వ్యాపారానికి సామాజిక బాధ్యత తోడైతే ఎలా ఉంటుందో చెప్పకనే చెబుతుంది చెన్నైకి చెందిన పంప్‌కిన్ టేల్స్. ఆల్–ఉమెన్ టీమ్ రెస్టారెంట్‌గా ప్రత్యేకతను సాధించిన‘పంప్‌కిన్ టేల్స్’ అమ్మాయిలలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించే బడి. చల్లగా చూసే అమ్మ ఒడి.
‘పంప్‌కిన్ ఉపాధి ఇవ్వడమే కాదు. ఉత్సాహాన్ని ఇస్తుంది. కొత్త విషయాలు ఎన్నో నేర్చుకునేలా సహాయపడుతుంది’ అంటారు ఉద్యోగులు.
ఉద్యోగం కోసం తాను ఉంటున్న డార్జిలింగ్ నుంచి గోవాకు వెళ్లాలనుకున్న అనూష మింజ్ విధివశాత్తు చెన్నైకి వచ్చింది. అక్కడి వాతావరణం ఆమెకు బాగా నచ్చింది.
‘నా కొలీగ్స్‌తో ఎన్నో విషయాలు చర్చించే అవకాశం దొరికింది’ అంటుంది అనూష.
‘మహిళలు కేఫ్‌లను నిర్వహించలేరు’లాంటి అపోహలకు అడ్డుకట్ట వేయడం కోసం చింది వరదరాజులు, జె.భువనేశ్వరి, ఆర్. రాజేశ్వరి అనే మహిళలు 2017లో ‘పంప్‌కిన్ టేల్స్’ప్రారంభించారు. రెస్టారెంట్, బేకరి, కేటరింగ్ విభాగాల్లో మంచి పేరు తెచ్చుకుంది... పంప్‌కిన్ టేల్స్.
టేబుల్స్‌ను సెట్ చేయడం నుంచి కస్టమర్‌లతో ఇంటరాక్ట్ కావడం, ఆర్డర్లు తీసుకోవడం, టేక్ అవేలను రెడీ చేయడం వరకు ఎన్నో పనులు చేస్తుంది ఈ ఆల్–ఉమెన్ టీమ్.
‘ఉద్యోగంలో చేరే సమయంలో రెస్టారెంట్‌లో పనికి సంబంధించి వారిలోప్రాథమిక జ్ఞానం ఉంటుంది. ఆ తరువాత టేబుల్ సెట్ చేయడం నుంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్ మెరుగుపరుచుకోవడం వరకు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ఆ వెంటనే వారిలో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది’ అంటారు కంపెనీ డైరెక్టర్లు భువనేశ్వరీ, రాజేశ్వరి.
ఉదాహరణకు ‘పంప్‌కిన్’ వందమందికి పైగా మహిళల కుటుంబాలకు ఉ΄ాధి కల్పిస్తోంది. రెస్టారెంట్ ప్రారంభమైనప్పుడు షిల్లాంగ్‌కు చెందిన మోనిక వెయిటర్‌గా చేరింది. ఇప్పుడు ఆమె రెస్టారెంట్‌కు సంబంధించిన సమస్త విషయాలలోప్రావీణ్యం సాధించింది.
‘ఎవరి మీదా ఆధారపడకుండా సొంత కాళ్ల మీద నిలబడుతున్నందుకు గర్వంగా ఉంది. మా అమ్మాయి చెన్నైలో పనిచేస్తోంది. నెల నెలా నాకు డబ్బులు పంపిస్తుంది అని నా గురించి అమ్మ గర్వంగా చెప్పుకుంటుంది’ అంటుంది మోనిక.
మోనిక ఏదో ఒకరోజు ఎక్కడో ఒకచోట సొంతంగా రెస్టారెంట్ ్ర΄ారంభించవచ్చు. ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించవచ్చు. స్థూలంగా చె΄్పాలంటే ‘పంప్‌కిన్ టేల్స్’ అనేది అనే ఉ΄ాధి కేంద్రమే కాదు, ఉజ్వల భవిష్యత్‌కు ఉపయోగపడే కేంద్రం కూడా.
Comments
Please login to add a commentAdd a comment