ఓ పిజ్జా అబ్బాయ్ ప్రేమకథ | pizza Boy love story | Sakshi
Sakshi News home page

ఓ పిజ్జా అబ్బాయ్ ప్రేమకథ

Published Tue, Jan 6 2015 11:53 PM | Last Updated on Sat, Sep 2 2017 7:19 PM

ఓ పిజ్జా అబ్బాయ్ ప్రేమకథ

ఓ పిజ్జా అబ్బాయ్ ప్రేమకథ

 ప్రిన్స్ ఈసారి పిజ్జా డెలివరీ బాయ్‌గా కనిపించనున్నారు. ప్రిన్స్, జ్యోతీ సేథీ జంటగా శ్రీ భ్రమరాంబ క్రియేషన్స్ పతా కంపై ఎల్. వేణుగోపాలరెడ్డి, పి. లక్ష్మీ నరసింహా రెడ్డి ఓ చిత్రం నిర్మిస్తున్నారు. ‘కథ’, ‘ఒక్కడినే’ చిత్రాల దర్శకుడు శ్రీనివాస్ దర్శకత్వంలో  ఈ చిత్రం రూపొందుతోంది. ప్రిన్స్‌కి సరిగ్గా సరిపోయే కథ ఇదని, క్రైమ్ కామెడీ కథాంశంతో ప్రతి సన్నివేశమూ ఆసక్తికరంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు.
 
  నిర్మాతలు మాట్లాడుతూ -‘‘యూత్‌కి, మాస్‌కి నచ్చే కథ ఇది. గత నెలలో చిత్రీకరణ మొదలుపెట్టాం. హైదరాబాద్ పరిసరాల్లో ఏకధాటిగా షూటింగ్ చేస్తున్నాం. ఈ వారంతో టాకీపార్ట్ పూర్తవుతుంది. ఇందులో నాలుగు పాటలుంటాయి’’ అని తెలిపారు. రావు రమేశ్, జయప్రకాశ్‌రెడ్డి, ఆశిష్ విద్యార్థి, సంపూర్ణేశ్‌బాబు, సప్తగిరి తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: కమ్రాన్, కెమెరా: చిట్టిబాబు, సమర్పణ: కృష్ణ బద్రి, శ్రీధర్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: బాలాజీ శ్రీను, అక్కినేని శ్రీను, సహ నిర్మాతలు: హేమా వెంకట్, చిరంజీవి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement