
ఫీనిక్స్: నిర్మాణం, వ్యవసాయ అవసరాలకు వినియోగించే వాహనాల తయారీలో ఉన్న సీఎన్‌హెచ్ ఇండస్ట్రియల్ మూడేళ్లలో 1,000 మందికిపైగా ఐటీ నిపుణులను నియమించుకోనుంది.
గురుగ్రామ్‌లోని టెక్నాలజీ సెంటర్‌లో వీరు పనిచేయాల్సి ఉంటుంది. కేస్ బ్రాండ్‌లో నిర్మాణ రంగానికి, న్యూ హాలండ్ బ్రాండ్‌లో ట్రాక్టర్లు, హార్వెస్టర్లను కంపెనీ 180 దేశాల్లో విక్రయిస్తోంది. భారత్‌లో కంపెనీలో ఇప్పటికే 2,500 మంది ఉద్యోగులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment