సింథియా: ముంబైలోని మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ సారథ్యంలో ప్రాజెక్ట్ 17–ఏ ఫ్రిగేట్స్‌లో భాగంగా 7వ యుద్ధనౌక మహేంద్రగిరిని సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభించనున్నారు. అధునాతన ఆయుధాలు, సెన్సార్‌లు, ఫ్లాట్‌ఫామ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌తో సాంకేతికంగా అభివృద్ధి చెందిన యుద్ధనౌకగా రూపొందింది. పూర్తి స్వదేశీ రక్షణ సామర్థ్యంతో భవిష్యత్‌లో భారతదేశం గొప్ప నావికా వారసత్వానికి చిహ్నంగా నిలవనుందని తయారీదారులు అభివర్ణించారు.
ప్రాజెక్ట్–17ఏ కింద మొత్తం 4 నౌకలు మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ సారథ్యంలో నిర్మించగా.. మరో 3 నౌకలను జీఆర్‌ఎస్‌ఈ ద్వారా నిర్మిస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ దృఢ నిబద్ధతకు అనుగుణంగా ఇండియన్ నేవీకి చెందిన వార్‌షిప్ డిజైన్ బ్యూరో ద్వారా షిప్ అంతర్గత నిర్మాణాలు రూపుదిద్దుకున్నాయి. దేశం గర్వించదగ్గ యుద్ధనౌకగా మహేంద్రగిరి రూపొందినట్టు ఇండియన్ నేవీ వర్గాలు తెలిపాయి. ఈ యుద్ధనౌకను ఉప రాష్ట్రపతి జయదీప్ ధన్కర్ భార్య సుదేశ్ ధన్కర్ చేతుల మీదుగా ప్రారంభిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment