
వీడియో దృశ్యాలు
మామూలుగా అయితే ఎవరైనా దాన్ని చూడగానే భయపడతారు. కానీ, అతడు మాత్రం...
వాషింగ్టన్ : షార్క్‌లు ఎంత ప్రమాదకరమైన జీవులో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటిని దూరం నుంచి చూస్తేనే చాలు కొంతమందికి జడుసుకుని జ్వరం వచ్చేస్తుంది. అలాంటిది ఓ వ్యక్తి షార్కుతో గేమ్స్ ఆడుకున్నాడు. ఈ సంఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. అమెరికా, డెలావేర్‌కు చెందిన ఓ వ్యక్తి కొద్దిరోజుల క్రితం అక్కడి కేప్ హెన్‌లోపెన్ స్టేట్ పార్క్ బీచ్‌కు వెళ్లాడు. సముద్రంలో ఈత కొడుతుండగా అతడికి ఓ షార్క్ కనిపించింది. మామూలుగా అయితే ఎవరైనా దాన్ని చూడగానే భయపడతారు. కానీ, అతడు మాత్రం దాని తోకపట్టుకుని లాగి కొద్దిగా పైకి ఎత్తాడు. (అబ్రకదబ్ర.. సెలబ్రిటీ అయిపోయింది!)
అనంతరం కొన్ని క్షణాల పాటు దాని నోరు తెరిచిపట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాచెల్ ఫాస్టర్ అనే యువతి తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘‘ అతడో మహాబలుడు... షార్క్‌తో గేమ్స్ వద్దు శాల్తీలు లేచిపోతాయి... నీకు పిచ్చా! షార్క్‌తో పెట్టుకుంటావా?’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( షికారుకని వచ్చి షార్క్‌కు చిక్కాడు)