లోపే దొరికిపోయారని నేవీ ఉన్నతాధికారులు లోకల్ పోలీసులకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.రు. పట్టుబడ్డ తమవారికి సంబంధించిన పూర్తివివరాలను పోలీసులకు చేరిన అనంతరం, ఆ నలుగురూ విడుదలయ్యారు. 'మిస్‌కమ్యూనికేషన్' వల్లే ఇలా జరిగిందని ఎస్పీ మీడియాకు వివరించారు. -
మహిళా కార్పొరేటర్‌ను లాగిపెట్టి కొట్టాడు
డామన్: ఓ బీజేపీ ఎమ్మెల్యే చిక్కుల్లో పడ్డాడు. ఓ మహిళా కార్పొరేటర్‌పై చేయి చేసుకొని కెమెరా కళ్లకు చిక్కాడు. డామన్‌లో ఈ ఘటన బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. బీజేపీ నేత నవీన్ పాటిల్ అనే ఓ బీజేపీ ఎమ్మెల్యే ఓ మహిళా కార్పొరేటర్ హాల్లో నడుచుకుంటూ వెళ్తుండగా ఏవో వ్యాఖ్యలు చేశాడు. అంతలోనే ఆ మహిళ వెనక్కి తిరుగుతుండగానే లాగిపెట్టికొట్టి ముందుకు తోసేశాడు. దీంతో ఇరు పక్షాల మద్దతుదారులు ఘర్షణకు దిగారు. డామన్‌లో బీజేపీ నిర్వహిస్తున్న మేథోమదన కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. -
మహిళా కార్పొరేటర్‌ను లాగిపెట్టి కొట్టాడు
-
క్యాసినో... ‘డామన్’!
గ్యాంబ్లింగ్‌కి, బెట్టింగ్‌కి పేరొందిన మకావూ, లాస్ వెగాస్ తరహాలో దేశీయంగా డామన్‌లోనూ అతి పెద్ద క్యాసినో సిద్ధమవుతోంది. ఏకంగా 10 ఎకరాల విస్తీర్ణంలో డెల్టా కార్ప్ దీన్ని సిద్ధం చేస్తోంది. భారత్‌లో గ్యాంబ్లింగ్ (రేసింగ్‌లు, బెట్టింగ్‌లు మొదలైనవి)మార్కెట్ విలువ ఏటా సుమారు 60 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఇందులో సగభాగం అక్రమంగానే జరుగుతోంది. ప్రస్తుతం దేశీయంగా కొన్ని రాష్ట్రాలు మాత్రమే క్యాసినోలను అనుమతిస్తున్నాయి. సిక్కిం, గోవాలో మాత్రమే క్యాసినోలు ఉండగా.. తాజాగా పంజాబ్ వీటిపై దృష్టి సారిస్తోంది. ఇక, ఇక్కడ కుదరని వారు మకావూ, సింగపూర్, లాస్ వెగాస్ వంటి చోట్లకు వెడుతున్నారు. మొత్తం గ్యాంబ్లింగ్ మార్కెట్ టర్నోవర్‌లో సుమారు నాలుగు శాతం వాటా భారతీయులదే ఉంటోందని అంచనా. దీంతో ఇందులో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. దీనిలో భాగంగానే డెల్టా కార్ప్ దేశంలోనే అతి పెద్ద క్యాసినో ‘ది డెల్టిన్’ని డామన్ భూభాగంపై ఏర్పాటు చేస్తోంది. (ప్రస్తుతం చాలా మటుకు క్యాసినోలు ఆఫ్‌షోర్ అంటే సముద్ర భాగంలో ఉంటున్నాయి). డెల్టా కార్ప్‌కి గోవాలో 3 ఆఫ్‌షోర్ క్యాసినోలు ఉన్నాయి. అనేక ప్రత్యేకతలు..: ది డెల్టిన్లో 10 ఎకరాల్లో 60,000 చదరపు అడుగుల గేమింగ్ స్పేస్ ఉంటుంది. ఇందులో 187 గదులు కూడా ఉంటాయి. అలాగే, మూడు బార్లు, వివిధ రకాల వంటకాలను వడ్డించే నాలుగు రెస్టారెంట్లు ఉంటాయి. కార్పొరేట్ క్లయింట్ల కోసం డెల్టా కార్ప్ ప్రత్యేకంగా 29,000 చ.అ. స్థలం కేటాయిస్తోంది. దీన్ని కాన్ఫరెన్సులు, ఇన్డోర్ మీటింగులు, ఎగ్జిబిషన్లు మొదలైన వాటికి ఉపయోగించుకోవచ్చు. అలాగే, అంతర్జాతీయ క్యాసినోల తరహాలో 8,000 చ.అ. స్థలంలో హై ఎండ్ రిటైల్ బ్రాండ్స్ కొలువుతీరనున్నాయి. క్యాసినో ఏర్పాటుకు డామన్‌ని ఎంచుకోవడానికి ప్రత్యేక కారణం ఉందని వివరించారు డెల్టా కార్ప్ చైర్మన్ జైదేవ్ మోడి. అటు ముంబైకి, ఇటు గుజరాత్‌కి దగ్గర్లో ఉండటం వల్లే దీన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. ముంబై నుంచి 3 గంటల ప్రయాణ దూరంలోనూ, గుజరాత్‌లోని ప్రధాన నగరాలకు ఇది దగ్గర్లోనూ ఉంది. ఏటా 20 శాతం వృద్ధి.. గోవాలో డెల్టా కార్ప్‌కి చెందిన క్యాసినో వ్యాపారం గణనీయంగా వృద్ధి చెందుతోంది. కంపెనీ క్యాసినోలకి వచ్చే వారి సంఖ్య ఏటా 20% పెరుగుతోంది. డెల్టా కార్ప్‌కి చెందిన ఇతర క్యాసినోలకు వచ్చే వారు ప్రతిసారీ సగటున రూ.12,000-15,000 ఖర్చు చేస్తున్నారు. ఈ క్యాసినోలకు వచ్చే వారిలో భారతీయులే ఉంటున్నారు. 24-34 ఏళ్ల మధ్య వయస్సు గలవారు పోకర్ని ఆడేందుకు ఇష్టపడుతున్నారని మోడి వివరించారు.