central defence minister
-
‘స్మార్ట్’ విజయవంతం
బాలాసోర్(ఒడిసా): భారత నావికా దళం అమ్ములపొదిలోకి మరో కీలక అస్త్రం చేరనుంది. దేశీయంగానే అభివృద్ధి చేసిన సూపర్సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో(స్మార్ట్) వ్యవస్థను సోమవారం విజయవంతంగా పరీక్షించారు. యాంటీ–సబ్‌మెరైన్ యుద్ధ తంత్రంలో ఇదొక కీలక మలుపు అని డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి చెప్పారు. ‘స్మార్ట్’తో భారత నావికాదళం సామర్థ్యం మరింత పెరిగిందని రక్షణ శాఖ తెలియజేసింది. సోమవారం ఉదయం 11.45 గంటలకు ఒడిశా తీరంలో ఏపీజే అబ్దుల్‌కలాం ఐలాండ్(వీలర్ ఐలాండ్)లో ‘స్మార్ట్’ను పరీక్షించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుం డా పరీక్ష పూర్తిస్థాయిలో విజయవంతమైంది. ‘స్మార్ట్’పరీక్ష నిర్వహించిన డీఆర్డీవో శాస్త్రవేత్తలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. -
'మేము ఒక్కరోజు విశ్రాంతి తీసుకోలేదు'
ఘజియాబాద్ : ప్రధాని మోధీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 100 రోజుల పాలనలో ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోలేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో నిర్వహించిన ఓ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రెండోసారి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్నప్పటికి మా ప్రభుత్వం ఏ ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోలేదని చెప్పారు. ఈ వందరోజుల్లో అద్భుత పనితీరును కనబరిచామని, ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నామని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం దిశా నిర్దేశం లేని ప్రభుత్వం అంటూ ఆర్థిక వ్యవస్థనుద్దేశించి విమర్శలు చేస్తుందని మండిపడ్డారు. -
నేపాల్ కు అన్నివిధాల సాయం చేస్తాం: పారికర్
న్యూఢిల్లీ : నేపాల్ కు అన్ని విధాల సహాయం చేయడానికి భారత్ సిద్ధమని కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. అవసరమైతే దేశ ఆర్మీ బలగాలను సహాయ నిమిత్తం అక్కడికి పంపిస్తామని శనివారం ఆయన తెలిపారు. భారత ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ నేపాల్ సర్కారుతో టచ్ లో ఉన్నారని పారికర్ పేర్కొన్నారు. నేపాల్ లో సంభవించిన భూకంపంలో 700మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. బీహార్ కు చెందిన 25 మంది, యూపీకి చెందిన 9 మంది మృతిచెందారు.