బెర్న్: కరోనా వ్యాధిగ్రస్తులు వాసన గ్రహించే శక్తిని కోల్పోతున్నారట. వైరస్ సోకిన మూడో రోజు నుంచే ముక్కు పని చేయడం లేదని నిపుణులు చెప్తున్నారు. ఈ మేరకు ఒటోలారింగాలజీ మెడ్ అండ్ నెక్ సర్జరీ జర్నల్ అధ్యయనాన్ని ప్రచురించింది. అధ్యయనంలో భాగంగా స్విట్జర్లాండ్‌కు చెందిన సుమారు 103మంది రోగులను ఆరు వారాలపాటు పరిశీలించగా 61 శాతం మందికి వాసన తెలియట్లేదని తేలింది. కరోనా సోకిన మూడో రోజు నుంచి ఈ కొత్త లక్షణం ప్రారంభమవుతోంది. దీన్నే "అనోస్మియా" అంటారు. ఇది ఉన్నవారు శ్వాస ఆడకపోవడం, తీవ్ర దగ్గు, జ్వరంతో బాధపడుతారు. ఈ అధ్యయనం గురించి అమెరికాలోని సిన్‌సిన్నాటి యూనివర్సిటీకి చెందిన అహ్మద్ సెడఘట్ శాస్త్రవేత్త మాట్లాడుతూ.. కరోనా లక్షణాలు లేనప్పటికీ వాసన గుర్తుపట్టలేకపోతే వారిని అనుమానించాల్సిందేనన్నారు. (కరోనాపై యుద్ధమంటే..?)
అంతేకాక ఈ లక్షణం వల్ల సదరు పేషెంట్‌లో వైరస్ వ్యాప్తి తొలి దశలో ఉందన్న విషయం నిరూపితమవుతుందని తెలిపారు. అయితే ఇది ప్రమాదకరం కాదని, వాసన కోల్పోవడం వల్ల ఎవరూ చనిపోరని స్పష్టం చేశారు. కాబట్టి ఎవరైనా వాసన గుర్తించలేకపోతున్నారంటే వారిపై ఓ కన్నేయాల్సిందేనని హెచ్చరించారు. పైగా ఈ లక్షణం కరోనా పేషెంట్లను గుర్తించేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఇదిలా వుంటే ఈ అధ్యయనంలో 35 శాతం మంది ముక్కు దిబ్బడతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. కాబట్టి ఇతరుల నుంచి వైరస్ సోకకుండా రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరు మాస్కు ధరించడం అత్యవసరమని తెలిపారు. (కోవిడ్-19 : స్విస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం)
Comments
Please login to add a commentAdd a comment