![Deported from US Punjab girl who went to marry fiancé,](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/panjab1.jpg.webp?itok=6kigw1c9)
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టగానే (Donald Trump) అక్రమ వలస దారులపై ఉక్కుపాదం మోపిన అమెరికా ప్రభుత్వం(USA).. పలువురు భారతీయుల్ని వెనక్కి పంపుతోంది. ఆ దేశంలో అక్రమంగా నివసిస్తున్న ఎవరినీ ఉపేక్షించేది లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన విధంగానే పలువుర్ని తిరిగి తమ స్వదేశాలకు పంపుతున్నారు. ఇందులో భారతీయులు కూడా అధికంగానే ఉన్నారు. దీనిలో భాగంగా నిన్న (బుధవారం) ఓ విమానంలో 104 మంది వరకూ భారత్‌కు తిరిగి వచ్చారు. ఇందులో పంజాబ్ వారే అత్యధికంగా ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క గాథ.
అమెరికా వెళితే జీవితం సెటిల్ అయిపోతుందనే భావనతో చాలామంది లక్షల్లో డబ్బులు చెల్లించి అక్రమంగా అక్కడకు వెళ్లిన వారు.. అక్కడ ప్రభుత్వం తాజా చర్యలతో ఉసురుమంటూ వెనక్కి వచ్చేస్తున్నారు. ఇలా వచ్చిన వారిలో కొంతమందిని జాతీయ మీడియా పలకరించగా, ఒక్కొక్కరు ఒక్కో కథ చెబుతున్నారు. తాము అక్రమంగా(illegal immigrants) వెళ్లామా.. లేదా అన్న సంగతిని అంత సీరియస్‌గా తీసుకోకపోవడంతో వారు రూ. 30 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకూ చేతులు దులుపుకున్న వైనమే మనకు వారి మాటల్లో కనిపిస్తోంది.
పంజాబ్‌లోని వీర్పల్ గ్రామం నుంచి అక్రమంగా అమెరికాకు వలస వెళ్లిన సుఖ్‌జీత్ కౌర్ అనే 26 ఏళ్ల యువతి.. తన కాబోయే వాడిని పెళ్లి చేసుకోవడానికి దొడ్డిదారిన అమెరికాకు వెళ్లింది. అయితే ఆమె పెళ్లి జరగడానికి కొన్ని నిమిషాల ముందు ఆమెను అరెస్ట్ చేశారు అక్కడి పోలీసులు. సుఖ్‌జీత్ తన చదువును పంజాబ్‌లోనే పూర్తి చేసుకున్నప్పటికీ తన భర్త కాబోయే వాడు అమెరికాలో ఉండటంతో అక్కడకు అక్రమంగా ప్రవేశించింది. ఒక ఏజెంట్‌కు లక్షల్లో డబ్బులు చెల్లించి అక్రమంగా అమెరికాలో అడుగుపెట్టింది. ఇప్పుడు ఆమె పెళ్లి కాకుండానే అమెరికాను వీడి స్వదేశానికి చేరుకుంది. సుఖ్‌జీత్ కౌర్ తండ్రి ఇటలీలో నివసిస్తుండగా, తల్లి, సోదరుడు పంజాబ్‌లోనే ఉంటున్నారు.
అమృత్‌సర్ నివాసి అయిన అజయ్‌దీప్ సింగ్‌ది మరో కథ. 15 రోజుల క్రితమే అమెరికాకు వెళ్లాడు. ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలస దారుల్నివెనక్కి పంపుతుందనే సమాచారం ఉన్నా అతను మాత్రం యూఎస్‌కు అక్రమంగా వలస వెళ్లాడు.. అయితే అజయ్‌దీప్ సింగ్ కూడా తిరిగి భారత్‌కు పంపబడ్డ జాబితాలో ఉండటంతో అతను తాత చరణ్‌జీత్ సింగ్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాడు. తన మనవడ్ని వెనక్కి పంపడం కచ్చితంగా తప్పేనని అంటున్నాడు. ఈరోజుల్లోఅమెరికాకు వెళ్లాలని యువత అనుకోవడం తప్పా అని ఎదురు ప్రశ్నిస్తున్నాడు. అమెరికాకు వెళ్లాలనే యువత ఆలోచనల్లో తప్పేందముని అక్రమ వలస విధానాన్ని కూడా సమర్థించుఉంటున్నాడు.
అమృత్‌సర్‌కు చెందిన దలీర్‌సింగ్‌ది మరో గాథ.. అతనొక బస్సు డ్రైవర్. అమెరికాకు వెళ్లి లక్షల్లో డబ్బులు సంపాదించాలనుకున్నాడు. ఎలాగోలా రూ. 30 లక్షలు కూడబెట్టి ఒక ఏజెంట్‌ను పట్టుకుని అక్రమంగా యూఎస్‌కు వెళ్లిపోయాడు. అది కూడా నెలక్రితమే అతను అమెరికాకు చేరుకున్నాడు. అయితే 15 రోజుల క్రితం వరకూ ఫోన్ కాల్‌లో కుటుంబ సభ్యులతో టచ్ లో ఉన్న దలీర్ సింగ్.. ఆ తర్వాత నుంచి ఎటువంటి ఫోన్ రాలేదు. అయితే అతన్ని తిరిగి ఇండియాకు పంపుతున్నట్లు అమెరికా పోలీసుల నుంచి కాల్ రావడంతో దలీర్ సింగ్ గురించి తెలిసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
అక్షదీప్.. ఇతను కూడా అమెరికాకు అక్రమంగా వెళ్లి అడ్డంగా బుక్కైపోయాడు. అమెరికాలో చదువుల కోసం అతను చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో అక్షదీప్ దుబాయ్‌కు వెళ్లిపోయాడు. అక్కడ ట్రక్ డ్రైవర్‌గా పని ేచేస్తున్నాడు అక్షదీప్,.అయితే అతను తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని అనుకున్నాడు. అందుకు తండ్రి స్వర్ణ్ సింగ్ సాయం కోరాడు. అందుకు తండ్రి సరే అన్నాడు. దానిలో భాగంగా తండ్రి స్వర్ణ్‌సింగ్ కు ఉన్న మూడు ఎకరాల భూమిని తాకట్టు పెట్టాడు. అయితే సుమారు రూ. 50 లక్షల నుంచి ూరూ. 60 లక్షల వరకూ ఖర్చు పెట్టాడు కుమారుడు అమెరికా పయనం కోసం. అయితే అమెరికాకు వెళ్లిన వాడు వెళ్లినట్లు తిరిగి వచ్చేశాడు అక్షదీప్ సింగ్.
దీనిపై తండ్రి స్వర్ణ్ సింగ్ మాట్లాడుతూ.. కొడుకు క్షేమంగాతిరిగి ాభారత్‌కు వచ్చాడని, అదే సంతోషమని అంటున్నాడు. డబ్బులు అనేవి వస్తుంటాయి.. పోతుంటాయి అని, ఇది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment