Indian Navy Recruitment 2021: Applications Open for 2500 Posts - Sakshi
Sakshi News home page

ఇండియన్‌ నేవీలో 2500 పోస్టులు

Published Mon, Oct 18 2021 6:09 PM | Last Updated on Mon, Oct 18 2021 6:16 PM

Indian Navy Recruitment 2021: Applications Open for 2500 Posts - Sakshi

ఇండియన్‌ నేవీ ఆర్టిఫిషర్‌ అప్రెంటిస్‌(ఏఏ), సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌(ఎస్‌ఎస్‌ఆర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోర్తుంది. 

ఇండియన్‌ నేవీ ఫిబ్రవరి 2022 బ్యాచ్‌ కోసం అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి ఆర్టిఫిషర్‌ అప్రెంటిస్‌(ఏఏ), సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌(ఎస్‌ఎస్‌ఆర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోర్తుంది. 
► మొత్తం పోస్టుల సంఖ్య: 2500

► పోస్టుల వివరాలు: ఆర్టిఫిషర్‌ అప్రెంటిస్‌(ఏఏ), సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌(ఎస్‌ఎస్‌ఆర్‌).

అర్హతలు
► ఆర్టిఫిషర్‌ అప్రెంటిస్‌: కనీసం 60 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. 

► సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌: కనీసం 60 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణులై ఉండాలి.

► వయసు: 01.02.2002 నుంచి 31.01.2005 మధ్య జన్మించి ఉండాలి. 

► వేతనం: శిక్షణ కాలంలో నెలకు రూ.14600 చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు డిఫెన్స్‌ పే మ్యాట్రిక్స్‌ ప్రకారం–రూ.21700–రూ.69100 అందిస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

► ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. 

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 

► దరఖాస్తులకు చివరి తేది: 25.10.2021

► వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in/en

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement