బంగళాఖాతంలో అల్పపీడనం కారణంగా జిల్లావ్యాప్తంగా వర్షాలు పడుతున్నారుు. శుక్రవారం పలు చోట్ల ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురిసింది. భారీ వర్షాలకు రహదారులు జలమయమయ్యూరుు. ప్రయూణికులు ఇబ్బందులు పడ్డారు. వర్షాల రాకపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు .
- భీమవరం అర్బన్/తాడేపల్లిగూడెం
పొంగుతున్న వాగులు
పోలవరం రూరల్ : పోలవరం మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పాపికొండల సమీపంలో కొండలపై కురుస్తున్న వర్షాలకు శుక్రవారం కొండవాగులు పొంగి ప్రవహించాయి. గుంజవరం గ్రామ సమీపంలో కొండకాలువ ఉధృతంగా ప్రవహించడంతో క్రమేపీ చెరువులో నీరు చేరుతుంది. మండలంలో అతిపెద్ద చెరువైన కొత్తూరు చెరువుకు రామన్నపాలెం సమీపంలోని కాలువ ద్వారా నీరు చేరుతోంది. చెరువుల్లోకి నీరు చేరుతుండటంతో రైతులు ఆకుమడి వేసేందుకు సిద్ధమవుతున్నారు.
వాయుగుండంగా మారిన అల్పపీడనం
ఏలూరు : జిల్లాలో ఎడతెరిపినివ్వకుండా వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఉదయం 11 గంటల నుంచి జిల్లావ్యాప్తంగా చిరుజల్లులతో వర్షం ప్రారంభమై మధ్యలో విరామం ఇస్తూ రాత్రి వ రకు చెదురుమదురుగా వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. మెట్టప్రాంతం అయిన పోలవరం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెంలో గురువారం నుంచి వరుణుడి కరుణ మొదలైంది. దీంతో ఇక్కడ కూడా రైతులు పొలాలు దుక్కిదున్నుతూ కనిపించారు.
నైరుతీ రుతుపవనాలు పుంజుకున్న నేపథ్యంలో అల్పపీడనం వాయుగుండంగా మారటంతో శనివారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తొలకరి జల్లులు ఊపందుకోవడంతో రైతుల పొలాలు దుక్కిదున్నటం ముమ్మరం చేస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే జిల్లాలో 28.5 మిల్లీమీటర్లు సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వేలేరుపాడులో 56.9 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. సాధారణ వ ర్షపాతం 75.8 మిల్లీమీటర్లు వర్షం కురవాల్సి ఉండగా ఇప్పటివరకు 165.8 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. మొత్తం మీద 118.7 మిల్లీమీటర్లు అధికంగా కురిసింది. వ్యవసాయ పరంగా ఈ వర్షం ఎంతో మేలు చేకూరుతుందని అధికారులు చెబుతున్నారు.
మండలాల వారీగా వర్షపాతం ఇలా..
జీలుగుమిల్లిలో 24.6, బుట్టాయగూడెంలో 61.2, పోలవరంలో 31.3, తాళ్లపూడిలో 43.8, గోపాలపురంలో 33.5, కొయ్యలగూడెంలో 40.4,జంగారెడ్డిగూడెంలో 41.8, టి నర్సాపురంలో 18.2, చింతలపూడిలో 16.9, లింగపాలెంలో 14.8, కామవరపుకోటలో 27.7, ద్వారకాతిరుమలలో 21.5, నల్లజర్లలో 14.7,దేవరపల్లిలో 9.5, చాగల్లు 37.1, కొవ్వూరులో 35.9,నిడదవోలులో 17.0, తాడేపల్లిగూడెంలో 21.9, ఉంగుటూరులో 19.1, భీమడోలులో 24.2, పెదవేగిలో 7.7, పెదపాడులో 16.6, ఏలూరులో 12.6, దెందులూరులో 23.7, నిడమర్రులో 26.8, గణపవరంలో 19.3, పెంటపాడులో 35.7, తణుకులో 28.7,ఉండ్రాజవరంలో 34.9, పెరవలిలో 33.0, ఇరగవరంలో 34.2, అత్తిలిలో 36.4, ఉండిలో 25.4, ఆకివీడులో 40.2, కాళ్లలో 39.8,భీమవరంలో 26.5, పాలకోడేరులో 24.4, వీరవాసరంలో 26.2, పెనుమంట్రలో 19.6,పెనుగొండలో 31.3, ఆచంటలో 42.4, పోడూరులో 35.4, పాలకొల్లులో 24.7,యలమంచిలిలో 24.6,నర్సాపురంలో 14.1, మొగల్తూరులో 17.1, కుకునూరులో 53.2, వేలేరుపాడు మండలంలో 56.9 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది.
కుండపోత
Published Sat, Jun 20 2015 1:56 AM | Last Updated on Sun, Sep 3 2017 4:01 AM
Advertisement
Advertisement