హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ను గుర్తుపట్టిన సాక్షి!
హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ను గుర్తుపట్టిన సాక్షి!
Published Mon, May 19 2014 6:06 PM | Last Updated on Sat, Sep 2 2017 7:34 AM
ముంబై: 12 ఏళ్ల క్రితం నాటి 'హిట్ అండ్ రన్' కేసులో ఆరోపణలెదుర్కొంటున్న సల్మాన్ ఖాన్ ను ఓ ఫైవ్ స్టార్ హోటల్ కు చెందిన బార్ వెయిటర్ కోర్టులో గుర్తించారు. సల్మాన్ ఖాన్ తన స్నేహితులతో కలిసి వచ్చి మద్యం సేవించారని కోర్టులో మోలే బాగ్ వెయిటర్ తన వాగ్మూలాన్ని ఇచ్చారు.
అయితే తన స్నేహితులతో వచ్చిన సల్మాన్ మద్యం సేవించారా లేదా అనే విషయం తనకు గుర్తు లేదని వెయిటర్ తెలిపారు. బార్ లో మసక చీకటి ఉంది. సల్మాన్ మద్యం సేవించారా అనేది చూడలేదు. కాని ఆయన స్నేహితులందరికి మద్యం సరఫరా చేశాను అని క్రాస్ ఎగ్జామినేషన్ లో బెయిటర్ కోర్టుకు తెలిపారు.
ఈ కేసులో సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ నివాసం వద్ద పనిచేసే లక్ష్మణ్ మోరే అనే సెక్యూరిటీ గార్డు సాక్ష్యాన్ని కోర్టు రికార్డు చేసింది. సల్మాన్, సొహైల్ లిద్దరూ 'రెయిన్ బార్'కు వెళ్లారు. అర్ధరాత్రి మూడు గంటల తర్వాత సొహైల్ తిరిగివచ్చారు. మరో గంటల తర్వాత ఓ వ్యక్తి సల్మాన్ ప్రమాదం జరిగిందని చెప్పారు అని లక్ష్మణ్ మోరే కోర్టుకు వివరించారు.
Advertisement
Advertisement