హైస్కూళ్లలో వృత్తి విద్య | Implementation Of Vocational Education In High Schools | Sakshi
Sakshi News home page

హైస్కూళ్లలో వృత్తి విద్య

Published Fri, Jan 31 2020 3:18 AM | Last Updated on Fri, Jan 31 2020 3:18 AM

Implementation Of Vocational Education In High Schools - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘దేశంలో 12వ పంచవర్ష ప్రణాళిక అంచనా ప్రకారం 19 ఏళ్ల నుంచి 24 ఏళ్ల లోపు వారిలో వృత్తి విద్యను అభ్యసిస్తున్న వారు 5 శాతం లోపే ఉన్నారు. ఇతర దేశాలతో పోల్చితే ఇది చాలా తక్కువ. ఆ వయసు వారు అమెరికాలో 52% మంది, జర్మ నీలో 75% మంది.. దక్షిణ కొరి యాలో 96% మంది వృత్తి విద్యను అభ్యసిస్తున్న వారే ఉన్నారు. కానీ మన దేశంలో పరిస్థితి అందుకు భిన్నం. అందుకే 2025 నాటికి దేశంలోని 50 శాతం మంది విద్యార్థులైనా వృత్తి కోర్సు లను అభ్యసించేలా చర్యలు చేపట్టాల్సిందే.. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య, యూనివర్సిటీల వరకు వృత్తి విద్యా కోర్సులను కచ్చితంగా ప్రవేశ పెట్టా ల్సిందే..’అని నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ) నివేదికలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం 2017 జూన్‌లో డాక్టర్‌ కస్తూరి రంగన్‌ నేతృత్వంలో నిపు ణుల కమిటీని నియమించింది. 2019 మే నెలలో తమ డ్రాఫ్ట్‌ పాలసీని ఆ కమిటీ కేంద్ర మానవ వన రుల అభివృద్ధి శాఖకు (ఎంహెచ్‌ఆర్‌డీ) అంద జేసింది. దానిపై ఎంహెచ్‌ఆర్‌డీ దేశవ్యాప్తంగా నిపు ణులు, మేధావుల నుంచి అభిప్రాయాలను సేకరిం చింది. వాటిన్నింటినీ పరిగణన లోకి తీసుకొని న్యూ ఎడ్యుకేషన్‌ పాలసీ–2020 ఫైనల్‌ కాపీని అం దుబాటులోకి తెచ్చింది. అందులో వృత్తి విద్యకు సంబంధించిన కీలక సిఫారసులు చేసింది.

ఒకప్పుడు డ్రాపౌట్స్‌ కోసమే..
ఇతర దేశాలతో పోల్చితే వృత్తి విద్యా కోర్సులను చదువుతున్న యువత దేశంలో చాలా తక్కువగా ఉందని, ఈ నేపథ్యంలో వృత్తి విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని నూతన విద్యా విధానంలో కమిటీ సిఫారసు చేసింది. గతంలో వృత్తి విద్యా కోర్సులను కేవలం డ్రాపౌట్స్‌ కోసమే 8వ తరగతిలో కొనసాగించినా ఇప్పుడు దానిని పాఠశాల విద్య స్థాయి నుంచి కాలేజీల్లోనూ ప్రవేశపెట్టాల్సిన అవసర ముందని పేర్కొంది. వొకేషనల్‌ సబ్జెక్టులతో 11–12 తరగతులు పూర్తి చేసే వారు ఉన్నత విద్యలోలోనూ వొకేషనల్‌ కోర్సులను చదువుకునేలా అవకాశాలను మెరుగుప ర్చాల్సిన అవసరముందని స్పష్టంచేసింది. స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీలు.. ఇలా అన్ని స్థాయిల్లో వృత్తి విద్యను దశల వారీగా అమలు చేయాల్సిందేనని వెల్లడించింది. ప్రాథమి కోన్నత పాఠశాల దశ నుంచే నాణ్యమైన వృత్తి విద్యను అందిస్తూ ఉన్నత విద్య వరకు తీసుకెళ్లాలని స్పష్టం చేసింది. అంతేకాదు ప్రతి విద్యా ర్థి ఒక వృత్తి విద్యా కోర్సును చది వేలా చర్యలు చేపట్టాలని వెల్ల డించింది. ఇలా 2025 నాటికి కనీసంగా 50 శాతం మంది వృత్తి విద్యా కోర్సులను చదివేలా చూడాలని వివరించింది. 

రెగ్యులర్‌ కోర్సులతో  పాటు దూరవిద్యలోనూ..
రెగ్యులర్‌ కోర్సులతోపాటు దూ ర విద్యా విధానంలోనూ వీలైన న్ని కోర్సులను అమలు చేసేందు కు చర్యలు చేపట్టాలని ఎన్‌ఈపీ పేర్కొంది. మొత్తానికి వచ్చే పదేళ్లలోగా వృత్తి విద్యను ప్రధా న విద్యగా అన్ని సెకండరీ స్కూళ్ల లో అమలు చేయాలని స్పష్టం చేసింది. అలాగే సెకండరీ స్కూళ్ల తో ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు, స్థానిక పరిశ్రమలను అనుసం ధానం చేయాలని, ఉన్నత విద్యా సంస్థలు సొంతంగా లేదా పారిశ్రామిక భాగస్వామ్యంతో వృత్తి విద్యా కోర్సులను నిర్వహించాలని పేర్కొంది. ఉన్నత విద్యలో 2013లో బ్యాచిలర్‌ ఆఫ్‌ వొకేషనల్‌ డిగ్రీని ప్రవేశపెట్టినా, అది సరిపోదని పేర్కొంది. అన్ని ఇతర డిగ్రీ కోర్సుల్లో వొకేషనల్‌ కోర్సులు ఉండేలా చూడాలని వెల్లడించింది. 

స్థానిక అవకాశాల మేరకు కోర్సులు..
ఉన్నత విద్యా సంస్థలు సాఫ్ట్‌ స్కిల్‌ తదితర సర్టిఫికెట్‌ కోర్సులను ప్రవేశపెట్టాలని ఎన్‌ఈపీ సిఫారసు చేసింది. దేశంలో ఏయే రంగాల్లో స్కిల్‌ గ్యాప్‌ ఉందో పరిశీలించి, స్థానికంగా ఉపాధి అవ కాశాలు ఏయే రంగాల్లో ఉన్నాయో చూసి అలాంటి కోర్సులను ప్రవేశ పెట్టాలని స్పష్టం చేసింది. టెక్నికల్‌ ఎడ్యుకేషన్, వొకేషనల్‌ ఎడ్యుకేషన్‌ను సమగ్ర విద్యా విధా నంలో భాగంగా చే యాల్సిందేనని తెలి పింది. ఇందుకోసం విద్యా మంత్రిత్వ శాఖ, పారిశ్రామిక భాగస్వా మ్యంతో నేషనల్‌ కమిటీ ఫర్‌ ది ఇంటి గ్రీషన్‌ ఆఫ్‌ వొకేషనల్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీఐవీఈ) ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఇందు కు అవసరమై న బడ్జెట్‌ను కూడా కేటాయించాలని పేర్కొంది. విద్యా సంస్థలు అవకాశాలు ఎక్కడెక్క డ ఉన్నాయో ఆలోచించి, పరిశీలించి ఎన్‌సీఐవీఈ సహకారంతో కొత్త కోర్సులను ప్రారంభించాలని స్పష్టంచేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement