తరతరాలకు సరిపడ సంపదలో అత్యుత్తమ దేశం ఇదే! | Sakshi
Sakshi News home page

తరతరాలకు సరిపడ సంపదలో అత్యుత్తమ దేశం ఇదే! భారత్‌ ఎన్నో స్థానంలో ఉందంటే..

Published Sat, Feb 17 2024 12:09 PM

Switzerland Is The Worlds Best Nation To Build Multi Generational Wealth - Sakshi

ఇంతవరకు ఆర్థికంగా, ఆకలి, కాలుష్యం, అక్షరాస్యతల పరంగా ఉత్తమ దేశాల జాబితను ప్రకటించడం చూశాం. అలాగే ఆ జాబితాలో తక్కువ స్థాయిలో ఉన్న దేశాలు మెరుగుపరుచుకోవాల్సిన అంశాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడూ తాజాగా తరతరాలకు సరిపడ సంపదను కూడబెట్టే అత్యుతమ దేశాల జాబిత వెల్లడైంది. అందులో ఏ దేశం బెస్ట్‌ స్థానంలో ఉందంటే..

నిజానికి సంపాదన సంభావ్యత, కెరీర్‌లో పురోగతి, ఉపాధి అవకాశాలు, ప్రీమియం విద్య, ఆర్థిక చలనశీలత, జీవనోపాధి వంటి ఆరు విభిన్న పారామితుల ఆధారంగా ఆయ దేశాల తరతరాలకు సరిపడ సంపదను అంచనా వేస్తారు. ఈ జాబితను ఇచ్చేది  పౌర సలహా సంస్థ హెన్లీ అండ్‌ పార్ట్‌నర్స్‌. ఈ కొత్త సూచీ ప్రకారం మొత్తం పారామితుల్లో సుమారు 85% స్కోర్‌తో స్విట్జర్లాండ్‌ అత్యుత్తమ స్థానాన్ని దక్కించుకుంది. ఆ పారామితులకు సంబంధించి.. సంపాదన సంభావ్యతలో (100), కెరీర్‌ పురోగతిలో (93), ఉపాధి అవకాశాల్లో (94) పాయింట్లతో స్విట్జర్లాండ్‌ అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

అంతేగాదు అధిక జీవన శైలి, ఆర్థిక చలనశీలపై కూడా స్విట్జర్లాండ్‌ 75 పాయింట్లు సాధించగా, ప్రీమియం విద్యలో 73 పాయింట్లు స్కోర్‌ చేసింది. ఇలా ఆయా మొత్తం విభాగాల్లో 82 శాతం స్కోర్‌ చేసి అమెరికా స్విట్జర్లాండ్‌ తర్వాతి స్థానానికి పరిమితమయ్యింది. అయితే ఉపాధి అవకాశాల పరంగా యూఎస్‌ స్విట్జర్లాండ్‌తో సమానంగా 94 పాయింట్లు సంపాదించుకుంది. కానీ సంపాదన సంభావ్యత(93), కెరీర్‌ పురోగత(86), అధిక జీవనోపాధి(68)లలో క్షీణించింది.

ఇక ఉపాధి అవకాశాలు, ప్రీమీయం విద్య పరంగా 74 పాయింట్లు స్కోర్‌ చేసింది. ఇక తరతరాలకు  సరిపడే సంపదలో.. భారతదేశం మొత్తం పారామితుల్లో సుమారు 32% పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. ఇది గ్రీస్‌తో పోలిస్తే తక్కువ. అలాగే జాబితాలో మొదటి 15 స్థానాల్లో చివరి స్థానానికి పరిమితమయ్యింది భారత్‌. ఆర్థిక చలనశీలతలో 8 పాయింట్లతో అత్యల్ప స్కోర్‌ చేయగా, ఇతర పారామితుల్లో 43 పాయింట్లతో అత్యధిక పురోగతిని కలిగి ఉంది. సింగపూర్‌ 79%తో మూడో స్థానంలో ఉండగా, అత్యధిక ఉపాధి అవకాశాల పరంగా మిగత 15 దేశాల కంటే ఎక్కువ పాయింట్లు స్కోర్‌ చేసింది. ఆస్ట్రేలియా 75% నాల్గో స్థానంలో ఉండగా, కెనడా 74%తో ఐదో స్థానంలో ఉంది. అలాగే గ్రీస్‌ 49%తో 15 దేశాల జాబితాలో చివరి స్థానంలో ఉంది. 

(చదవండి: చేతిలో చేయి వేసుకుని మరణించటం మాటలు కాదు..కన్నీళ్లు పెట్టించే భార్యభర్తల కథ!)

Advertisement
 
Advertisement
 
Advertisement