More Than 40 Killed In Earthquake Near Indonesia Java Island, Details Inside - Sakshi
Sakshi News home page

Indonesia Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. 56 మంది మృతి

Published Mon, Nov 21 2022 2:53 PM | Last Updated on Tue, Nov 22 2022 7:54 AM

At Least 44 Dead As Earthquake Hits Indonesia West Java - Sakshi

జకార్తా: ఇండోనేషియాలోని పశ్చిమ జావా ద్వీపంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. ససియాంజూర్ ప్రాంతంలో 49 సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంపం దాటికి 56 మంది మృతి చెందగా,  వందల సంఖ్యలో గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.9 నుంచి 5.6 మధ్య నమోదైంది. భూకంపం కారణంగా వేలాది ఇళ్లు నేలకొరిగాయి. భవనాలు కుంగిపోగా, ఓ పాఠశాల ధ్వంసమైంది. భయంతో జనాలు రోడ్లపైకి పరుగులు తీశారు. అప్రమత్తమైన అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. భవనాల శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement