వరాల లక్ష్మి | GMR varalaksmi Foundation and services special story | Sakshi
Sakshi News home page

వరాల లక్ష్మి

Published Sun, Mar 6 2016 12:59 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

వరాల లక్ష్మి - Sakshi

వరాల లక్ష్మి

సామాజిక సేవలో జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్
వేలాదిమందికి వృత్తి విద్య శిక్షణతో ఉపాధి కల్పన
జిల్లాలు దాటి వస్తున్న నిరుద్యోగులు

ఎంతోమంది నిరుద్యోగులకు బాసటగా నిలిచింది జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్. వివిధ వృత్తి విద్యాకోర్సుల్లో శిక్షణ ఇస్తూ వారి ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తోంది. ఎనిమిదేళ్లుగా నిరుద్యోగ యువతీ, యువకుల స్వయం ఉపాధికి ఊతమిస్తోంది. ఉచితంగా భోజనం, రవాణా సౌకర్యం కల్పిస్తోంది. తమకాళ్లపై తాము నిలబడేలా తీర్చిదిద్దుతోంది. వారి ఉన్నతికి పాటుపడుతూ బతుకుపై భరోసా కల్పిస్తోంది. ఇక్కడ శిక్షణ పొందిన ఎంతోమంది ప్రస్తుతం ఆయా రంగాల్లో స్థిరపడ్డారు. నిరుద్యోగులకు దన్నుగా నిలుస్తున్న జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్‌పై ఈ ఆదివారం ప్రత్యేకం.. - శంషాబాద్

      ఎనిమిదేళ్లు.. 273 బ్యాచ్‌లు.. 5,356 మందికి శిక్షణ. గ్రామీణ యువతకు దారి చూపడమే లక్ష్యంగా ఏర్పాటైన ‘జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్’ నిరుద్యోగుల బతుకుల్లో వెలుగులు నింపుతోంది. శంషాబాద్ సమీపంలో ఎయిర్‌పోర్టును నిర్మించిన సంస్థ అక్కడి నుంచే సేవా కార్యక్రమాలను విస్తరించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఏర్పాటైన వరలక్ష్మీ ఫౌండేషన్ అనేక మందికి వృత్తి విద్యా శిక్షణ ఇచ్చి జీవితంలో స్థిరపడేలా చేసింది. మొత్తం తొమ్మిది కోర్సుల్లో ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. కేవలం 8వ తరగతి పాసై ఉంటే చాలు.. వీరు ఇచ్చే శిక్షణ జీవితానికి దారిచూపుతుంది. - శంషాబాద్

 కీసర: హరహరమహాదేవ.. శంభోశంకర అంటూ భక్తుల జయజయధ్వానాల మధ్య శనివారం కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ వేదపాఠశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున అవధాని సర్వోపద్రష్టగా, ఆచార్య పుల్లేటీకుర్తి గణపతిశర్మ ఆధ్వర్యంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి మహేందర్‌రెడ్డి, ఆలయ చైర్మన్ తటాకం ఉమాపతిశర్మ దంపతులచే మహామండపంలో విఘ్నేశ్వరపూజ, పుణ్యావచనంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. యాగశాల ప్రవేశం చేసి వేదపండితులు జ్యోతి ప్రతిష్ఠాపన చేశారు. బేరీపూజ, ధ్వజారోహణ కార్యక్రమాలను కన్నుల పండువగా నిర్వహించారు. మంత్రి మహేందర్‌రెడ్డికి ఆలయ వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారి ఆశీర్వచనం, ప్రసాదాన్ని అందజేశారు. సాయంత్రం స్వామివారు పల్లకీసేవ ద్వారా కీసర గ్రామానికి బయలుదేరారు. తిరిగి ఆదివారం సాయంత్రం కీసరగుట్టకు చేరుకుంటారు. అనంతరం స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. పూజా కార్యక్రమాల్లో ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి, తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, ఎంపీడీఓ వినయ్‌కుమార్,  ఫౌండర్‌ట్రస్టీ ఫ్యామిలీ సభ్యులు తటాకం నారాయణశర్మ, రమేష్‌శర్మ, వెంకటేష్‌శర్మ, నాగలింగంశర్మ, శ్రీనివాస్‌శర్మ, ఈఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

 తొలిరోజు విశేషాలు
ఉదయం 11 గంటలకు ప్రారంభం కావా ల్సిన క్రీడా పోటీలు మధ్యాహ్నం 12 గంటల తరువాత మొదలవడంతోవిద్యార్థులు కొద్దిగా ఇబ్బంది పడ్డారు.

జిల్లాస్థాయి గ్రామీణ క్రీడాపోటీల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన  విద్యార్థులకు కందాడి స్కైలాబ్‌రెడ్డి స్వచ్ఛం దసంస్థ అధ్యక్షుడు కందాడి స్కైలాబ్‌రెడ్డి క్రీడాదుస్తులు అందజేశారు. సుమారు 2000 వేలమందికి భోజనవసతి కల్పించారు.  ఈ ఏడాది కూడా అధికారులు సావనీర్ సంగతిని మరిచారు.

ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన కీసరగుట్ట దేవాలయ ఆధునికీకరణ కమిటీ (రిసెప్షన్ కమిటీ) సభ్యులు శనివారం ఆలయ ప్రాంగణంలో ప్రమాణా స్వీకారం చేశారు. ఆర్యవైశ్య అన్నదానసత్రం, వంశరాజ్‌సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్నదానం ప్రారంభించారు. 

జాతర సందర్భంగా 15 కమిటీల ఆధ్వర్యంలో భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జేసీ రజత్‌కుమార్ సైనీ, ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 300 ఆర్టీసీ బస్సులు నడుస్తాయని, నిరంతరాయంగా తాగునీరు, శానిటేషన్, విద్యుత్ సరఫరా అందించడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.

బ్రహ్మోత్సవాల్లో నేడు..
ఆదివారం ఉదయం రుద్రస్వాహాకార హోమం, వేదపారాయణం, సాయంత్రం బిల్వార్చన, రాత్రి ప్రదోషకాల పూజ, హారతి, మంత్రపుష్పం, పరాకస్తవం, తీర్థప్రసాద వినియోగం, స్వామివారు కీసర గ్రామం నుంచి కీసరగుట్టకు విచ్చేయుట, రాత్రి 10 గంటలకు  ఉత్తారాషాడ నక్షత్రయుక్త తు లలగ్నంలో శ్రీ భవానీ శివదుర్గా సమేత రామలింగే శ్వర స్వామివారి కల్యాణ మహోత్సవం ఉంటాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు కీసరలో పోచమ్మ అంగడి నిర్వహిస్తారు. శివరాత్రి తొలిపూజకు హాజరయ్యే అమ్ముగూడ, యాప్రాల్ తదితర ప్రాంతాలకు చెందిన తమిళులు పోచమ్మ అంగడిలో పాల్గొని అనంతరం ఉపవాస దీక్షను చేపడుతారు.

జీఎంఆర్ సంస్థలకు దేశవ్యాప్తంగా ఎన్నో సంస్థలున్నాయి. ఆయా ప్రాంతాల్లో తమ సంస్థలు నెలకొల్పిన చోట గ్రామీణ ప్రజల సాధికారతే లక్ష్యంగా జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ పనిచేస్తోంది. ఎనిమిదే ళ్ల క్రితం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించిన జీఎంఆర్ సంస్థ విమానాశ్రయం పరిధిలోనే జీఎంఆర్ వరలక్ష్మీ వృత్తి విద్యా శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పింది. ఎమినిదేళ్ల కాలంలో 273 బ్యాచ్‌ల ద్వారా 5,356 మందికి వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణనిచ్చారు. ఇందులో సుమారు 4,779 మంది వివిధ రంగాల్లో ఉపాధి పొందడం విశేషం.

 ప్రముఖ కంపెనీలతో సమన్వయం..
ఇక్కడ శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఉపాధి పొందడమో.. స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయడమో చేసేలా సంస్థ కృషి చేస్తోంది. మొత్తం 9 కోర్సుల్లో గ్రామీణ యువకులు, మహిళలు శిక్షణ పొందుతున్నారు. ఎనిమిదో తరగతి కనీస అర్హతగా ఉన్న యువకులు సైతం శిక్షణలో రాటుదేలి తమ కాళ్లపై తాము నిలబడేలా కోర్సులను డిజైన్ చేశారు. ద్విచక్ర వాహనాల మరమ్మతులో హిరోమోటార్ కంపెనీ, ఎలక్ట్రీషియన్‌లో స్క్నేడియర్ సంస్థ, డ్రైవాల్స్, ఫాల్స్ సీలింగ్‌లో సెయింట్ గోబ్యాన్, రిఫ్రిజిరేటర్ మెకానిజంలో వోల్టాస్, ఎక్స్‌కావేటర్ ఆపరేటింగ్‌లో వోల్వో సంస్థలతో సమన్వయం చేసుకుని శిక్షణ అందిస్తున్నారు. హౌస్‌కీపింగ్, కంప్యూటర్, కుట్టుమిషన్ వెల్డింగ్ కోర్సులు సైతం యువత ఉపాధికి ఊతమిస్తున్నాయి.

 ఆన్‌లైన్ విక్రయాలు..
వరలక్ష్మీ ఫౌండేషన్‌లో జ్యూట్ బ్యాగుల తయారీలో శిక్షణ పొందిన 30మంది మహిళలు అద్భుత విజయాలను సాధిస్తున్నారు. రెండు కేంద్రాల ద్వారా వీరు తయారు చేస్తున్న జ్యూట్‌బ్యాగులు అంతర్జాతీయంగాఅమ్ముడుపోతున్నాయి. వీటిని ఫ్లిప్‌కార్ట్ లాంటి ప్రముఖ ఆన్‌లైన్ విక్రయ సంస్థలు ఆన్‌లైన్ అమ్మకాల్లో పెడుతున్నాయి. ఈ బ్యాగుల తయారీ టర్నోవర్ ఇటీవలే రూ.70లక్షల వరకు చేరుకుం దని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. మహిళలు తయారు చేస్తున్న ఈ జ్యూట్ బ్యాగుల మార్కెటింగ్‌కు సైతం జీఎం ఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ భుజానికెత్తుకుని వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తోంది. ప్రస్తుతం జ్యూట్ బ్యాగుల తయారీ కేం ద్రంలో పనిచేస్తున్న మహిళలు మార్కెటింగ్ అనుసారంగా నెలకు రూ.10వేలకుపైగా సంపాదిస్తున్నట్లు వెల్లడించారు.

 భోజనం, రవాణా వసతి..
ఇక్కడ కేవలం వృత్తి విద్యా శిక్షణే కాకుండా యువతను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్నారు. వారిలో మానసిక పరివర్తనను పెంపొందించేందుకు ప్రత్యేక తరగతులు తీసుకుంటున్నారు. ఉదయం యోగా లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. శిక్షణ పొందుతున్న అబ్బాయిలకు స్థానికంగానే భోజనవసతి కల్పిస్తున్నారు. మహిళలకు ఆయా గ్రామాల నుంచి ఉచిత బస్సు రవాణా కల్పించడంతో పాటు మధ్యాహ్న భోజనం సైతం అందిస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు.

 మరెన్నో సేవలు..
వరలక్ష్మీ ఫౌండేషన్ దత్తత తీసుకున్న ఎయిర్‌పోర్టు కాలనీ, మామడిపల్లి, గొ ల్లపల్లి తదితర గ్రామాల్లో వలంటీర్ల ద్వారా విద్యాబోధన, అంగన్‌వాడీ కేంద్రాలు,వాటర్ ఫిల్టర్ సౌకర్యం, మొబైల్ వైద్య కేంద్రం, మందుల పంపిణీ, గర్భిణుల కు పౌష్టికాహార పంపిణీ నిరంతరాయం గా కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement