మహమ్మారిని మాన‌వ‌త్వ‌మే అధిగ‌మిస్తుంది: మోదీ | Switzerland’s Matterhorn lit up with Indian flag to show solidarity | Sakshi
Sakshi News home page

మహమ్మారిని మాన‌వ‌త్వ‌మే అధిగ‌మిస్తుంది: మోదీ

Published Sat, Apr 18 2020 7:55 PM | Last Updated on Sat, Apr 18 2020 8:32 PM

Switzerland’s Matterhorn lit up with Indian flag to show solidarity - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : క‌రోనా మ‌హ‌మ్మారిని ప్ర‌పంచాన్ని ప‌ట్టి పీడిస్తుంది. ఈ త‌రుణంలో ప్ర‌జ‌ల్లో జీవితంపై ఆశ‌ను రేకుత్తించేలా ప్ర‌ఖ్యాత స్విట్జ‌ర్లాండ్ లైట్ ఆర్టిస్ట్ చేసిన ప్ర‌య‌త్నం విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. కోవిడ్‌-19పై భార‌త్ చేస్తున్న యుద్దానికి సంఘీభావంగా స్విట్జ‌ర్లాండ్‌లోని  14,692 అడుగుల ఎత్తైన మాట‌ర్‌హార్న్ ప‌ర్వ‌తం శుక్ర‌వారం భార‌త త్రివ‌ర్ణంతో ప్ర‌కాశించాయి. వీటికి సంబంధించిన ఫోటోల‌ను ప్ర‌ధాని మోదీ షేర్ చేశారు. క‌రోనా వైర‌స్‌ను మానవత్వం ఖచ్చితంగా అధిగమిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్ సందర్భంగా వివిధ మంత్రిత్వశాఖలు ప్రజలకు చేస్తున్న సహకారం, కరోనాపై పోరాటంలో చేస్తున్న ప్రయత్నాలను మోదీ ప్రశంసించారు. ‘కోవిడ్-19కు వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం కలిసి పోరాడుతుంది.. మానవత్వం ఖచ్చితంగా ఈ మహమ్మారిని అధిగమిస్తుంది’అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

దీంతోపాటు పలు మంత్రిత్వ శాఖలు చేసిన ట్వీట్లకు సైతం ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భారత రైల్వే బృందాన్ని చూస్తే గర్వంగా ఉంది.. కీలకమైన ఈ తరుణంలో నిరంతరం పౌరులకు సహాయం చేస్తున్నారని.. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ..దేశంలో ఇంధన అవసరాలను తీర్చడానికి నిరంతరాయంగా పనిచేసే వారందరికీ వందనాలు అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement