
భారత నౌకాదళాధికారులకు స్వాగతం పలకుతున్న బంగ్లాదేశ్ నౌకాదళాధికారులు
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): బంగ్లాదేశ్‌లోని పోర్టు మోంగ్లాలో భారత్–బంగ్లాదేశ్ ద్వైపాక్షిక నౌకా విన్యాసాలు ఈ నెల 24న ప్రారంభమయ్యాయి. ఇవి ఈ హార్బర్‌లో 24, 25వ తేదీల్లో, ఈశాన్య బంగాళాఖాతంలో 26, 27 తేదీల్లో నిర్వహిస్తున్నారు. ఈ ద్వైపాక్షిక విన్యాసాల్లో రెండు దేశాల నైపుణ్యాలు, సముద్ర తీర ప్రాంతం సామర్థ్యాలు ప్రదర్శించబడతాయి.
భారత నౌకాదళం నుంచి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మిస్సైల్ కరవెట్ కోరా నౌక, ఆఫ్ షోర్ గస్తీ నౌక సుమేధా ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. బంగ్లాదేశ్ నుంచి బీఎన్‌ఎస్ అబు ఉబైదా, ఆలీ హైదర్ అనే నౌకలు పాల్గొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment