Vocational Education
-
ఉపాధి, శిక్షణపై విస్తృత అధ్యయనం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి వియత్నాం పర్యటన ముగిసింది. ఏపీ యువతకు ఉపాధి, పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు, వృత్తి విద్య, శిక్షణపై అధ్యయనమే లక్ష్యంగా దక్షిణ కొరియా, వియత్నాం దేశాలలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పది రోజుల పర్యటించారు. ఈ పర్యటనలో చివరి రోజైన మంగళవారం హోచిమిన్ సిటీలోని సైగాన్ హైటెక్ ఇండ్రస్టియల్ పార్క్‌లో ఉన్న అంతర్జాతీయ ఎల్రక్టానిక్స్ ట్రైనింగ్ సెంటర్‌ను అధికారుల బృందంతో కలసి సందర్శించారు. పార్కును తీర్చిదిద్దిన తీరు, టెక్నాలజీ అంశాలపై సైగాన్ హైటెక్ పార్కు అధ్యక్షుడు న్గుయెన్ అన్హ్ థీని అడిగి తెలుసుకున్నారు. ఏపీలో పెట్టుబడులకు అవకాశాలున్న రంగాలపై ప్రతినిధులతో చర్చించారు. పెద్దఎత్తున యువతకు ఉపాధి అవకాశాల కల్పన కోసం ఆంధ్రప్రదేశ్‌లో శిక్షణ కేంద్రాల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు మంత్రి చెప్పారు. వాణిజ్యం, పెట్టుబడులు, వృత్తి శిక్షణలో సహకారం, అవకాశాలపై మన అధికారుల బృందం అధ్యయనం చేసింది. వియత్నాంలోని అతిపెద్ద సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ‘మోవి’ని మంత్రి బుగ్గన సందర్శించారు. సాల్మన్ ఫిష్ (మాఘ చేప), ట్యూనా ఫిష్ (తూర చేప)లను శుద్ధి చేసే యూనిట్‌లోని టెక్నాలజీని అడిగి తెలుసుకున్నారు. డాంగ్ నై ప్రావిన్స్ వైస్ చైర్మన్‌తో ఆర్ధిక మంత్రి బుగ్గన సమావేశమై. ఏపీలో పర్యటించాలని వైస్ చైర్మన్‌ను ఆహ్వానించారు. -
ఉపాధికి ఊతమిచ్చేలా.. ఇంటర్ ఒకేషనల్ కోర్సులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధికి ఊతమిచ్చేలా ఇంటర్ ఒకేషనల్ విద్యపై ఇంటర్మీడియెట్ బోర్డు దృష్టి సారించింది. జూనియర్ కాలేజీల్లో ఒకేషనల్ కోర్సుల ద్వారా విద్యార్థులకు మేలు జరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇంటర్ ఒకేషనల్ కోర్సులు చదువుతున్నవారితో అప్రెంటీస్‌షిప్ చేసేందుకు వీలుగా పలు కంపెనీలను అనుసంధానం చేస్తోంది. అంతేకాకుండా విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగయ్యేలా చర్యలు చేపడుతోంది. 80 వేల మందికి పైగా విద్యార్థులు.. ఒకేషనల్ కోర్సులను సంబంధిత ప్రత్యేక కాలేజీల్లోనే కాకుండా రెగ్యులర్ కాలేజీల్లోనూ ఇంటర్మీడియెట్ బోర్డు అందిస్తోంది. రాష్ట్రంలో ఇంటర్ ఒకేషనల్ కాలేజీలు 8 ఉండగా రెగ్యులర్ కాలేజీలు 464 ఉన్నాయి. రెగ్యులర్ కాలేజీల్లో మామూలు కోర్సులతోపాటు అదనంగా వీటిని బోధిస్తున్నారు. ఫస్టియర్‌లో 23 రకాల కోర్సులు, సెకండియర్‌లో 25 రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 80 వేల మందికిపైగా ఒకేషనల్ కోర్సులను అభ్యసిస్తున్నారు. ప్రతినెలా ఉపకార వేతనం.. ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసినవారికి అప్రెంటీస్‌షిప్ కోసం ఇంటర్ బోర్డు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఏటా వివిధ కంపెనీలన్నింటినీ ఒకే చోటకు చేర్చి మేళాలను నిర్వహిస్తోంది. ఈ నెల 22న రాష్ట్రంలో ముఖ్య పట్టణాల్లో ఈ మేళాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఆయా కంపెనీల్లో అప్రెంటీస్‌షిప్ పూర్తి చేయగానే వారికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘రీజనల్ డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్’ (ఆర్డీఎస్డీఈ) ద్వారా సర్టిఫికెట్లు జారీ అవుతాయి. ఈ ధ్రువపత్రాలను కంపెనీలు ప్రముఖంగా పరిగణనలోకి తీసుకుంటాయి. అప్రెంటీస్‌షిప్‌లో విద్యార్థులకు సంబంధిత కంపెనీ, ఆర్డీఎస్డీఈ కలిపి నెలకు రూ.7 వేలు చొప్పున ఉపకార వేతనం కూడా అందిస్తున్నాయి. సర్టిఫికెట్లు పొందిన వారి కోసం ఏటా మార్చిలో కంపెనీలతో కలసి ఇంటర్ బోర్డు జాబ్ మేళాలను నిర్వహిస్తోంది. అలాగే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇంగ్లిష్ ఫ్లూయెన్సీ, కంప్యూటర్ పరిజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాల్లో శిక్షణ ఇప్పించనుంది. డిమాండ్ ఉన్న కోర్సులు కూడా.. ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకనుగుణంగా ఇంటర్ బోర్డు ఒకేషనల్ కోర్సులను అందిస్తోంది. ఈ కోర్సులన్నిటికీ చాలా డిమాండ్ ఉంది. వీటిలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ప్రింటింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, మెకానికల్, ఆటోమొబైల్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్, సివిల్ ఇంజనీరింగ్ కోర్సులున్నాయి. ఇవే కాకుండా కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, టూరిజం–ట్రావెల్ టెక్నిక్స్ కోర్సులూ విద్యార్థులకు మేలు చేకూరుస్తున్నాయి. ఇక వైద్య రంగానికి సంబంధించి మల్టీపర్పస్ హెల్త్‌వర్కర్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరఫీ, ఆఫ్తాల్మిక్ టెక్నీషియన్ కోర్సులకు అపార ఉద్యోగావకాశాలు ఉన్నాయి. కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, ఫ్యాషన్–గార్మెంట్ మేకింగ్ కోర్సులు పూర్తి చేసినవారికి ఆయా కంపెనీలు ఉద్యోగాలు ఇస్తున్నాయి. పదో తరగతి తప్పినవారికి షార్ట్ టర్మ్ కోర్సులు పదో తరగతి తప్పినవారికి కూడా ఇంటర్ బోర్డ్ ఆన్ జాబ్ ట్రైనింగ్ (ఓజేటీ) కింద 3, 9 నెలల కాలవ్యవధితో షార్ట్ టర్మ్ ఒకేషనల్ కోర్సులను ప్రవేశపెట్టింది. ఈ కోర్సులను కూడా విద్యార్థులకు ఉపాధి కల్పించేలా రూపొందించారు. అగ్రికల్చర్లో 8, బిజినెస్ కామర్స్, రిటైల్ మార్కెటింగ్‌ల్లో 11, కంప్యూటర్ సైన్స్‌లో 16, ఇంజనీరింగ్ టెక్నాలజీలో 15, హోం సైన్స్‌లో 14, హ్యుమానిటీస్‌లో 2, పారామెడికల్ విభాగంలో 6 కోర్సులు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్‌లో వెబ్ డిజైనింగ్, కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎంఎస్ ఆఫీస్, యూనిక్స్ సీ అండ్ సీ ప్లస్ ప్లస్, వీబీ, ఒరాకిల్, పైథాన్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, మల్టీమీడియా గ్రాఫిక్స్, యానిమేషన్, డేటా సైన్స్ వంటి జాబ్ ఓరియెంటెడ్ కోర్సులతో విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఉద్యోగం, ఉపాధి అందించే కోర్సులు ఇంటర్ ఒకేషనల్ కోర్సులన్నీ ఇంచుమించు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేవే. ఇందుకోసం అధ్యాపకులను బృందాలుగా ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో కంపెనీలతోపాటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఇంటర్ బోర్డు కోర్సులకు రూపకల్పన చేసింది. ప్రధానంగా అగ్రికల్చర్, బిజినెస్–కామర్స్, ఇంజనీరింగ్ టెక్నాలజీ, హ్యుమానిటీస్, హోంసైన్స్, పారామెడికల్ విభాగాల్లో ఒకేషనల్ కోర్సులు ఉన్నాయి. అగ్రికల్చర్లో.. క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్, సెరికల్చర్, ఫిషరీస్, లైవ్‌స్టాక్ మేనేజ్మెంట్, డెయిరీ కోర్సులున్నాయి. బిజినెస్–కామర్స్‌లో.. అకౌంటింగ్ ట్యాక్సేషన్, ఆఫీస్ అసిస్టెంట్‌షిప్, బ్యాంకింగ్, రిటైల్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, మార్కెటింగ్ కోర్సులున్నాయి. -
జూలై 27 నుంచి ఎంసెట్
ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ తదితర సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించాల్సిన ఎంసెట్–2020 ఆన్లైన్ పరీక్షలు జూలై 27 నుంచి 31 వరకు జరగనున్నాయి.అలాగే ఇతర కోర్సుల ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లలో కూడా మార్పులు చేశారు. ఈ మేరకు సవరించిన వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ తదితర సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించాల్సిన ఎంసెట్–2020 ఆన్లైన్ పరీక్షలు జూలై 27 నుంచి 31 వరకు జరగనున్నాయి. అలాగే ఇతర కోర్సుల ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లలో కూడా మార్పులు చేశారు. ఈ మేరకు సవరించిన వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ ప్రేమ్‌కుమార్ బుధవారం విడుదల చేశారు. ఎంసెట్ పరీక్షలను ఏప్రిల్ 20 నుంచి 24 వరకు నిర్వహించేలా షెడ్యూల్‌ను గతంలో ఉన్నత విద్యామండలి ప్రకటించిన విషయం తెలిసిందే. వాటితో పాటు ఈసెట్, ఐసెట్, పీజీసెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్ తదితర సెట్ల తేదీలను కూడా విడుదల చేసింది. అయితే కరోనా, లాక్డౌన్లతో ప్రవేశ పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో వాటిని విద్యామండలి నిరవధికంగా అప్పట్లో వాయిదా వేసింది. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, ఐఐఎస్ఈఆర్ తదితర జాతీయ విద్యాసంస్థల్లోకి నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. తాజాగా జేఈఈ మెయిన్స్ ఆన్లైన్ పరీక్షలను జూలై 18 నుంచి 23 వరకు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ తదితర కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంసెట్ ఇతర సెట్ల నిర్వహణకు వీలుగా షెడ్యూళ్లను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఇప్పటికే ఈ ప్రవేశ పరీక్షలకు ఆన్లైన్ దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఎంసెట్‌కు 2,48,614 దరఖాస్తులు అందాయి. వీటిలో ఇంజనీరింగ్‌కు 1,69,137, అగ్రి,మెడికల్‌కు 78,959, రెండింటికీ 518 దరఖాస్తులు వచ్చాయి. -
ఇంజనీరింగ్, వృత్తి విద్య కొత్త షెడ్యూల్
జేఈఈ మెయిన్ పరీక్షలను జూలై 18 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అడ్వాన్స్డ్ పరీక్షలను ఆగస్టులో నిర్వహిస్తామని వెల్లడించింది. అలాగే ఇంజనీరింగ్, వృత్తి విద్య కోర్సులకు అనుమతులు, తరగతుల నిర్వహణకు సంబంధించి 2020–21 షెడ్యూల్‌ను సవరిస్తూ ఏఐసీటీఈ ఉత్తర్వులు జారీచేసింది. సాక్షి, అమరావతి: లాక్డౌన్ నేపథ్యంలో ఇంజనీరింగ్, వృత్తి విద్య కోర్సులకు అనుమతులు, తరగతుల నిర్వహణకు సంబంధించి 2020–21 షెడ్యూల్‌ను సవరిస్తూ అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఉత్తర్వులు జారీచేసింది. తొలుత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకు కొత్త విద్యాసంస్థలకు ఫిబ్రవరి 28 వరకు, పాత విద్యాసంస్థలు అనుమతుల పునరుద్ధరణ కోసం మార్చి 5 వరకు గడువు ఇచ్చారు. ఈమేరకు కాలేజీల పత్రాల పరిశీలన, అనుమతుల మంజూరు, తరగతుల నిర్వహణకు హేండ్‌బుక్ కూడా విడుదలైంది. అయితే కరోనా, లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో యూజీసీ నియమించిన నిపుణుల కమిటీలు ప్రస్తుత విద్యాసంవత్సరంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలు, కొత్త విద్యాసంవత్సరం ప్రారంభానికి సంబంధించి ఇటీవలే సిఫార్సులు అందించాయి. ఈ నేపథ్యంలో దీనికి అనుగుణంగా షెడ్యూల్‌ను సవరిస్తూ ఏఐసీటీఈ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ సవరించిన పరీక్షల షెడ్యూల్‌ను కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఢిల్లీలో విడుదల చేశారు. ఏప్రిల్‌లో జరగాల్సిన ఈ పరీక్షలను కరోనా నేపథ్యంలో వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఆన్లైన్లోనే అంతా.. ► ఆన్లైన్ ద్వారా కాలేజీలకు ఏఐసీటీఈ అనుమతులు ఇవ్వనుంది. ► ఆయా కాలేజీల యాజమాన్యాలు డాక్యుమెంట్ల అప్లోడ్, పరిశీలనకు ఆన్లైన్ వేదికలను వినియోగించుకోవాలి. ► మైక్రోసాఫ్ట్ టీమ్స్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేసుకొని పత్రాలను అప్లోడ్ చేయాలి. ► స్క్రూటినీ కమిటీ ఆన్లైన్ ద్వారానే పరిశీలన పూర్తిచేస్తుందని ఏఐసీటీఈ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ రాజీవ్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జూలై 18 నుంచి జేఈఈ మెయిన్.. జేఈఈ మెయిన్ ఆన్లైన్ పరీక్షలను జూలై 18, 20, 21, 22, 23 తేదీల్లో నిర్వహించనున్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఆగస్టులో నిర్వహిస్తామని, తేదీ తర్వాత ప్రకటిస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. కొత్త షెడ్యూల్ ఇలా... ► అనుమతుల మంజూరు: జూన్ 15 ► వర్సిటీల గుర్తింపు అనుమతులు: జూన్ 30 ► తొలి విడత కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు: ఆగస్టు 15 వరకు ► రెండో విడత కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు: ఆగస్టు 25 వరకు ► ఖాళీ సీట్లకు ప్రవేశాలు: ఆగస్టు 31 వరకు ► పీజీడీఎం, పీజీసీఎం మినహా ఇతర అన్ని సాంకేతిక తరగతుల ప్రారంభం: ఆగస్టు 1 ► కొత్తగా ప్రవేశం పొందే మొదటి సంవత్సరం విద్యార్థులకు, సెకండ్ ఇయర్ లేటరల్ ఎంట్రీ పొందే వారికి తరగతులు: సెప్టెంబర్ 1 ► ప్రస్తుతం పీజీడీఎం, పీజీసీఎం విద్యార్థులకు తరగతులు: జూలై 1 ► ఫుల్ రిఫండ్‌తో పీజీడీఎం, పీజీసీఎం సీట్ల కేన్సిలేషన్కు చివరి తేదీ: జూలై 25 ► కొత్త అడ్మిషన్లకు చివరి తేదీ: జూలై 31 ► పీజీడీఎం, పీజీసీఎం కొత్త విద్యార్ధులకు తరగతులు: ఆగస్టు 2020 ఆగస్టు 1 నుంచి 2021 జూలై 31వరకు ► దూరవిద్య కోర్సుల విద్యార్థులకు ప్రవేశాలు: 2020 ఆగస్టు 15నుంచి 2021 ఫిబ్రవరి 15 వరకు. -
హైస్కూళ్లలో వృత్తి విద్య
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో 12వ పంచవర్ష ప్రణాళిక అంచనా ప్రకారం 19 ఏళ్ల నుంచి 24 ఏళ్ల లోపు వారిలో వృత్తి విద్యను అభ్యసిస్తున్న వారు 5 శాతం లోపే ఉన్నారు. ఇతర దేశాలతో పోల్చితే ఇది చాలా తక్కువ. ఆ వయసు వారు అమెరికాలో 52% మంది, జర్మ నీలో 75% మంది.. దక్షిణ కొరి యాలో 96% మంది వృత్తి విద్యను అభ్యసిస్తున్న వారే ఉన్నారు. కానీ మన దేశంలో పరిస్థితి అందుకు భిన్నం. అందుకే 2025 నాటికి దేశంలోని 50 శాతం మంది విద్యార్థులైనా వృత్తి కోర్సు లను అభ్యసించేలా చర్యలు చేపట్టాల్సిందే.. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య, యూనివర్సిటీల వరకు వృత్తి విద్యా కోర్సులను కచ్చితంగా ప్రవేశ పెట్టా ల్సిందే..’అని నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) నివేదికలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం 2017 జూన్‌లో డాక్టర్ కస్తూరి రంగన్ నేతృత్వంలో నిపు ణుల కమిటీని నియమించింది. 2019 మే నెలలో తమ డ్రాఫ్ట్ పాలసీని ఆ కమిటీ కేంద్ర మానవ వన రుల అభివృద్ధి శాఖకు (ఎంహెచ్ఆర్డీ) అంద జేసింది. దానిపై ఎంహెచ్ఆర్డీ దేశవ్యాప్తంగా నిపు ణులు, మేధావుల నుంచి అభిప్రాయాలను సేకరిం చింది. వాటిన్నింటినీ పరిగణన లోకి తీసుకొని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ–2020 ఫైనల్ కాపీని అం దుబాటులోకి తెచ్చింది. అందులో వృత్తి విద్యకు సంబంధించిన కీలక సిఫారసులు చేసింది. ఒకప్పుడు డ్రాపౌట్స్ కోసమే.. ఇతర దేశాలతో పోల్చితే వృత్తి విద్యా కోర్సులను చదువుతున్న యువత దేశంలో చాలా తక్కువగా ఉందని, ఈ నేపథ్యంలో వృత్తి విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని నూతన విద్యా విధానంలో కమిటీ సిఫారసు చేసింది. గతంలో వృత్తి విద్యా కోర్సులను కేవలం డ్రాపౌట్స్ కోసమే 8వ తరగతిలో కొనసాగించినా ఇప్పుడు దానిని పాఠశాల విద్య స్థాయి నుంచి కాలేజీల్లోనూ ప్రవేశపెట్టాల్సిన అవసర ముందని పేర్కొంది. వొకేషనల్ సబ్జెక్టులతో 11–12 తరగతులు పూర్తి చేసే వారు ఉన్నత విద్యలోలోనూ వొకేషనల్ కోర్సులను చదువుకునేలా అవకాశాలను మెరుగుప ర్చాల్సిన అవసరముందని స్పష్టంచేసింది. స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీలు.. ఇలా అన్ని స్థాయిల్లో వృత్తి విద్యను దశల వారీగా అమలు చేయాల్సిందేనని వెల్లడించింది. ప్రాథమి కోన్నత పాఠశాల దశ నుంచే నాణ్యమైన వృత్తి విద్యను అందిస్తూ ఉన్నత విద్య వరకు తీసుకెళ్లాలని స్పష్టం చేసింది. అంతేకాదు ప్రతి విద్యా ర్థి ఒక వృత్తి విద్యా కోర్సును చది వేలా చర్యలు చేపట్టాలని వెల్ల డించింది. ఇలా 2025 నాటికి కనీసంగా 50 శాతం మంది వృత్తి విద్యా కోర్సులను చదివేలా చూడాలని వివరించింది. రెగ్యులర్ కోర్సులతో పాటు దూరవిద్యలోనూ.. రెగ్యులర్ కోర్సులతోపాటు దూ ర విద్యా విధానంలోనూ వీలైన న్ని కోర్సులను అమలు చేసేందు కు చర్యలు చేపట్టాలని ఎన్ఈపీ పేర్కొంది. మొత్తానికి వచ్చే పదేళ్లలోగా వృత్తి విద్యను ప్రధా న విద్యగా అన్ని సెకండరీ స్కూళ్ల లో అమలు చేయాలని స్పష్టం చేసింది. అలాగే సెకండరీ స్కూళ్ల తో ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు, స్థానిక పరిశ్రమలను అనుసం ధానం చేయాలని, ఉన్నత విద్యా సంస్థలు సొంతంగా లేదా పారిశ్రామిక భాగస్వామ్యంతో వృత్తి విద్యా కోర్సులను నిర్వహించాలని పేర్కొంది. ఉన్నత విద్యలో 2013లో బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ డిగ్రీని ప్రవేశపెట్టినా, అది సరిపోదని పేర్కొంది. అన్ని ఇతర డిగ్రీ కోర్సుల్లో వొకేషనల్ కోర్సులు ఉండేలా చూడాలని వెల్లడించింది. స్థానిక అవకాశాల మేరకు కోర్సులు.. ఉన్నత విద్యా సంస్థలు సాఫ్ట్ స్కిల్ తదితర సర్టిఫికెట్ కోర్సులను ప్రవేశపెట్టాలని ఎన్ఈపీ సిఫారసు చేసింది. దేశంలో ఏయే రంగాల్లో స్కిల్ గ్యాప్ ఉందో పరిశీలించి, స్థానికంగా ఉపాధి అవ కాశాలు ఏయే రంగాల్లో ఉన్నాయో చూసి అలాంటి కోర్సులను ప్రవేశ పెట్టాలని స్పష్టం చేసింది. టెక్నికల్ ఎడ్యుకేషన్, వొకేషనల్ ఎడ్యుకేషన్‌ను సమగ్ర విద్యా విధా నంలో భాగంగా చే యాల్సిందేనని తెలి పింది. ఇందుకోసం విద్యా మంత్రిత్వ శాఖ, పారిశ్రామిక భాగస్వా మ్యంతో నేషనల్ కమిటీ ఫర్ ది ఇంటి గ్రీషన్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీఐవీఈ) ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఇందు కు అవసరమై న బడ్జెట్‌ను కూడా కేటాయించాలని పేర్కొంది. విద్యా సంస్థలు అవకాశాలు ఎక్కడెక్క డ ఉన్నాయో ఆలోచించి, పరిశీలించి ఎన్‌సీఐవీఈ సహకారంతో కొత్త కోర్సులను ప్రారంభించాలని స్పష్టంచేసింది. -
ఏప్రిల్ 20 నుంచి ఏపీ ఎంసెట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్ సహా వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశపరీక్షల షెడ్యూల్ విడుదలైంది. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ సోమవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఏపీఎంసెట్ – 2020ను ఏప్రిల్ 20 నుంచి 24వరకు ఆన్లైన్లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేశ్ మాట్లాడుతూ.. అన్ని ప్రవేశపరీక్షలను ఆన్లైన్లోనే నిర్వహిస్తామని చెప్పారు. అభ్యర్థుల ధ్రువపత్రాలను కూడా ఆన్లైన్లోనే పరిశీలిస్తామని తెలిపారు. ఇందుకు మీసేవ, ఏపీ ఆన్లైన్, ఎస్ఎస్సీ బోర్డ్, ఇంటర్మీడియెట్ బోర్డ్, తదితర సంస్థలతో అనుసంధానం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ధ్రువపత్రాల పరిశీలనలో ఎవరికైనా ఇబ్బందులు తలెత్తితే అలాంటి వారి కోసం ప్రతి జిల్లాలో రెండు హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రవేశపరీక్షలు పూర్తయ్యాక అడ్మిషన్ల కన్వీనర్లతోపాటు అడ్మిషన్ల తేదీలను ప్రకటిస్తామని వివరించారు. తెలంగాణ ఎంసెట్ కంటే ముందుగానే రాష్ట్రంలో ప్రవేశపరీక్షలను పూర్తి చేస్తామన్నారు. జేఈఈ, నీట్ ఇతర జాతీయ పరీక్షలకు హాజరయ్యేవారికి ఇబ్బంది కలగకుండా షెడ్యూల్‌ను రూపొందించినట్లు తెలిపారు. కళాశాలలకు ఫీజు బకాయిలన్నీ చెల్లిస్తాం వివిధ ఉన్నత విద్యా సంస్థల్లో కోర్సుల ఫీజులపై జస్టిస్ ఈశ్వరయ్య నేతృత్వంలోని ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ కసరత్తు చేస్తోందని మంత్రి సురేశ్ చెప్పారు. ప్రవేశాల నాటికి ఆయా కాలేజీలకు ఫీజులు ఎంత ఉండాలో కమిషన్ ప్రకటిస్తుందన్నారు. ఏ కాలేజీకి ఎంత ఫీజును నిర్దేశించామో ఆన్లైన్లో అందరికీ తెలిసేలా పెడతామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రవేశాలు ప్రారంభమయ్యేలోగా కాలేజీలకు బకాయిల మొత్తాన్ని చెల్లిస్తామని వెల్లడించారు. ఉన్నత విద్యామండలిలో గతంలో నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి రిటైర్డ్ ఐఏఎస్ చక్రపాణి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించామని, ఈ కమిషన్ నివేదిక సమర్పణకు మరో నెల గడువు పెంచుతున్నామని చెప్పారు. నివేదిక అందాక నిధుల దుర్వినియోగానికి కారణమైన వారిపై చర్యలుంటాయని స్పష్టం చేశారు. కాగా, మూడేళ్ల కాలానికి ఆయా కాలేజీలకు ఫీజులను తమ కమిషన్ నిర్ణయిస్తుందని, ఈ మూడేళ్లలో జరిగే సెట్లన్నిటికీ ఈ ఫీజులే వర్తిస్తాయని ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఉన్నత విద్యా శాఖ) సతీశ్ చంద్ర, సాంకేతిక విద్యా కమిషనర్ ఎం.ఎం.నాయక్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మారనున్న పలు సెట్ల కన్వీనర్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2019–20 విద్యా సంవత్సరంలో వివిధ వృత్తి విద్యా కోర్సుల ప్రవేశాలకు నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల(సెట్స్)పై ఉన్నత విద్యామండలి కసరత్తు వేగవంతం చేసింది. ఏప్రిల్ నెలాఖరు నుంచి ప్రవేశ పరీక్షలను ప్రారంభించాలంటే మొదటివారంలోనే సెట్లు నిర్వహించే యూనివర్సిటీలు, కన్వీనర్లు, షెడ్యూలును ఖరారు చేసి ప్రకటించాల్సి ఉంది. అందులో భాగంగా కన్వీనర్లను ఖరారు చేసేందుకు జనవరి 2న ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. అందులో అన్ని యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లు, ఇతర అధికారులు పాల్గొననున్నారు. 2018–19 విద్యాసంవత్సరంలో సెట్లు నిర్వహించిన కన్వీనర్లలో నలుగురు ఈసారి మారనున్నాయి. గత ఏడాది ఐసెట్ నిర్వహించిన ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యశర్మ(కాకతీయ వర్సిటీ), పీజీఈసెట్ నిర్వహించిన ప్రొఫెసర్ షమీమ్ ఫాతిమా(ఉస్మానియా వర్సిటీ), పదవీ విరమణ పొందారు. గత ఏడాది లాసెట్ నిర్వహించిన ప్రొఫెసర్ ద్వారకనాథ్, ఎడ్‌సెట్ నిర్వహించిన ప్రొఫెసర్ మధుమతి త్వరలో పదవీవిరమణ పొందనున్నారు. ఈ నేపథ్యంలో ఆ 4 సెట్లకు కన్వీనర్లుగా కొత్తవారిని నియమించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. పాతవారికే మూడు సెట్ల బాధ్యత ఎంసెట్, ఈసెట్, పీఈసెట్ నిర్వహణ బాధ్యతలను గతేడాది నిర్వహించిన వర్సిటీలకే అప్పగించి, పాతవారినే కన్వీనర్లుగా కొనసాగించాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. దీంతో ఎంసెట్‌కు జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదయ్య, ఈసెట్‌కు అదే వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ గోవర్ధన్, పీఈసెట్‌కు ప్రొఫెసర్ సత్యనారాయణ కన్వీనర్లుగా కొనసాగే అవకాశముంది. దానిపై జనవరి 2న జరిగే ఉన్నతస్థాయి సమావేశంలో చర్చించి అధికారికంగా నిర్ణయం ప్రకటించనుంది. సమావేశంలో కన్వీనర్ల పేర్లు, సెట్ల నిర్వహణ తేదీలను కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈసారి ఎంసెట్ నిర్వహిస్తామని ఉస్మానియా వర్సిటీ ముందుకు వచ్చినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని, ఎలాంటి లేఖ అందలేదని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి పేర్కొన్నారు. ఈసారి ఐసెట్ నిర్వహణ బాధ్యతలను తమకు అప్పగించాలని తెలంగాణ వర్సిటీ లేఖ రాసిందని, ఆ అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. -
వృత్తి విద్యా ఫీజులపై కసరత్తు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కోర్సులకు వచ్చే మూడేళ్లపాటు వసూలు చేయాల్సిన ఫీజుల ఖరారుకు కసరత్తు ప్రారంభమైంది. 2016–17 విద్యా సంవత్సరంలో ఖరారు చేసి అమల్లోకి తెచ్చిన ఫీజుల కాలపరిమితి 2018–19తో ముగిసింది. ఈ నేపథ్యంలో వచ్చే మూడేళ్లలో ఏటా వసూలు చేయాల్సిన ఫీజుల ఖరారుకు అవసరమైన చర్యలపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి దృష్టి పెట్టింది. గత మూడేళ్లలో కాలేజీల ఆదాయవ్యయాలను పరిశీలించి, వచ్చే మూడేళ్లకు ఫీజులను హైకోర్టు రిటైర్డ్ జడ్జి చైర్మన్‌గా వ్యవహరించే తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఖరారు చేస్తుంది. 2016లో నియమించిన ఏఎఫ్ఆర్సీ చైర్మన్ పదవీకాలం రెండు నెలల కిందటే ముగిసింది. కొత్త చైర్మన్‌ను నియమించిన తరువాతే ఫీజుల ఖరారుకు చర్యలు ప్రారంభించే అవకాశముంటుంది. ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ప్రక్రియను ప్రారంభించినా చైర్మన్‌ను నియమించేందుకు సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో తమకు అధికారం ఇస్తే కోర్సుల వారీగా ఫీజుల ఖరారుకు కాలేజీ యాజమాన్యాల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని మండలి పేర్కొంది. ఈ మేరకు ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసింది. మండలి నేరుగా దరఖాస్తులను స్వీకరించే అధికారం లేనందున, ఏఎఫ్ఆర్సీకి సభ్య కార్యదర్శిగా వ్యవహరించే విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ వారంలో లేదా వచ్చేవా రంలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశ ముంది. ఆ వెనువెంటనే మెడికల్, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, బీఈడీ తదితర వృత్తి విద్యా కాలేజీల నుంచి కాలేజీలవారీగా మూడేళ్ల ఆదాయ వ్యయాలు, ఫీజు పెంపు ప్రతిపాదనలను స్వీకరించనుంది. అయితే గతంలో వాటి స్వీకరణకు రెండు నెలల సమయం ఇచ్చినా, ఈసారి నోటిఫికేషన్ జారీ ఆలస్యం అయినందున ప్రతిపాదనల స్వీకరణ గడువును తగ్గించే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలోని అన్ని కాలేజీలు, కోర్సుల్లో కనీసంగా 10 శాతం వరకు ఫీజులు పెరిగే అవకాశం ఉంది. -
కుంభకర్ణ నిద్రలో ఉన్నారా..?
సాక్షి,హైదరాబాద్: వృత్తివిద్య పూర్తి చేసిన ఒక విద్యార్థికి డీఈఈడీ (డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్)లో ప్రవేశం కల్పించాలన్న తమ ఆదేశాల్ని డీఈఈ సెట్ కన్వీనర్ రమణకుమార్ అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తామిచ్చిన ఉత్తర్వులు అమలు చేయాల్సిందేనని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సివస్తుందని హెచ్చరించింది. ఉత్తర్వుల్ని అమలు చేయకుండా కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మీకు రూ.లక్ష జరిమానా ఎందుకు విధించ కూడదో చెప్పాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయ మూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ల ధర్మా సనం నిలదీసింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈలోగా తమ ప్రశ్నలకు జవాబులతో కౌంటర్ దాఖలు చేయాలని బుధవారం నోటీసులు జారీ చేసింది. వృత్తివిద్య పూర్తి చేసిన వారు డిప్ల మో కోర్సులో చేరేందుకు అనర్హులనే నిబంధనను ఒక విద్యార్థి సవాల్ చేశారు. ఆ విద్యార్థికి వచ్చిన ర్యాంక్ ఆధారంగా డీఈఈడీలో ప్రవేశం కల్పించాలని ఆగస్టు 17న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు అమలు చేయకపోవడంతో విద్యార్థి కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కన్వీనర్ రమణ కుమార్ స్వయంగా కోర్టుకు హాజరై విద్యార్థికి ప్రవేశం కల్పించినట్లు తెలిపారు. మరోసారి వ్యాజ్యం విచారణకు రావడంతో విద్యార్థి తరఫు న్యాయవాది రామన్ వాదిస్తూ.. కోర్టు ధిక్కార కేసు వేస్తేగానీ ప్రవేశం కల్పించలేదన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. గట్టిగా తేల్చి చెబితేగానీ స్పందించరా.. రూ.లక్ష జరిమానా ఎందుకు విధించరాదో వచ్చే వారం జరిగే విచారణలోగా కౌంటర్ ద్వారా తెలియజేయాలని కన్వీనర్‌ను ఆదేశించింది. -
వృత్తి విద్యాకోర్సుల ప్రవేశాల్లో నో స్పోర్ట్స్ కోటా
సాక్షి, హైదరాబాద్: స్పోర్ట్స్ కోటా కింద వృత్తి విద్యా కోర్సుల్లో ఈ ఏడాది ప్రవేశాలు జరపరాదని ఉమ్మడి హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. మెడికల్, ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో క్రీడా కోటా రిజర్వేషన్లలో అక్రమాలు జరిగాయని.. ఆ కోటా జీవోను రద్దు చేయాలన్న వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 21న జారీ చేసిన జీవో 7ను టి.శ్రియతో పాటు మరో నలుగురు సవాల్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు వారాల్లోగా తమ వాదనతో కౌంటర్ వ్యాజ్యాన్ని దాఖలు చేయాలని విచారణ సందర్భంగా ధర్మాసనం ఆదేశించింది. ‘వృత్తి విద్యా కోర్సుల్లో స్పోర్ట్స్ కోటా ప్రవేశాల్ని ఈ ఏడాదికి నిలిపివేస్తున్నాం. ఈ నిర్ణయం బాధాకరమే అయినా విస్తృత అంశాలతో ముడిపడినందున ఆదేశాలు ఇస్తున్నాం. గతేడాది స్పోర్ట్స్ కోటా ప్రవేశాలపై స్టే విధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసినా.. అది గత విద్యా సంవత్సరానికే పరిమితం. స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధం కాదు. ఇందులో అక్రమాలకు తెర లేస్తున్నప్పుడు కోర్టులు కళ్లు మూసుకుని ఉండవు’అని కోర్టు వ్యాఖ్యానించింది. నీట్ నోటిఫికేషన్ తర్వాత జీవోనా? విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి వాదిస్తూ.. ‘క్రీడా కోటా కింద 2017–18 విద్యా సంవత్సరంలో జరిగిన ప్రవేశాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై సీఎం విచారణ ఆదేశాల ఫలితంగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తు చేపట్టింది. లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలపై క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) డిప్యూటీ డైరెక్టర్‌ను ఏసీబీ అరెస్ట్ చేసింది. అప్పటికే క్రీడా కోటాపై ఉన్న కమిటీ చేసిన సిఫార్సుల మేరకు జీవో 7జారీ అయింది. అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం అలాంటి అధికారులతో కూడిన కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ఇచ్చిన జీవో 7ను అమలు చేయడం అన్యాయం’అని అన్నారు. పైగా, నీట్ నోటిఫికేషన్ వెలువడ్డాక జీవో వచ్చిందని.. దీని వెనుక స్వార్థపూరిత ఉద్దేశాలున్నాయని చెప్పారు. దేశంలో ఎప్పుడూ వినని క్రీడలను జీవో ద్వారా ప్రభుత్వం గుర్తించిందని.. స్పోర్ట్స్ కోటాలో సీటు పొందిన విద్యార్థి ఏ ఒక్కరూ అంతర్జాతీయ స్థాయిలో ఒక్క పతకమైనా సాధించలేదని ఆమె వెల్లడించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. స్పోర్ట్స్ కోటాను ఈ ఏడాది రద్దు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. -
విద్యతోనే వికాసం
ఒకప్పుడు బాలికలకు చదువెందుకులే అనే భావన అధికంగా ఉండేదని, ప్రస్తుతం ఈ పరిస్థితి చాలా వరకు మారిందని వికారాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి అన్నారు. పాఠశాల, కళాశాల స్థాయిలోనే వృత్తివిద్యా కోర్సుల ద్వారా.. అమ్మాయిల ఉపాధి అవకాశాలకు బాటలు వేయాలని సూచించారు. ప్రతీఒక్కరి ఎదుగుదలలో చదువుదే ప్రథమ స్థానమని స్పష్టంచేశారు. మహిళా సాధికారతపై ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. సాక్షి, వికారాబాద్ : ‘మాది మహబూబ్‌నగర్ జిల్లాలోని గండేడ్ మండలం మహ్మదాబాద్. జిల్లాల పునర్విభజనకు ముందు ఈ గ్రామం వికారాబాద్ జిల్లాలోని పరిగి నియోజకవర్గంలో ఉండేది. తల్లిదండ్రులు సరళాదేవి, ఆంజనేయులు. ఇద్దరూ ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగ విరమణ పొందారు. నా విజయంలో వీరితో పాటు మా అన్నయ్య పాత్ర ఎంతో ఉంది. పదో తరగతి వరకు మా ఊరిలోని జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో చదివా. ఇంటర్, డిగ్రీ మహబూబ్‌నగర్‌లో పూర్తిచేశా. ప్రభుత్వ ఎంబీఎస్ కాలేజీలో డిగ్రీ అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో లా, పీజీ చదివా. న్యాయవాద విద్యను అభ్యసించే సమయంలోనే (2007లో) గ్రూప్– 1 పరీక్ష రాయగా ఉద్యోగం వచ్చింది. దీంతో బొంరాస్‌పేట్‌లో ఎంపీడీఓగా విధుల్లో చేరా. అనంతరం డిప్యూటీ ఈఓ పోస్టులకు నోటిఫికేషన్ వేశారు. ఉద్యోగం చేస్తూనే పరీక్ష రాశా. 2009లో డిప్యూటీ ఈఓ ఎంపికయ్యా. మొదటి పోస్టింగ్ జనగాంలో.. ఇక్కడే ఎనిమిది సంవత్సరాలకు పైగా పనిచేశాను. అనంతరం గత సంవత్సరం పదోన్నతిపై వికారాబాద్ జిల్లా విద్యాధికారిగా వచ్చా. ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి.. మహిళలకు అన్నింటికన్నా విద్య ప్రధానం. ఆ తర్వాత ఆర్థిక స్వావలంబనకు అవసరమైన వసతులను ప్రభుత్వం కల్పించాలి. సాంకేతికపరమైన అంశాల్లో సమాజం అతివేగంగా పురోభివృద్ధి సాధిస్తోంది. ఇలాంటి అంశాల్లో మహిళలకు అవకాశాలు ఉండేలా చూడాలి. పాఠశాలలు, కళాశాల స్థాయిల్లోనే బాలికలకు వృత్తి విద్యాకోర్సుల్లో తర్ఫీదునివ్వాలి. దీంతో స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగడంతో పాటు ఆర్థిక అవసరాల కోసం కుటుంబంపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. చదువులేని మహిళలకు కూడా కొన్ని రంగాల్లో ఆసక్తి, నైపుణ్యం ఉంటుంది. ఆయా రంగాల్లో వారిని ప్రోత్సహించాలి. ఒకప్పుడు బాలిలకు చదువెందుకులే.. అనే భావన ఉండేది ప్రస్తుతం చాలా మార్పు వచ్చింది. ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, టైలరింగ్, తదితర ఒకేషనల్ కోర్సులు విరివిగా ప్రవేశపెడితే మహిళలు ఆర్థికంగా ప్రగతి సాధించడానికి ఎంతో దోహద పడుతుంది. చాపలు అల్లడం, చీరలు నేయడం తదితర స్వయం ఉపాధి రంగాల్లో అవకాశాలు కల్పించాలి. సాఫ్ట్వేర్ రంగంలో అభివృద్ధి చెందడానికి మహిళలకు అవకాశం కల్పించాలి. బాలికల కోసం ఏర్పాటు చేసిన కస్తూర్బా విద్యాలయాలు మంచి ఫలితాలు రాబడుతున్నాయి. బాలికల పాఠశాలలో టైలరింగ్, ఒకేషనల్ కోర్సులు ఏర్పాటుచేస్తే బాగుంటుంది. జిల్లాలో ఈ విధానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నా. ఒకేచోట అవకాశం ఇవ్వాలి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు సంబంధించి భార్యాభర్తలకు (వర్కింగ్ ఉమెన్) ఒకేచోట పనిచేసేలా అవకాశం కల్పించాలి. లేదంటే పిల్లల పోషణ భారం, ఇంటిపని వర్కింగ్ ఉమెన్పైనే అధికంగా ఉంటుంది. భార్యాభర్తలు ఒకేచోట పనిచేస్తే పని ఒత్తిడిని ఇరువురు పంచుకునే వీలుంటుంది. దీనికి సంబంధించి జీవోలు ఉన్నా సక్రమంగా అమలు కావడంలేదు’.-జి.రేణుకాదేవి, జిల్లా విద్యాధికారి -
ప్రొఫెషనల్ కోర్సులకు.. ఫీజుల సెగ!
ఇంజనీరింగ్, ఎంబీఏ, బీఫార్మసీ తదితర ప్రొఫెషనల్ కోర్సుల్లో ఫీజుల భారం పెరగనుంది. జాతీయ స్థాయిలో ఇప్పటికే ఐఐటీల్లో ఫీజుల మోత మోగింది. ఇప్పుడిక రాష్ట్రాల స్థాయి కళాశాలల్లో సైతం భారీగా ఫీజుల పెంపు దిశగా రంగం సిద్ధమైంది. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరాలనుకుంటే లక్షలు కుమ్మరించాల్సిందే! * పెను భారం కానున్న వృత్తివిద్యా చదువులు * ఏకీకృత ఫీజులను నిర్ధారించిన ఏఐసీటీఈ * ఫీజులు పెంచేందుకు సిద్ధమవుతున్న ఏఎఫ్ఆర్సీ ఇంతకీ ఏ ఫీజు జాతీయ స్థాయిలో ఏకీకృత ఫీజు ఉండేలా ఏఐసీటీఈ నియమించిన నేషనల్ ఫీ ఫిక్సేషన్ కమిటీ ఫీజులు ఖరారు చేసింది. ఈ కమిటీ చేసిన ప్రతిపాదనలకు ఆమోదం కూడా లభించింది. మరోవైపు తెలుగు రాష్ట్రాలో అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేషన్ అథారిటీ(ఏఎఫ్ఆర్సీ)లు 2016-19 బ్లాక్ పీరియడ్‌కు ఫీజులు పెంచే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. దాంతో ఫీజు ఎంత పెరుగుతుందో.. అసలు ఈ విద్యా సంవత్సరంలో ఏకీకృత, ఏఎఫ్ఆర్సీ ఫీజుల్లో ఏది అమల్లోకి వస్తుందో అనే ఆందోళన తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. భారీగా ఫీజుల సిఫార్సు బీటెక్, ఎంబీఏ, బీఫార్మసీ, ఫార్మా-డి తదితర కోర్సుల్లో జాతీయ స్థాయిలో ఒకే విధమైన ఫీజు విధానాన్ని అమలు చేయాలని 2014లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం పది మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ దేశ వ్యాప్తంగా పలు కళాశాలల యాజమాన్యాలు, విద్యావేత్తలు, ఇతర వర్గాలతో పలు సంప్రదింపులు చేసింది. చివరకు గత నవంబర్‌లో ఆయా కోర్సులకు ఫీజులు నిర్ధారిస్తూ నివేదిక అందించింది. దీనికి ఏఐసీటీఈ ఆమోదం కూడా లభించింది. ఇంజనీరింగ్ కనీసం 1.44 లక్షలు.. నేషనల్ ఫీ ఫిక్సేషన్ కమిటీ సిఫార్సు చేసిన ఫీజుల మొత్తాలు విద్యార్థుల గుండెలను గుభేల్‌మనిపిస్తున్నాయి. ఒక్క ఇంజనీరింగ్ కోర్సునే చూస్తే ఏడాదికి కనిష్టంగా 1.44 లక్షలు, గరిష్టంగా 1,58,300గా నిర్ధారించింది. నగరాలు/పట్టణాలను మూడు కేటగిరీలుగా (టైప్-ఎక్స్, టైప్-వై, టైప్-జెడ్) వర్గీకరించి ఫీజులు నిర్ధారించింది. ఇందుకోసం ఆరో వేతన సంఘం సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవడం విశేషం! తుదిదశకు చేరుకున్న ఏఎఫ్ఆర్సీల కసరత్తు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ, సమీక్ష, నిర్ధారణకు ఏర్పాటైన అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేషన్ కమిటీ(ఏఎఫ్ఆర్సీ) 2016-19 బ్లాక్ పీరియడ్‌కు కొత్త ఫీజుల ఖరారు దిశగా కసరత్తు తుది దశలో ఉంది. ఇప్పటికే 2013-16 బ్లాక్ పిరియడ్‌కు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ వార్షిక ఫీజులు రూ. 30 వేల నుంచి రూ. 1.09 లక్షల వరకు ఉంది. 2013-16 బ్లాక్ పిరియడ్ వ్యవధి ముగియడంతో మరో మూడేళ్ల బ్లాక్ పిరియడ్‌కు సంబంధించి 2016-19 విద్యా సంవత్సరాల్లో ఫీజులు నిర్ధారించేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో ఫీజులు 20 నుంచి 30 శాతం మధ్యలో పెరగనున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో టైప్-ఎక్స్ పరిధిలో హైదరాబాద్, టైప్-వై పరిధిలో విజయవాడ, వరంగల్, విశాఖపట్నం, గుంటూరు... మిగిలిన అన్నీ టైప్ -జడ్ పరిధిలోనే ఉన్నాయి. ఈ విషయంలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. ఒకవేళ జాతీయ స్థాయిలో ఏకీకృత ఫీజుల విధానాన్నే అమలు చేస్తే అధిక సంఖ్యలో ఉన్న టైప్-జడ్ పట్టణాలు/ నగరాల్లో బీటెక్ చదవాలంటే.. ఏడాదికి రూ.1,44,900 చెల్లించాల్సి ఉంటుంది. అత్యున్నత ప్రమాణాలు ఉన్న ఇన్స్టిట్యూట్లు అదనంగా 20 శాతం, అటానమస్ కళాశాలలు అదనంగా పది శాతం వసూలు చేసుకోవచ్చనే కమిషన్ సిఫార్సు మరింత భారం పెంచనుంది. జాతీయ స్థాయిలో ఏకీకృత ఫీజుల అమలు దిశగా యోచిస్తున్న ఏఐసీటీఈ.. వాటిని అమలు చేసే ముందు ఆయా కళాశాలలు పాటిస్తున్న ప్రమాణాల విషయంలో అత్యంత పకడ్బందీగా వ్యవహరించాలి. అలా కాకుండా కేవలం కమిటీ సిఫార్సులపైనే ప్రాంతాల వారీగా ఫీజులు నిర్ధారించడం వల్ల విద్యార్థులకు చదవులు భారం అవుతాయే తప్ప నైపుణ్యాలు లభిస్తాయన్న గ్యారెంటీ లేదు. - ప్రొఫెసర్. వి.ఎస్. ప్రసాద్, న్యాక్ మాజీ డెరైక్టర్ -
వరాల లక్ష్మి
♦ సామాజిక సేవలో జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ ♦ వేలాదిమందికి వృత్తి విద్య శిక్షణతో ఉపాధి కల్పన ♦ జిల్లాలు దాటి వస్తున్న నిరుద్యోగులు ఎంతోమంది నిరుద్యోగులకు బాసటగా నిలిచింది జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్. వివిధ వృత్తి విద్యాకోర్సుల్లో శిక్షణ ఇస్తూ వారి ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తోంది. ఎనిమిదేళ్లుగా నిరుద్యోగ యువతీ, యువకుల స్వయం ఉపాధికి ఊతమిస్తోంది. ఉచితంగా భోజనం, రవాణా సౌకర్యం కల్పిస్తోంది. తమకాళ్లపై తాము నిలబడేలా తీర్చిదిద్దుతోంది. వారి ఉన్నతికి పాటుపడుతూ బతుకుపై భరోసా కల్పిస్తోంది. ఇక్కడ శిక్షణ పొందిన ఎంతోమంది ప్రస్తుతం ఆయా రంగాల్లో స్థిరపడ్డారు. నిరుద్యోగులకు దన్నుగా నిలుస్తున్న జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్‌పై ఈ ఆదివారం ప్రత్యేకం.. - శంషాబాద్ ఎనిమిదేళ్లు.. 273 బ్యాచ్‌లు.. 5,356 మందికి శిక్షణ. గ్రామీణ యువతకు దారి చూపడమే లక్ష్యంగా ఏర్పాటైన ‘జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్’ నిరుద్యోగుల బతుకుల్లో వెలుగులు నింపుతోంది. శంషాబాద్ సమీపంలో ఎయిర్‌పోర్టును నిర్మించిన సంస్థ అక్కడి నుంచే సేవా కార్యక్రమాలను విస్తరించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఏర్పాటైన వరలక్ష్మీ ఫౌండేషన్ అనేక మందికి వృత్తి విద్యా శిక్షణ ఇచ్చి జీవితంలో స్థిరపడేలా చేసింది. మొత్తం తొమ్మిది కోర్సుల్లో ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. కేవలం 8వ తరగతి పాసై ఉంటే చాలు.. వీరు ఇచ్చే శిక్షణ జీవితానికి దారిచూపుతుంది. - శంషాబాద్ కీసర: హరహరమహాదేవ.. శంభోశంకర అంటూ భక్తుల జయజయధ్వానాల మధ్య శనివారం కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ వేదపాఠశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున అవధాని సర్వోపద్రష్టగా, ఆచార్య పుల్లేటీకుర్తి గణపతిశర్మ ఆధ్వర్యంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి మహేందర్‌రెడ్డి, ఆలయ చైర్మన్ తటాకం ఉమాపతిశర్మ దంపతులచే మహామండపంలో విఘ్నేశ్వరపూజ, పుణ్యావచనంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. యాగశాల ప్రవేశం చేసి వేదపండితులు జ్యోతి ప్రతిష్ఠాపన చేశారు. బేరీపూజ, ధ్వజారోహణ కార్యక్రమాలను కన్నుల పండువగా నిర్వహించారు. మంత్రి మహేందర్‌రెడ్డికి ఆలయ వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారి ఆశీర్వచనం, ప్రసాదాన్ని అందజేశారు. సాయంత్రం స్వామివారు పల్లకీసేవ ద్వారా కీసర గ్రామానికి బయలుదేరారు. తిరిగి ఆదివారం సాయంత్రం కీసరగుట్టకు చేరుకుంటారు. అనంతరం స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. పూజా కార్యక్రమాల్లో ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి, తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, ఎంపీడీఓ వినయ్‌కుమార్, ఫౌండర్‌ట్రస్టీ ఫ్యామిలీ సభ్యులు తటాకం నారాయణశర్మ, రమేష్‌శర్మ, వెంకటేష్‌శర్మ, నాగలింగంశర్మ, శ్రీనివాస్‌శర్మ, ఈఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. తొలిరోజు విశేషాలు ♦ ఉదయం 11 గంటలకు ప్రారంభం కావా ల్సిన క్రీడా పోటీలు మధ్యాహ్నం 12 గంటల తరువాత మొదలవడంతోవిద్యార్థులు కొద్దిగా ఇబ్బంది పడ్డారు. ♦ జిల్లాస్థాయి గ్రామీణ క్రీడాపోటీల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు కందాడి స్కైలాబ్‌రెడ్డి స్వచ్ఛం దసంస్థ అధ్యక్షుడు కందాడి స్కైలాబ్‌రెడ్డి క్రీడాదుస్తులు అందజేశారు. సుమారు 2000 వేలమందికి భోజనవసతి కల్పించారు. ఈ ఏడాది కూడా అధికారులు సావనీర్ సంగతిని మరిచారు. ♦ ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన కీసరగుట్ట దేవాలయ ఆధునికీకరణ కమిటీ (రిసెప్షన్ కమిటీ) సభ్యులు శనివారం ఆలయ ప్రాంగణంలో ప్రమాణా స్వీకారం చేశారు. ఆర్యవైశ్య అన్నదానసత్రం, వంశరాజ్సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్నదానం ప్రారంభించారు. ♦ జాతర సందర్భంగా 15 కమిటీల ఆధ్వర్యంలో భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జేసీ రజత్‌కుమార్ సైనీ, ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 300 ఆర్టీసీ బస్సులు నడుస్తాయని, నిరంతరాయంగా తాగునీరు, శానిటేషన్, విద్యుత్ సరఫరా అందించడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల్లో నేడు.. ఆదివారం ఉదయం రుద్రస్వాహాకార హోమం, వేదపారాయణం, సాయంత్రం బిల్వార్చన, రాత్రి ప్రదోషకాల పూజ, హారతి, మంత్రపుష్పం, పరాకస్తవం, తీర్థప్రసాద వినియోగం, స్వామివారు కీసర గ్రామం నుంచి కీసరగుట్టకు విచ్చేయుట, రాత్రి 10 గంటలకు ఉత్తారాషాడ నక్షత్రయుక్త తు లలగ్నంలో శ్రీ భవానీ శివదుర్గా సమేత రామలింగే శ్వర స్వామివారి కల్యాణ మహోత్సవం ఉంటాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు కీసరలో పోచమ్మ అంగడి నిర్వహిస్తారు. శివరాత్రి తొలిపూజకు హాజరయ్యే అమ్ముగూడ, యాప్రాల్ తదితర ప్రాంతాలకు చెందిన తమిళులు పోచమ్మ అంగడిలో పాల్గొని అనంతరం ఉపవాస దీక్షను చేపడుతారు. జీఎంఆర్ సంస్థలకు దేశవ్యాప్తంగా ఎన్నో సంస్థలున్నాయి. ఆయా ప్రాంతాల్లో తమ సంస్థలు నెలకొల్పిన చోట గ్రామీణ ప్రజల సాధికారతే లక్ష్యంగా జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ పనిచేస్తోంది. ఎనిమిదే ళ్ల క్రితం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించిన జీఎంఆర్ సంస్థ విమానాశ్రయం పరిధిలోనే జీఎంఆర్ వరలక్ష్మీ వృత్తి విద్యా శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పింది. ఎమినిదేళ్ల కాలంలో 273 బ్యాచ్‌ల ద్వారా 5,356 మందికి వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణనిచ్చారు. ఇందులో సుమారు 4,779 మంది వివిధ రంగాల్లో ఉపాధి పొందడం విశేషం. ప్రముఖ కంపెనీలతో సమన్వయం.. ఇక్కడ శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఉపాధి పొందడమో.. స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయడమో చేసేలా సంస్థ కృషి చేస్తోంది. మొత్తం 9 కోర్సుల్లో గ్రామీణ యువకులు, మహిళలు శిక్షణ పొందుతున్నారు. ఎనిమిదో తరగతి కనీస అర్హతగా ఉన్న యువకులు సైతం శిక్షణలో రాటుదేలి తమ కాళ్లపై తాము నిలబడేలా కోర్సులను డిజైన్ చేశారు. ద్విచక్ర వాహనాల మరమ్మతులో హిరోమోటార్ కంపెనీ, ఎలక్ట్రీషియన్‌లో స్క్నేడియర్ సంస్థ, డ్రైవాల్స్, ఫాల్స్ సీలింగ్‌లో సెయింట్ గోబ్యాన్, రిఫ్రిజిరేటర్ మెకానిజంలో వోల్టాస్, ఎక్స్‌కావేటర్ ఆపరేటింగ్‌లో వోల్వో సంస్థలతో సమన్వయం చేసుకుని శిక్షణ అందిస్తున్నారు. హౌస్‌కీపింగ్, కంప్యూటర్, కుట్టుమిషన్ వెల్డింగ్ కోర్సులు సైతం యువత ఉపాధికి ఊతమిస్తున్నాయి. ఆన్లైన్ విక్రయాలు.. వరలక్ష్మీ ఫౌండేషన్‌లో జ్యూట్ బ్యాగుల తయారీలో శిక్షణ పొందిన 30మంది మహిళలు అద్భుత విజయాలను సాధిస్తున్నారు. రెండు కేంద్రాల ద్వారా వీరు తయారు చేస్తున్న జ్యూట్‌బ్యాగులు అంతర్జాతీయంగాఅమ్ముడుపోతున్నాయి. వీటిని ఫ్లిప్‌కార్ట్ లాంటి ప్రముఖ ఆన్లైన్ విక్రయ సంస్థలు ఆన్లైన్ అమ్మకాల్లో పెడుతున్నాయి. ఈ బ్యాగుల తయారీ టర్నోవర్ ఇటీవలే రూ.70లక్షల వరకు చేరుకుం దని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. మహిళలు తయారు చేస్తున్న ఈ జ్యూట్ బ్యాగుల మార్కెటింగ్‌కు సైతం జీఎం ఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ భుజానికెత్తుకుని వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తోంది. ప్రస్తుతం జ్యూట్ బ్యాగుల తయారీ కేం ద్రంలో పనిచేస్తున్న మహిళలు మార్కెటింగ్ అనుసారంగా నెలకు రూ.10వేలకుపైగా సంపాదిస్తున్నట్లు వెల్లడించారు. భోజనం, రవాణా వసతి.. ఇక్కడ కేవలం వృత్తి విద్యా శిక్షణే కాకుండా యువతను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్నారు. వారిలో మానసిక పరివర్తనను పెంపొందించేందుకు ప్రత్యేక తరగతులు తీసుకుంటున్నారు. ఉదయం యోగా లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. శిక్షణ పొందుతున్న అబ్బాయిలకు స్థానికంగానే భోజనవసతి కల్పిస్తున్నారు. మహిళలకు ఆయా గ్రామాల నుంచి ఉచిత బస్సు రవాణా కల్పించడంతో పాటు మధ్యాహ్న భోజనం సైతం అందిస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. మరెన్నో సేవలు.. వరలక్ష్మీ ఫౌండేషన్ దత్తత తీసుకున్న ఎయిర్‌పోర్టు కాలనీ, మామడిపల్లి, గొ ల్లపల్లి తదితర గ్రామాల్లో వలంటీర్ల ద్వారా విద్యాబోధన, అంగన్వాడీ కేంద్రాలు,వాటర్ ఫిల్టర్ సౌకర్యం, మొబైల్ వైద్య కేంద్రం, మందుల పంపిణీ, గర్భిణుల కు పౌష్టికాహార పంపిణీ నిరంతరాయం గా కొనసాగుతున్నాయి. -
మే ఒకటి నుంచి కర్ణాటక సెట్
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో వైద్య, దంతవైద్య, ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సుల ప్రవేశానికి నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్(సీఈటీ) మే ఒకటో తేదీ నుంచి 3 రోజుల పాటు జరగనుంది. కర్ణాటక, కర్ణాటకేతరులు కూడా పూర్తి చేసిన దరఖాస్తులను ఏప్రిల్ 5లోపు అందించాల్సి ఉంటుంది. హొరనాడు, గడినాడు విద్యార్థులకు ప్రత్యేకంగా నిర్వహించే పరీక్షలో 50కి కనీసం 12 మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుందని, అప్పుడే సీఈటీలో సీటుకు అర్హులని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలకు 080-23461575, 23568202, 23564583 లేదా www.kea.kar.nic.in లో సంప్రదించవచ్చని సూచించారు. -
వృత్తి విద్య నేలచూపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వృత్తివిద్య నేలచూపులు చూస్తోంది. నాలుగేళ్లుగా అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. గతేడాది నుంచి పరిస్థితి మరీ దిగజారింది. సీట్ల సంఖ్య పెరుగుదలలో భారీ మార్పు లేకపోయినా మిగిలిపోతున్న సీట్ల సంఖ్య మాత్రం ఏటా పెరుగుతూ వస్తోంది. వృత్తి విద్యా కోర్సులకు భారీగా ఫీజులు పెరగడంతో 2012-13 విద్యా సంవత్సరం నుంచి ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. 2011-12 విద్యా సంవత్సరం నుంచి ఏటా లక్షకు పైగా ఇంజనీరింగ్ సీట్లు మిగిలిపోతున్నాయి. ఫార్మసీ సంస్థలకు మన రాష్ట్రం.. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా ఉన్నప్పటికీ బీ ఫార్మసీ సీట్లకూ ఆదరణ కరువవుతోంది. ఇక ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు డిమాండ్ పూర్తిగా పడిపోయింది. ఎంసీఏలో 5 వేల పైచిలుకు సీట్లు మాత్రమే భర్తీ అవడం చూస్తుంటే.. వచ్చే ఏడాది ఈ కోర్సులో విద్యార్థులు కేవలం ప్రభుత్వ కళాశాలల్లో మాత్రమే చేరే పరిస్థితి కనిపిస్తోంది. ఇంజనీ‘రంగు’ వెలుస్తోంది.. నాలుగేళ్లుగా రాష్ట్రంలో 4 నుంచి 4.5 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ ఎంపీసీలో చేరుతుండగా.. వీరిలో 3 లక్షలకుపైగా విద్యార్థులు ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరిలో 90 శాతం మంది ఉత్తీర్ణత సాధిస్తున్నారు. కానీ ప్రవేశాల వరకు వచ్చేసరికి లక్ష పైచిలుకు మాత్రమే ఉంటున్నారు. ఈ లక్ష పైచిలుకు ఇంజనీరింగ్ విద్యార్థుల్లో పట్టా చేతికొచ్చేసరికి 12 నుంచి 17 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు సాధించగలుగుతున్నారు. అంటే ఏటా లక్ష మందికి పైగా ఇంజనీరింగ్‌లో చేరుతున్నా, 20 వేల లోపు మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి. రాష్ట్రంలో గత నాలుగైదేళ్లుగా ఐటీ రంగం విస్తరించకపోవడం, ఎలక్ట్రానిక్, హార్డ్‌వేర్ పరిశ్రమలు రాకపోవడం, విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు చేపట్టకపోవడం తదితర కారణాల వల్ల కొత్త ఉద్యోగాలకు ఆస్కారం లేకుండా పోయింది. ఉన్న అరకొర ఉద్యోగాల్లో కూడా చేరేందుకు అవసరమైన సాఫ్ట్ స్కిల్స్ లేకపోవడం, ఎప్పటికప్పుడు కంపెనీల అవసరాలు మారిపోతుండటం, సబ్జెక్టుల్లో సిలబస్ మార్చకపోవడం, విద్యార్థులు ప్రాజెక్టు వర్క్ చేయకుండా కేవలం పాత ప్రాజెక్టు రిపోర్టుల ఆధారంగా నివేదికలు సమర్పించడం వంటి కారణాలు కూడా ఇంజనీరింగ్ విద్యపై వ్యతిరేక ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు కాలేజీ ఫ్యాకల్టీల్లో నిపుణులు లేకపోవడం, ల్యాబ్, లైబ్రరీ వసతులు నామమాత్రంగా ఉండడం కూడా పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయి. నాణ్యత లేకున్నా లక్ష వరకు ఫీజులు, ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో కేవలం రూ.35 వేలు చెల్లిస్తుండడం, మిగిలిన వాటిలో నాణ్యత లేదని విద్యార్థులు అర్థంచేసుకోవడంతో ప్రవేశాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఎంబీఏకూ కరువైన ఉపాధి.. నాణ్యమైన మేనేజ్మెంట్ కోర్సుకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. కానీ రాష్ట్రంలో పేరుగాంచిన ఎంబీఏ కళాశాలలు చాలా తక్కువ. రాష్ట్రంలో దాదాపు 34 బిజినెస్ స్కూళ్లు ఏఐసీటీఈ అనుమతి లేకుండా నడుస్తున్నప్పటికీ, వాటిపై నియంత్రణ లేదు. ప్లేస్మెంట్ అవకాశాలు ఉంటాయన్న కారణంతో ఎక్కువ మంది విద్యార్థులు ఏఐసీటీఈ అనుమతి లేకున్నా ఈ బిజినెస్ స్కూళ్లలో చేరుతున్నారు. ఐసెట్ ద్వారా భర్తీ చేసుకునే ఎంబీఏ కళాశాలలు.. పారిశ్రామిక అనుసంధానం లేక ఉపాధి అవకాశాలు కల్పించలేకపోతున్నాయి. ఎంబీఏ చదివినా చిరు మార్కెటింగ్ ఉద్యోగిగా మారాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రూ.80 వేల వరకూ ఫీజులు చెల్లించి, చివ రకు రూ.7, 8 వేల ఉద్యోగంలో చేరాల్సి వస్తోంది. ఈ పరిస్థితి వల్ల ఎంబీఏకూ ఆదరణ క్రమంగా తగ్గుతోంది. కంపెనీలకు పట్టని ఎంసీఏ పట్టభద్రులు మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) కోర్సు చేసే వారికి ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారింది. కంప్యూటర్ సంస్థలు ఏ ఒక్కటీ తమ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో ఎంసీఏ అర్హతకు చోటు కల్పించడంలేదు. కంపెనీల అవసరాలకు తగిన కరిక్యులం లేకపోవడం, ఐటీ రంగంలో ఎప్పటికప్పుడు తాజా కోర్సులకే డిమాండ్ ఉండడంతో ఎంసీఏకు ఆదరణ పూర్తిగా కరువైంది. ఈ ఏడాది కౌన్సెలింగ్‌లో కేవలం 5,514 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి ఇలాగే ఉంటే ఒకట్రెండు సంవత్సరాల్లో ఈ కోర్సు కనుమరుగైపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు పేర్కొంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కోర్సులు, సిలబస్ మారాల్సిన అవసరముందని స్పష్టం చేస్తున్నారు. బీ ఫార్మసీ.. అదే పరిస్థితి బీ ఫార్మసీలో ప్రవేశాల సంఖ్య తగ్గకపోయినప్పటికీ, ఆశిం చినంత పెరుగుదల లేదు. 2009-10లో 13 వేల పైచిలుకు అడ్మిషన్లు ఉండగా.. 2012-13 నాటికి దాదాపు వెయ్యి అడ్మిషన్లు మాత్రమే పెరిగాయి. ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన ఎంపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్‌లో 558 సీట్లే భర్తీ అయ్యాయి. బైపీసీలో 14 వేల సీట్లు మాత్రమే నిండే పరిస్థితి ఉంది. ప్రభుత్వానికీ బాధ్యత ఉంది ‘‘1993-94లో 32 ఇంజనీరింగ్ కళాశాలలు ఉంటే ఇప్పుడవి 717కు చేరాయి. అనేక కారణాల వల్ల కళాశాలల స్థాపనకు ప్రభుత్వం అనుమతిచ్చింది. సిబ్బంది కొరత, ప్రమాణాలలేమి విద్యపై ప్రభావం చూపుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందిపుచ్చుకునేందుకు కళాశాలలు ప్రయత్నించాయే తప్ప ప్రమాణాలు పెంచలేదు. 60 కళాశాలల్లో నూరు శాతం సీట్లు నిండాయంటే వీటిలో మాత్రమే ప్రమాణాలు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. దీనిపై కళాశాలలను నిందించడం సరికాదు. ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి’’ - డా. పి.మధుసూదన్‌రెడ్డి, విద్యారంగ విశ్లేషకులు ప్రవేశాలు ఆలస్యమవడమే కారణం ‘‘రాష్ట్రంలో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాలు జరగడం, ఏటా అడ్మిషన్లు ఆలస్యమవడం, పొరుగు రాష్ట్రాల్లో జూలైలోగా అడ్మిషన్లు నిర్వహించడం వంటి కారణాల వల్ల విద్యార్థులు తరలిపోతున్నారు. ఫీజుల నిర్ధారణలో ఆలస్యం, యాజమాన్య కోటాపై కోర్టుల్లో కేసులు వంటి కారణాలతో ఏటా అడ్మిషన్ల ప్రక్రియ జాప్యమవుతోంది. అందువల్ల రాష్ట్రంలో ఇంజనీరింగ్ అడ్మిషన్ల సంఖ్య తగ్గుతోంది’’ - రాజేశ్వర్‌రెడ్డి, యాజమాన్య సంఘాల ప్రతినిధి ఇంజనీరింగ్‌లో సీట్ల పరిస్థితి ఇదీ.. సంవత్సరం మొత్తం సీట్లు భర్తీ అయిన సీట్లు మిగిలిన సీట్లు 2009-10 2,26,870 1,77,200 49,670 2010-11 2,79,752 1,94,203 85,549 2011-12 3,06,925 1,84,080 1,22,845 2012-13 3,38,950 1,58,700 1,80,250 2013-14 3,28,625 1,28,950 2,00,000