బాలాసోర్(ఒడిసా): భారత నావికా దళం అమ్ములపొదిలోకి మరో కీలక అస్త్రం చేరనుంది. దేశీయంగానే అభివృద్ధి చేసిన సూపర్‌సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో(స్మార్ట్) వ్యవస్థను సోమవారం విజయవంతంగా పరీక్షించారు. యాంటీ–సబ్‌మెరైన్ యుద్ధ తంత్రంలో ఇదొక కీలక మలుపు అని డీఆర్‌డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి చెప్పారు. ‘స్మార్ట్’తో భారత నావికాదళం సామర్థ్యం మరింత పెరిగిందని రక్షణ శాఖ తెలియజేసింది. సోమవారం ఉదయం 11.45 గంటలకు ఒడిశా తీరంలో ఏపీజే అబ్దుల్‌కలాం ఐలాండ్(వీలర్ ఐలాండ్)లో ‘స్మార్ట్’ను పరీక్షించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుం డా పరీక్ష పూర్తిస్థాయిలో విజయవంతమైంది. ‘స్మార్ట్’పరీక్ష నిర్వహించిన డీఆర్‌డీవో శాస్త్రవేత్తలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment