కృతి సనన్ ,నూపుర్ సనన్
సాక్షి, సిటీబ్యూరో: భారతదేశపు నటీనటులకు స్విట్జర్లాండ్ హాలిడే స్పాట్‌గా మారిందని ఆ దేశపు పర్యాటక సంస్థ నగర ప్రతినిధులు తెలిపారు. తాజాగా బాలీవుడ్ నటీమణులు, తోబుట్టువులు కృతి, నూపుర్ సనన్‌లు స్విట్జర్లాండ్‌లో వెకేషన్‌ను ఉల్లాసంగా గడిపారని, తమ బిజీ షెడ్యూల్ నుంచి విరామం తీసుకుని వీరిరువురూ అక్కడి బర్గెన్‌స్టాక్ రిసార్ట్‌లో ఎంజాయ్ చేశారని వివరించారు. ల్యూసెర్న్, చాపెల్ బ్రిడ్జ్ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ చిన్న పిల్లల తరహాలో వీరు తమ టూర్‌ని ఎంజాయ్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకర్షిస్తున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment