holiday spot
-
పడిలేచిన పట్టణం.. ఇక్కడికి వెళ్తే యూరప్ చూసినట్లే!
భూకంపం... భవనాన్ని కూల్చగలుగుతుంది తప్ప... నిర్మాణ స్ఫూర్తిని కాదు. భుజ్ పట్టణంలో పర్యటించిన వాళ్లు ఈ మాటను ఒకటికి వందసార్లు గుర్తు చేసుకుంటారు. రెండు దశాబ్దాల నాటి భూకంపం గుర్తుకు వస్తే నాటి శిథిలాలు కళ్ల ముందు మెదులుతాయి. వెన్నులో వణుకు మొదలవుతుంది. ఇప్పుడు భుజ్‌ని చూస్తే... అప్పుడు చూసిన ఆ పట్టణం ఇదేనా! అని ఆశ్చర్యం కలుగుతుంది. గంటపై వీక్షణం! భుజ్‌లో దిగి చుట్టూ చూస్తే మొదటగా దృష్టిని ఆకర్షించేది బెల్టవర్. ఆ టవర్‌తో కలగలిసి ఉన్న ప్రగ్ మహల్. బెల్ టవర్ మీద నుంచి భుజ్ పట్టణం మొత్తం కనిపిస్తుంది. ఈ మహల్ ఇండో– యూరోపియన్ నిర్మాణ శైలిలో ఉంటుంది. రెండవ ప్రగ్మాజీ నిర్మించిన ఈ మహల్‌కి యూరోప్ ఆర్కిటెక్ట్ కలొనెల్ హెన్రీ సెయింట క్లెయిర్ వికిన్స్ డిజైన్ చేశాడు. స్థానిక మిస్త్రీలు పనిచేశారు. ఈ మహల్లో అడుగుపెడితే కాళ్ల కింద ఇటాలియన్ మార్బుల్ నునుపుదనం, కళ్ల ముందు పాలరాతి గోడకు చెక్కిన జాలీ వర్క్ సౌందర్యం ఆకట్టుకుంటాయి. ప్రగ్ మహల్ తర్వాత తప్పక చూడాల్సిన నిర్మాణం ఆయినా మహల్, అందులోని హాల్ ఆఫ్ మిర్రర్స్ గది. హాల్ ఆఫ్ మిర్రర్స్ దీనిని డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ రామ్సిన్హ్ది ఇరవై ఏళ్ల పాటు యూరోప్‌లో పని చేసిన అనుభవం. అందుకే భుజ్ పర్యటనలో యూరప్ గుర్తు వస్తుంటుంది. అందులో అద్దాల అమరిక ఒక అద్భుతం, అలాగే బంగారు కోళ్ల మంచం కూడా. దానిని చూడగానే బంగారు కోళ్ల మంచం మీద శయనించిన జమీందారు ఎవరు? అనే సందేహం కలుగుతుంది. ఆ సందేహానికి సమాధానంగా ఆ గదిలోనే ఆ సంస్థానాధీశుడు లఖ్పత్జీది చిత్రపటం ఉంటుంది. దర్బార్ హాల్లో ఆడియెన్స్ హాల్, ప్లెజర్ హాల్, యాంటీ చాంబర్, మ్యారేజ్ హాల్ ఉన్నాయి. మ్యారేజ్ హాల్‌నే ఇప్పుడు... భుజ్ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే వస్తువుల మ్యూజియంగా మార్చారు. ఈ మ్యూజియంలో ప్రాచీన కచ్ రాత ప్రతులు, నాణేలు, కోరి కచ్ కరెన్సీ. ప్రాచీన కళాకృతులు, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్‌లు, సంగీత వాయిద్యాలు, లోహపు పాత్రలను చూడవచ్చు. స్వామి నారాయణ్ ఆలయం మార్కెట్ టూర్! ఇక భుజ్ టూర్లో మరో నిర్మాణ అద్భుత స్వామినారాయణ్ టెంపుల్. భూకంపం తర్వాతి పునర్నిర్మితాల్లో ఇదీ ఒకటి. కచ్ డెజర్ట్ సఫారీ వంటివన్నీ పూర్తయన తర్వాత భుజ్ పర్యటనలో ఆ పట్టణంలోని మార్కెట్లన్నింటినీ ఓ చుట్టు చుట్టి రాకపోతే చాలా మిస్సయినట్లే. విండో షాపింగ్ చేసినా ఫర్వాలేదు. చూసి తీరాల్సిన ప్రదేశాలు. సరఫ్ బజార్కెళ్తే కనీసం ఒక్క చనియా చోళీనైనా కొనకుండా బయటకు రాలేరు. చనయా చోళీ అంటే... అద్దాలను అందంగా అమర్చి కచ్ వర్క్ ఎంబ్రాయిడరీ చేసిన గుజరాతీ స్టైల్ బ్లవుజ్. రిసెప్షన్ హాల్ బెల్టవర్ చదవండి: అతిగా నిద్రపోతున్నారా? స్ట్రోక్ ఆ తర్వాత కార్డియక్ అరెస్ట్.. ఇంకా.. -
Tourist Spot: భరత్పూర్ బర్డ్ శాంక్చురీ విహారం.. ఖండాంతరాలు దాటి..
భరత్పూర్ బర్డ్ శాంక్చురీ... మన పక్షి ప్రేమికుడు సలీం అలీ మానసపుత్రిక. పక్షులు... ఖండాలు దాటి వస్తాయి. పర్యాటకులు... దేశాలు దాటి వస్తారు. పిల్లలు... ఏకంగా బడినే తెచ్చేస్తారు. worlds most important bird breeding: భరత్పూర్ బర్డ్ శాంక్చురీ రాజస్థాన్‌లో ఉంది. ఈ ప్రదేశం దేశరాజధాని ఢిల్లీకి ఆ రాష్ట్ర రాజధాని జైపూర్‌కు సమదూరంలో ఉంది. ఆగ్రాలో తాజ్‌మహల్ చూసిన తర్వాత పశ్చిమంగా యాభై కిలోమీటర్లు ప్రయాణిస్తే భరత్‌పూర్‌లో ఉంటాం. ఏటా ఇక్కడికి సైబీరియా పక్షులు వస్తాయి. ఇక్కడ ఉన్నవి, అతిథులుగా వచ్చినవి కలిపి మొత్తం 370 పక్షిజాతులను చూడవచ్చు. అందుకే ప్రపంచంలోని ఆర్నిథాలజిస్టులు భరత్‌పూర్‌కి క్యూ కడతారు. ఏడాదికి లక్ష మంది పర్యాటకులకు తగ్గరు, వారిలో యాభై వేల మంది విదేశీయులే. స్కూలు పిల్లలైతే ఆ పరిసరాల జిల్లాలే కాదు ఢిల్లీ నుంచి కూడా ఎక్స్కర్షన్కి భరత్‌పూర్‌కి వస్తారు. పిల్లలకు వంద పేజీల పుస్తకంతో కూడా చెప్పలేనన్ని సంగతులను ఒక్క టూర్‌తో చెప్పవచ్చు. అందుకే బడి అప్పుడప్పుడూ అడవిలోకి వచ్చేస్తుంటుంది. బర్డ్ సాంక్చురీలో ఏనుగు మీద విహారం ఏనుగు అంబారీ! భరత్పూర్ బర్డ్ శాంక్చురీలో ఎలిఫెంట్ సఫారీ, జీప్ సఫారీతోపాటు రిక్షా సఫారీ కూడా ఉంటుంది. పక్షులు శబ్దాలకు బెదిరి ఎగిరిపోకుండా ఉండాలంటే ఏనుగు మీద కానీ రిక్షాలో కానీ వెళ్లాలి. రిక్షావాలానే గైడ్‌గా వ్యవహరిస్తాడు. దట్టమైన అటవీప్రదేశంలోకి వెళ్లడానికి మాత్రం జీప్ సఫారీనే మంచి ఆప్షన్. ఇక్కడ సఫారీ పగలు మాత్రమే. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తుంది. బర్డ్ శాంక్చురీ ప్రవేశ ద్వారం దగ్గరే జీప్ బుక్ చేసుకోవాలి. మితిమీరిన శబ్దాలను, హారన్లను అనుమతించరు. సొంత వాహనంలో వెళ్లినా సరే శాంక్చురీకి రెండు కిలోమీటర్ల దూరంలో ఆ వాహనాన్ని వదిలి టూరిజం శాఖ వాహనాల్లోనే లోపలికి వెళ్లాలి. ఇక్కడ ఫొటోగ్రఫీ, వీడియో షూటింగ్‌ను అనుమతిస్తారు. కానీ ఎంట్రీ టికెట్‌తోపాటు కెమెరాలకు చార్జ్ చెల్లించాలి. చదవండి: ఈ సబ్బు ఖరీదు తెలిస్తే మూర్చపోతారు!.. రూ. 2.7 లక్షలట!! వేటాడే అడవి కాదిప్పుడు ►ఇది ఒకప్పుడు భరత్పూర్ రాజుల వేటమైదానం. బ్రిటిష్ వైశ్రాయ్‌లు కూడా ఏటా ఇక్కడ డక్షూట్ నిర్వహించేవారు. ►ఒక ఏడాది వైశ్రా య్ లార్డ్ లినిత్గౌ వేటలో వేలాది పక్షులు వేట ఆనందానికి బలయ్యాయి. ►ప్రసిద్ధ పక్షి ప్రేమికుడు సలీం అలీ కృషితో నలభై ఏళ్ల కిందట ఈ ప్రదేశం పక్షి సంరక్షణ కేంద్రంగా మారింది. ►1985లో ఇది వర ల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందింది. ►అడవిలో నేల రాళ్ల మయం. నున్నటి కాలిబాట వంటి రోడ్డు కూడా ఉండ దు. రాళ్లబాటలోనే నడవాలి. కాబట్టి ఈ టూర్లో మంచి షూస్ ధరించాలి. ►ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ, జైపూర్ టూర్ ప్లాన్‌లో భరత్పూర్ కూడా ఇమిడిపోతుంది. ఇదే మంచికాలం! ఖండాంతరాల నుంచి వచ్చే వలస పక్షులను చూడాలంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో వెళ్లాలి. ఆహ్లాదకరంగా వెకేషన్ కోసమే అయితే ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఎప్పుడైనా వెళ్లవచ్చు. గడ్డకట్టే చల్లని వాతావరణం నుంచి సమశీతోష్ణమైన వాతావరణాన్ని వెతుక్కుంటూ వచ్చే ఈ పక్షులకు ఆరు నెలల పాటు మంచి విడిది భరత్పూర్ బర్డ్ శాంక్చురీ. ఏదైనా కారణం చేత ఒక ఏడాది నీటి నిల్వలు లేకపోయినట్లయితే ఈ పక్షులు నీళ్లున్న వేరే ప్రాంతాలను వెతుక్కుంటూ వెళ్లిపోతాయి. ఒకసారి ఈ చక్రం గాడి తప్పితే మళ్లీ పక్షులు ఈ ప్రదేశానికి రావడానికి చాలా ఏళ్లు పడుతుంది. ఈ బర్డ్ శాంక్చురీ అసలు పేరు కేలాదేవ్ నేషనల్ పార్క్. ఈ పక్షి సంరక్షణ కేంద్రం భరత్‌పూర్‌కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. అందుకే భరత్‌ఫూర్ శాంక్చురీగా వాడుకలోకి వచ్చింది. ఆకాశంలో ఉండే ఇంద్రధనస్సు నేలకు దిగి పక్షుల రెక్కల్లో ఒదిగిపోయినట్లు్ల ఉంటుంది. రంగురంగుల పక్షులు నీటిలో మునిగి చేపలు పట్టుకుని కడుపు నిండిన తర్వాత ఒడ్డుకు చేరతాయి. తడిసిన రెక్కలను విప్పార్చి సన్‌బాత్ చేస్తున్న దృశ్యం ఈ టూర్లో కనువిందు చేసే మరో ప్రత్యేకత. చదవండి: ఈ సరస్సుకు వెళ్లినవారు ఇప్పటివరకు తిరిగి రాలేదు!.. మిస్టీరియస్.. -
స్విట్జర్లాండ్‌లో సినీ సిస్టర్స్
సాక్షి, సిటీబ్యూరో: భారతదేశపు నటీనటులకు స్విట్జర్లాండ్ హాలిడే స్పాట్‌గా మారిందని ఆ దేశపు పర్యాటక సంస్థ నగర ప్రతినిధులు తెలిపారు. తాజాగా బాలీవుడ్ నటీమణులు, తోబుట్టువులు కృతి, నూపుర్ సనన్‌లు స్విట్జర్లాండ్‌లో వెకేషన్‌ను ఉల్లాసంగా గడిపారని, తమ బిజీ షెడ్యూల్ నుంచి విరామం తీసుకుని వీరిరువురూ అక్కడి బర్గెన్‌స్టాక్ రిసార్ట్‌లో ఎంజాయ్ చేశారని వివరించారు. ల్యూసెర్న్, చాపెల్ బ్రిడ్జ్ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ చిన్న పిల్లల తరహాలో వీరు తమ టూర్‌ని ఎంజాయ్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకర్షిస్తున్నాయన్నారు. -
అక్కడికెళితే ఆనందమే ఆనందం!
చేతినిండా పని దొరికితే ఎవరికైనా ఆనందంగానే ఉంటుంది. కానీ, ఆ ఆనందం తాలూకు అలసట పోవాలంటే కాస్త గ్యాప్ కావాలి. బిజీ బిజీగా సినిమాలు చేసే కాజల్ అగర్వాల్‌కి కొంచెం గ్యాప్ దొరికితే ఏం చేస్తారో తెలుసా? విహార యాత్ర ప్లాన్ చేసేసుకుంటారు. ఆ విషయం గురించి కాజల్ మాట్లాడుతూ - ‘‘నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. షూటింగ్స్ కోసం బోల్డన్ని ప్రయాణాలు చేస్తుంటాను. కానీ, ఏ బాధ్యతా లేకుండా కేవలం ఎంజాయ్‌మెంటే లక్ష్యంగా హాలిడే ట్రిప్స్‌కి వెళతాం చూడండి.. అవంటే చాలా ఇష్టం. షూటింగ్స్‌కి బ్రేక్ దొరికితే ప్రపంచాన్ని చుట్టేయాలనుకుంటాను. వీలైనన్ని ఎక్కువ దేశాలు వెళ్లాలనుకుంటాను. కొత్త మనుషులను కలిసినప్పుడు కొత్త విషయాలు తెలుస్తాయి. అలాగే, కొత్త పరిసరాలు మనకు తెలీయకుండా కొత్త ఎనర్జీనిస్తాయి. నాకు బాగా ఇష్టమైన హాలిడే స్పాట్ ఇండోనేషియాలోని బాలి. అక్కడి వాతావరణం, మనుషులు ఇష్టం. ఫుడ్ కూడా బాగుంటుంది. అందుకే, అక్కడికెళ్లినప్పుడు, ‘ఇంతకు మించిన ఆనందం ఎక్కడ దొరుకుతుంది’ అనిపిస్తుంది’’ అన్నారు. -
ముస్సోరీకి సచిన్
డెహ్రడూన్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ విశ్రాంతి కోసం ముస్సోరీ చేరాడు. డెహ్రడూన్‌కు 20కి.మీ. దూరంలో ఉన్న ముస్సోరీ భారత్‌లో సచిన్‌కు బాగా ఇష్టమైన హాలిడే స్పాట్. ముంబై నుంచి చార్టెడ్ విమానంలో భార్య అంజలితో కలిసి సచిన్ వచ్చాడు. తన స్నేహితుడు, వ్యాపార భాగస్వామి సంజయ్ నారంగ్‌కు చెందిన హోటల్(గెస్ట్‌హౌస్)లో బస చేశాడు. గత ఏడాది వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా సచిన్ కొన్నిరోజులు ఇక్కడే ఉన్నాడు.