పిజ్జా చేయడం కష్టమేమీ కాదిక!
పిజ్జా... కొన్నేళ్ల క్రితం వరకూ మన పిల్లలకు ఈ పేరు కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఏం తింటావ్ అని అడగ్గానే ముందు చెబుతోంది దీని పేరే. పిజ్జా పేరు చెబితే చాలు... వాళ్లకి ఎక్కడ లేని హుషారూ వచ్చేస్తుంది. చెప్పలేనంత ఆకలీ వేసేస్తుంది. కాబట్టి మన పిల్లల కోసం పిజ్జా చేయడం నేర్చుకోక తప్పదు. అందుకుగాను ఈ పిజ్జా అవెన్‌ని తెచ్చుకోకా తప్పదు.
పిజ్జా బాగుండాలంటే పిండితో చేసే బేస్ సరిగ్గా ఉండాలి. దాని మీద కూరగాయ ముక్కలు వేస్తామా, చికెన్-మటన్ వేస్తామా అన్నది మన ఇష్టం. అయితే ఏది వేసినా బేస్ సరిగ్గా ఉంటేనే పిజ్జా సరిగ్గా వస్తుంది. అది సరిగ్గా రావాలి అంటే అవన్ ఉండి తీరాలి. అందుకే డెనీ కంపెనీవారు ఈ అవెన్‌ని తయారు చేశారు.
కాకపోతే మన మార్కెట్లోకి కొత్తగా వచ్చింది కాబట్టి రేటు ఎక్కువగా ఉంది (రూ. 10,924 - ఈబే సైట్‌లో). అయితే అంతకంటే తక్కువ ధరకే మైక్రో అవన్ వచ్చేస్తోంది. అన్ని రకాలుగానూ ఉపయోగపడుతుంది కూడాను. అలాంటప్పుడు కేవలం పిజ్జాకి మాత్రమే పనికొచ్చే అవన్‌కి అంత పెట్టడానికి ఎవరూ ఇష్టపడకపోవచ్చు. కాబట్టి ముందు ముందు రేటు తగ్గుతుందేమో చూడాలి మరి!