
రికార్డు రేటు పిజ్జా...!
తిక్క లెక్క
ఎంతపెద్ద పిజ్జా అయితే మాత్రం ధర ఎంత ఉంటుందేం..? మన రూపాయల్లో చెప్పుకుంటే కొన్ని వందల్లోనే ఉంటుందనుకుంటున్నారా..? ఈ ఫొటోలోని పిజ్జాను చూడండి. దీని ధర తెలుసుకుంటే గుడ్లు తేలేయడం ఖాయం! దీని ధర కేవలం 178 డాలర్లు (రూ.11,535) మాత్రమే. ఇప్పటి వరకు ఇదే ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన పిజ్జాగా గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కింది.
లండన్‌లోని గార్డన్ రామ్సే జాయింట్ దీనిని తయారు చేస్తోంది. దీని స్పెషాలిటీ ఏమంటారా? ఆనియన్ టాపింగ్‌తో అలంకరించడమే దీని ప్రత్యేకత. బహుశ అందుకేనేమో దీనికి ఇంత ధర పలుకుతోంది.