West Java
-
ఇండోనేషియాలో భారీ భూకంపం.. 56 మంది మృతి
జకార్తా: ఇండోనేషియాలోని పశ్చిమ జావా ద్వీపంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. ససియాంజూర్ ప్రాంతంలో 49 సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంపం దాటికి 56 మంది మృతి చెందగా, వందల సంఖ్యలో గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.9 నుంచి 5.6 మధ్య నమోదైంది. భూకంపం కారణంగా వేలాది ఇళ్లు నేలకొరిగాయి. భవనాలు కుంగిపోగా, ఓ పాఠశాల ధ్వంసమైంది. భయంతో జనాలు రోడ్లపైకి పరుగులు తీశారు. అప్రమత్తమైన అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. భవనాల శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. -
భారీ వరదలు : 35 వేలమంది తరలింపు
జకార్తా: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఇండోనేసియాలోని పశ్చిమ జావా, ఏచ్ ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో దాదాపు 35 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆ దేశ జాతీయ విపత్తు నివారణ సంస్థ ఉన్నతాధికారి వెల్లడించారు. వేలాది ఇళ్లు వరద నీటిలో చిక్కుకుపోయాయని తెలిపారు. నిరాశ్రయులకు ఆహారం పదార్థాలు, తాగు నీరు అందజేస్తున్నట్లు చెప్పారు. పోలీసులు, సైనికులతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ నెల 12న జావాలో మట్టి పెళ్ల విరిగిపడి 95 మంది మరణించారు. మరో 13 మంది జాడ తెలియరాలేదు. ఇండోనేసియాలో కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయి. దాంతో వరద పోటెత్తుతుంది అలాగే కొండ ప్రాంతంలో నివసించే జనావాసాలపై భారీగా కొండ చరియలు విరిగిపడుతున్న సంగతి తెలిసిందే.