వాషింగ్టన్: అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు యూఎస్ సిటిజెన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) తీపి కబురు అందించింది. గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారితోపాటు కొన్ని నాన్–ఇమిగ్రేషన్ కేటగిరీల్లో ఉన్నవారికి ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ కార్డులు(ఈఏడీ) అందజేయనున్నట్లు ప్రకటించింది. ఈ కార్డులు ఐదేళ్లపాటు చెల్లుబాటు అవుతాయని వెల్లడించింది.
ఈఏడీలతో అమెరికాలో వేలాది మంది భారతీయులకు లబ్ధి చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కార్డులతో వారికి అక్కడ ఉద్యోగాలు చేసుకోవడానికి సులభంగా అనుమతి లభిస్తుందని పేర్కొంటున్నారు. అమెరికాలో 10.5 లక్షల మందికిపైగా భారతీయులు ఎంప్లాయ్‌మెంట్ ఆధారిత గ్రీన్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. నిబంధనల ప్రకారం వీరందరికీ గ్రీన్‌కార్డులు రావాలంటే 50 ఏళ్లు పడుతుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment