ఇండోనేషియాలోని సుమత్రా దీవులు ప్రకృతి విలయానికి అతలాకుతలమవుతున్నాయి. కుండపోత వర్షాలు ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 19 మంది మృతి చెందగా, ఏడుగురు గల్లంతయ్యారు.
ఇండోనేషియా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం సుమత్రా దీవుల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో గల్లంతైన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. విపత్తు నిర్వహణ ఏజెన్సీలు ఘటనా స్థలంలో సహాయ చర్యలను వేగవంతం చేస్తున్నాయి. ప్రమాద ప్రాంతంలోని ప్రజలను సురక్షితంగా తరలించారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు.
టన్నుల కొద్దీ మట్టి, రాళ్లు, నేలకూలిన చెట్లు నివాస ప్రాంతాల్లోకి చేరుకున్నాయని స్థానిక విపత్తు నిర్వహణ సంస్థ అధిపతి డోనీ యుస్రిజల్ తెలిపారు. పశ్చిమ సుమత్రా ప్రావిన్స్‌లోని పెసిసిర్ సెలాటాన్ జిల్లాలో పలు చోట్ల కొండచరియలు విరిగిపడి గ్రామాల్లో విధ్వసం సృష్టించాయి. ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య 19 కి చేరుకుంది. వరదలతో పాటు కొండచరియలు విరిగిపడినకారణంగా 14 గృహాలు నేలమట్టమయ్యాయి. 80 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment