Torrential
-
శ్రీనగర్‌లో భారీ వర్షం.. పలు ప్రాంతాలు జలమయం
జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని కెల్లర్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ఒక వంతెన కూలిపోయింది. శ్రీనగర్‌లోని అనేక రహదారులు జలమయమ్యాయి. వరదల కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.శ్రీనగర్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనాన్ని పలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ-పూంచ్ హైవేను మూసివేశారు. ఆగస్టు 18, 19 తేదీల్లో రాజోరి, రియాసి, రాంబన్, జమ్ము, ఉధంపూర్, సాంబా, కథువా జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో 64 నుంచి 115 మి.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.శ్రీనగర్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. గందర్బల్ జిల్లాలోని హస్నాబాద్ కంగన్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. జమ్మూలోని విక్రమ్ చౌక్, ఓల్డ్ సిటీ, భగవతి నగర్, కెనాల్ రోడ్, తలాబ్ టిల్లో, జానీపూర్, రిహారి తదితర ప్రాంతాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. కథువా, రియాసీలో తేలికపాటి వర్షం కురిసింది. -
కొండచరియలు విరిగిపడి 19 మంది మృతి!
ఇండోనేషియాలోని సుమత్రా దీవులు ప్రకృతి విలయానికి అతలాకుతలమవుతున్నాయి. కుండపోత వర్షాలు ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 19 మంది మృతి చెందగా, ఏడుగురు గల్లంతయ్యారు. ఇండోనేషియా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం సుమత్రా దీవుల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో గల్లంతైన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. విపత్తు నిర్వహణ ఏజెన్సీలు ఘటనా స్థలంలో సహాయ చర్యలను వేగవంతం చేస్తున్నాయి. ప్రమాద ప్రాంతంలోని ప్రజలను సురక్షితంగా తరలించారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. టన్నుల కొద్దీ మట్టి, రాళ్లు, నేలకూలిన చెట్లు నివాస ప్రాంతాల్లోకి చేరుకున్నాయని స్థానిక విపత్తు నిర్వహణ సంస్థ అధిపతి డోనీ యుస్రిజల్ తెలిపారు. పశ్చిమ సుమత్రా ప్రావిన్స్‌లోని పెసిసిర్ సెలాటాన్ జిల్లాలో పలు చోట్ల కొండచరియలు విరిగిపడి గ్రామాల్లో విధ్వసం సృష్టించాయి. ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య 19 కి చేరుకుంది. వరదలతో పాటు కొండచరియలు విరిగిపడినకారణంగా 14 గృహాలు నేలమట్టమయ్యాయి. 80 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
కుండపోత
బంగళాఖాతంలో అల్పపీడనం కారణంగా జిల్లావ్యాప్తంగా వర్షాలు పడుతున్నారుు. శుక్రవారం పలు చోట్ల ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురిసింది. భారీ వర్షాలకు రహదారులు జలమయమయ్యూరుు. ప్రయూణికులు ఇబ్బందులు పడ్డారు. వర్షాల రాకపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు . - భీమవరం అర్బన్/తాడేపల్లిగూడెం పొంగుతున్న వాగులు పోలవరం రూరల్ : పోలవరం మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పాపికొండల సమీపంలో కొండలపై కురుస్తున్న వర్షాలకు శుక్రవారం కొండవాగులు పొంగి ప్రవహించాయి. గుంజవరం గ్రామ సమీపంలో కొండకాలువ ఉధృతంగా ప్రవహించడంతో క్రమేపీ చెరువులో నీరు చేరుతుంది. మండలంలో అతిపెద్ద చెరువైన కొత్తూరు చెరువుకు రామన్నపాలెం సమీపంలోని కాలువ ద్వారా నీరు చేరుతోంది. చెరువుల్లోకి నీరు చేరుతుండటంతో రైతులు ఆకుమడి వేసేందుకు సిద్ధమవుతున్నారు. వాయుగుండంగా మారిన అల్పపీడనం ఏలూరు : జిల్లాలో ఎడతెరిపినివ్వకుండా వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఉదయం 11 గంటల నుంచి జిల్లావ్యాప్తంగా చిరుజల్లులతో వర్షం ప్రారంభమై మధ్యలో విరామం ఇస్తూ రాత్రి వ రకు చెదురుమదురుగా వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. మెట్టప్రాంతం అయిన పోలవరం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెంలో గురువారం నుంచి వరుణుడి కరుణ మొదలైంది. దీంతో ఇక్కడ కూడా రైతులు పొలాలు దుక్కిదున్నుతూ కనిపించారు. నైరుతీ రుతుపవనాలు పుంజుకున్న నేపథ్యంలో అల్పపీడనం వాయుగుండంగా మారటంతో శనివారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తొలకరి జల్లులు ఊపందుకోవడంతో రైతుల పొలాలు దుక్కిదున్నటం ముమ్మరం చేస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే జిల్లాలో 28.5 మిల్లీమీటర్లు సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వేలేరుపాడులో 56.9 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. సాధారణ వ ర్షపాతం 75.8 మిల్లీమీటర్లు వర్షం కురవాల్సి ఉండగా ఇప్పటివరకు 165.8 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. మొత్తం మీద 118.7 మిల్లీమీటర్లు అధికంగా కురిసింది. వ్యవసాయ పరంగా ఈ వర్షం ఎంతో మేలు చేకూరుతుందని అధికారులు చెబుతున్నారు. మండలాల వారీగా వర్షపాతం ఇలా.. జీలుగుమిల్లిలో 24.6, బుట్టాయగూడెంలో 61.2, పోలవరంలో 31.3, తాళ్లపూడిలో 43.8, గోపాలపురంలో 33.5, కొయ్యలగూడెంలో 40.4,జంగారెడ్డిగూడెంలో 41.8, టి నర్సాపురంలో 18.2, చింతలపూడిలో 16.9, లింగపాలెంలో 14.8, కామవరపుకోటలో 27.7, ద్వారకాతిరుమలలో 21.5, నల్లజర్లలో 14.7,దేవరపల్లిలో 9.5, చాగల్లు 37.1, కొవ్వూరులో 35.9,నిడదవోలులో 17.0, తాడేపల్లిగూడెంలో 21.9, ఉంగుటూరులో 19.1, భీమడోలులో 24.2, పెదవేగిలో 7.7, పెదపాడులో 16.6, ఏలూరులో 12.6, దెందులూరులో 23.7, నిడమర్రులో 26.8, గణపవరంలో 19.3, పెంటపాడులో 35.7, తణుకులో 28.7,ఉండ్రాజవరంలో 34.9, పెరవలిలో 33.0, ఇరగవరంలో 34.2, అత్తిలిలో 36.4, ఉండిలో 25.4, ఆకివీడులో 40.2, కాళ్లలో 39.8,భీమవరంలో 26.5, పాలకోడేరులో 24.4, వీరవాసరంలో 26.2, పెనుమంట్రలో 19.6,పెనుగొండలో 31.3, ఆచంటలో 42.4, పోడూరులో 35.4, పాలకొల్లులో 24.7,యలమంచిలిలో 24.6,నర్సాపురంలో 14.1, మొగల్తూరులో 17.1, కుకునూరులో 53.2, వేలేరుపాడు మండలంలో 56.9 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది. -
వరుణుడి ఉగ్రరూపం
జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరదలు జనజీవనం అస్తవ్యస్తం స్తంభించిన వాహన సంచారం పాఠశాలలు, కాలేజీలకు సెలవు శివమొగ్గ : జిల్లాలో వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. కుండపోతతో జిల్లా అతలాకుతలమైంది. ఎగతెరపిలేని వానలతో చెరువులు, వంకలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. అనేక ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతుండటంతో అపారనష్టం జరుగుతోంది. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. వానలతో ముందు జాగ్రత్తగా జిల్లాలోని అన్ని తాలూకాల్లోని పాఠశాలలు, కాలేజీలకు శుక్రవారం సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ విపుల్‌బన్సల్ ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రవాహ ప్రాంతాలతో పాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. తుంగానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. తీర్థహళ్లి తాలూకా మండగద్దె గ్రామంలోని పక్షిదామ కేంద్రం నదిలో మునిగిపోయింది. మండగద్దె గ్రామం పక్కన వెళ్లే జాతీయ రహదారి శివమొగ్గ-మంగళూరు 13 రహదారిపై మూడు అడుగుల మేర తుంగానది నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. హొసనగర తాలూకాలో వర్షం భారీగా కురుస్తుండగంతో అపార పంటనష్టం ఏర్పడింది. తాలూకాలోని కల్లూరు బీదరళ్లి వంతెన మునిగిపోయింది. దీంతో ఆ ప్రాంత వాసులకు బాహ్యప్రపంచంతో సంబందాలు తెగిపోయాయి. అంతేగాక హెద్దారిపు, అమృత గ్రామపంచాయతీ పరిధిలోని తీవ్రస్థాయిలో పంట నష్టం జరిగింది. ఈ ప్రాంతాలను జిల్లా పంచాయతీ అధ్యక్షుడు కలగోడు రత్నాకర్, జెడ్పీ సీఈఓ శ్రీకాంత్సెందిల్ శుక్రవారం పరిశీలించారు. సాగర తాలూకా తాళగుప్ప మండలం బీసనగద్దె గ్రామం పూర్తిగా జలమయమై ద్వీపంలా మారింది. ఆ గ్రామ ప్రజలు సంచరించడానికి తాలూకా యంత్రాంగం తెప్పలను ఏర్పాటు చేసింది. వరదానది వరదల కారణంగా తాళగుప్ప, మండలం, కణస, తడగళలె, మండగళలెచ తట్టికుప్ప గ్రామాల వ్యవసాయ భూములు పూర్తిగా జలమయం అయ్యాయి. ఉద్రిగ్రామంలో ఓ చెరువు తెగిపోయింది. శివమొగ్గ, భద్రావతి నగరాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. గాజనూరు జలాశయం నుంచి అధిక స్థాయిలో నీటిని విడుదల చేస్తుండటంతో శివమొగ్గ నగరం ఆనుకుని ప్రవహిస్తున్న తుంగానది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. లింగమనక్కి జలాశయంలోకి భారీ నీరు.. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానలతో ప్రముఖ జలాశయాల్లో ఇన్‌ప్లో పెరిగింది. లింగమన క్కి జలాశయంలోకి ఇన్‌ఫ్లో 85,526 క్యూసెక్కులుగా ఉంది. గరిష్ట నీటిమట్టం 1819 అడుగులు కాగా, ప్రస్తుతం 1797.35 అడుగుల మేరా నీరుంది. ఒకే రోజులో జలాశయంలోకి సుమారు మూడన్నర అడుగుల మేర నీరు చేరింది. భద్రా జలాశయంలోకి 35,670 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 1561 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.జలాశయ గరిష్ట నీటిమట్టం 186 అడుగులు కాగా, ప్రస్తుతం 177.30 అడుగుల మేర నీరుంది. తుంగా జలాశయంలోకి 72,856 క్యూసెక్కుల నీరు వస్తుండగా, అంతేస్థాయి నీటిని దిగువన ఉన్న హొస్పేట తుంగభద్రా డ్యాంకు వదిలేస్తున్నారు. మాణి జలాశయం గరిష్ట నీటిమట్టం 594.36 అడుగులు కాగా ప్రస్తుతం 584.04 అడుగుల మేర నీరుంది. ఇన్‌ఫ్లో 14,445 క్యూసెక్కులుగా ఉంది. -
ఫైలిన్ కలవరం.. అధికారులు అప్రమత్తం
పడగెత్తిన పెను తుపాను సాగర కెరటాల మాటు నుంచి భీకరంగా బుస కొడుతూ ఉండడంతో జిల్లా గజగజ వణుకుతోంది. మేఘాల మార్గంలో దూసుకు వస్తున్న ఝంఝామారుతాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక విలవిలలాడుతోంది. ముంచుకొచ్చే ముప్పుకు ముందస్తు సంకేతంగా గురువారం అక్కడక్కడా కురిసిన కుండపోత వర్షాలతో అస్తవ్యస్త పరిస్థితి నెలకొంది. ‘అల’జడి పొంచి ఉందని అధికారులు జారీ చేస్తున్న హెచ్చరికలతో తీరప్రాంత గ్రామాల్లో ఆందోళన ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. అల్లకల్లోలంగా ఉన్న కడలికి మత్స్యకారులు దూరంగా ఉండాలన్న ప్రకటనలతో గంగపుత్రుల్లో గుబులు పెరుగుతోంది. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి కలెక్టర్ నేతృత్వంలో అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. మరోవైపున వివిధ నదులు పొంగిపొర్లుతూ ఉండడంతో పంటలను ముంపు భయం వెంటాడుతోంది. యలమంచిలి, న్యూస్‌లైన్ : బంగాళాఖాతంలో ఏర్పడ్డ పెను తుఫాన్ జిల్లా తీర ప్రాంతాల్లో కలవరం సృష్టిస్తోంది. ఫైలిన్ విరుచుకు పడనుందన్న హెచ్చరికలతో నలుదిశలా అలజడి నెలకొంది. ముఖ్యంగా తుఫాన్ కారణంగా మత్స్యకారులకు, తీర ప్రాంత గ్రామాలకు ముప్పు ఎదురు కానుందని హెచ్చరికలు వెలువడ్డ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పెను తుఫాన్ ప్రభావం విశాఖపై అధికంగా ఉండవచ్చన్న ఆందోళనతో పాలనా వ్యవస్థ విపత్తును ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధమైంది. బుధవారం సాయంత్రం తుఫాన్ హెచ్చరికలు జారీకావడంతో మత్స్యకార గ్రామాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తెల్లవారుజామునే చేపలవేటకు వెళ్లిన మత్స్యకారుల పరిస్థితిపై కలవరం నెలకొంది. సముద్రంలో అలల ఉధృతి క్రమేణా పెరుగుతోంది. తీరంలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాలతో ఆందోళన నెలకొంది. తుఫాన్ హెచ్చరికలతో గురువారం చేపలవేట నిలిచి పోయింది. ఒడ్డున ఉన్న తెప్పలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వలలు, ఇం జన్లను గ్రామాలకు తరలించారు. తీర గ్రామాల్లో తహశీల్దార్లను జిల్లా కలెక్టర్ ఆరోఖ్యరాజ్ అప్రమత్తం చేశారు. వీఆర్వోలు ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉండాల నితహశీల్దార్లు ఆదేశించారు. అచ్యుతాపు రం మండలం, పూడిమడక గ్రామ మత్స్యకారులు ఫైలిన్ తుఫాన్ హెచ్చరికలతో ఆందోళనకు గురవుతున్నారు. సముద్రపు నీరు ఇళ్ల ను ముంచెత్తవచ్చని భయపడుతున్నారు. శు క్రవారం ఉదయానికి ఫైలిన్ తుఫాన్ తీవ్రత పెరగవచ్చన్న హెచ్చరికలతో తీరంలో తా టాకు పాకల్లో నివసిస్తున్న మత్స్యకారులను తరలించడానికి సమాయత్తమవుతున్నారు. అప్రమత్తత అవసరం ఎస్.రాయవరం : విపత్తుల సమయంలో తీర ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని చింతపల్లి డిఎస్పీ రమేశ్ చెప్పారు. గురువారం సముద్ర తీర ప్రాంతాలయిన బంగారమ్మపాలెం ,రేవుపోలవరం గ్రామాల్లో పర్యటించి అప్రమత్తంగా ఉండాలని మత్యకారులకు చెప్పారు. వరాహ నదీ పరివాహక ప్రాంతాల వారు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. డీఎప్పీ వెంట ఎస్ఐ కె అప్పలనాయుడు, సిబ్బంది ఉన్నారు. ఎగసిపడుతున్న కెరటాలు రాంబిల్లి : ఫైలిన్ తుపాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. గురువారం వాడపాలెం, కొత్తపట్నం, వాడనర్సాపురం తీరాల్లో సముద్రపు అలల ఉధృతి పెరిగింది. మరోపక్క మేజర్, మైనర్ శారద నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. నారాయణపురం వద్ద మైనర్ శారద వంతెనను తాకుతూ ప్రవహిస్తోంది. దీంతో గట్లకు గండ్లు పడే ప్రమాదం వుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.