
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్తగా మూడు దేశాలకు సభ్యత్వం ఇచ్చింది. దీంతో ఐసీసీ సభ్య దేశాల సంఖ్య 106కు చేరింది. ఆసియా ఖండం నుంచి మంగోలియా, తజకిస్థాన్.. యూరప్ నుంచి స్విట్జర్లాండ్‌కు ఐసీసీ సభ్యత్వాలు ఇచ్చింది. ఆదివారం వర్చువల్‌గా జరిగిన 78వ సర్వసభ్య సమావేశంలో ఐసీసీ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. కొత్తగా సభ్యత్వం లభించిన దేశాలు వారి వారి ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధికి తోడ్పడాలని ఐసీసీ సూచించింది. అందుకు అవసరమైన మద్దతు తమవైపు నుంచి ఉంటుందని హామీ ఇచ్చింది.
Congratulations to Mongolia, Switzerland and Tajikistan, who are now among ICC's 94 Associate Members 👏
— ICC (@ICC) July 18, 2021
Know more about their journeys 👉 https://t.co/33UFKEgNZr pic.twitter.com/sw54PsPBir