సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి వియత్నాం పర్యటన ముగిసింది. ఏపీ యువతకు ఉపాధి, పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు, వృత్తి విద్య, శిక్షణపై అధ్యయనమే లక్ష్యంగా దక్షిణ కొరియా, వియత్నాం దేశాలలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పది రోజుల పర్యటించారు. ఈ పర్యటనలో చివరి రోజైన మంగళవారం హోచిమిన్ సిటీలోని సైగాన్ హైటెక్ ఇండ్రస్టియల్ పార్క్‌లో ఉన్న అంతర్జాతీయ ఎల్రక్టానిక్స్ ట్రైనింగ్ సెంటర్‌ను అధికారుల బృందంతో కలసి సందర్శించారు.
పార్కును తీర్చిదిద్దిన తీరు, టెక్నాలజీ అంశాలపై సైగాన్ హైటెక్ పార్కు అధ్యక్షుడు న్గుయెన్ అన్హ్ థీని అడిగి తెలుసుకున్నారు. ఏపీలో పెట్టుబడులకు అవకాశాలున్న రంగాలపై ప్రతినిధులతో చర్చించారు. పెద్దఎత్తున యువతకు ఉపాధి అవకాశాల కల్పన కోసం ఆంధ్రప్రదేశ్‌లో శిక్షణ కేంద్రాల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు మంత్రి చెప్పారు.
వాణిజ్యం, పెట్టుబడులు, వృత్తి శిక్షణలో సహకారం, అవకాశాలపై మన అధికారుల బృందం అధ్యయనం చేసింది. వియత్నాంలోని అతిపెద్ద సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ‘మోవి’ని మంత్రి బుగ్గన సందర్శించారు. సాల్మన్ ఫిష్ (మాఘ చేప), ట్యూనా ఫిష్ (తూర చేప)లను శుద్ధి చేసే యూనిట్లోని టెక్నాలజీని అడిగి తెలుసుకున్నారు. డాంగ్ నై ప్రావిన్స్ వైస్ చైర్మన్‌తో ఆర్ధిక మంత్రి బుగ్గన సమావేశమై. ఏపీలో పర్యటించాలని వైస్ చైర్మన్‌ను ఆహ్వానించారు.
ఉపాధి, శిక్షణపై విస్తృత అధ్యయనం
Published Wed, Jul 26 2023 4:39 AM | Last Updated on Wed, Jul 26 2023 9:28 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment