సాక్షి, విశాఖపట్నం: ఇండోనేసియాలో జరిగే మల్టీలేటరల్ నేవల్ ఎక్సర్‌సైజ్ కుమడో(ఎంనెక్)–2023లో పాల్గొనేందుకు తూర్పు నౌకాదళం నుంచి ఐఎన్‌ఎస్ సాత్పురా యుద్ధ నౌకను భారత నేవీ పంపించింది. సాత్పురాలో మకస్సర్ తీరానికి చేరుకున్న భారత నౌకాదళ బృందానికి అక్కడి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ నెల 8 వరకు ఆసియా దేశాల ఆధ్వర్యంలో విన్యాసాలు జరగనున్నాయి.
సోమవారం జరిగిన సిటీ పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాల్లో భారత నౌకాదళ బృందం పాల్గొంది. అలాగే ఇండోనేసియాలో త్వరలో నిర్వహించనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు సంబంధించి ఆ దేశ అధ్యక్షుడు జోకో విడోడో సమీక్ష నిర్వహించారు. ఇందులో సముద్ర భద్రతపై చర్చించారు.
చదవండి: Tanguturi Prakasam Pantulu: పుష్పగుచ్చం ఇచ్చి సన్మానం.. పూలకు బదులు పండ్లు తెస్తే తినేవాడినంటూ
Comments
Please login to add a commentAdd a comment