పిజ్జా చూపిస్త మావా...
తిక్క లెక్క
సాధారణంగా మనకు తెలిసి పిజ్జా ఎలా ఉంటుంది? గుండ్రంగా ఉంటుంది. లాంగ్‌షాట్‌లో చూస్తే పూర్ణచంద్ర బింబంలా ఉంటుంది. అలాగని పిజ్జా ఇదే ఆకారంలో ఉండాలనే నిబంధనేమీ లేదనుకోండి. ఆకారానిది ఏముంది? పదార్థమే ప్రధానం అనుకున్నారు ఇటాలియన్ పాక నిపుణులు. అనుకున్నదే తడవుగా అత్యంత భారీ స్థాయిలో పిజ్జా తయారీకి నడుం బిగించారు. ఏకంగా ఒకటిన్నర కిలోమీటర్లకు పైగా పొడవున పిజ్జాను తయారు చేశారు. శాంటే లుడోవికోలో గత ఏడాది వీరు ప్రదర్శించిన పిజ్జా పొడవు 1595.45 మీటర్లు మాత్రమే. దీని విస్తీర్ణం 15 ఫుట్‌బాల్ మైదానాల కంటే ఎక్కువ. ఇది ఇదివరకటి గిన్నెస్ రికార్డును బద్దలు కొట్టింది.