పిజ్జా పొడవు.. కిలోమీటర్ పైనే | 60 pizza-makers create mile-long pizza in Milan, Italy | Sakshi
Sakshi News home page

పిజ్జా పొడవు.. కిలోమీటర్ పైనే

Published Sun, Jun 21 2015 4:31 AM | Last Updated on Tue, Aug 21 2018 2:34 PM

పిజ్జా పొడవు.. కిలోమీటర్ పైనే - Sakshi

పిజ్జా పొడవు.. కిలోమీటర్ పైనే

గుండ్రంగా, చతురస్రాకారంలో ఉండే పిజ్జాలకు ఈ పిజ్జా పూర్తిగా భిన్నం. దారి పొడవునా సందర్శకులను తెగ ఆకట్టుకున్న దీని పొడవు 1,595.45 మీటర్లు. అంటే దాదాపు మైలు పొడవు. 1.5 టన్నుల చీజ్, 2 టన్నుల టొమాటొ సాస్ సహా మొత్తం ఐదు టన్నుల ముడిసరుకులతో దీన్ని 60 మంది పాకశాస్త్ర ప్రవీణులు తయారుచేశారు. శనివారం ఇటలీలోని మిలాన్ సిటీ సమీపంలో నిర్వహించిన ఓ వేడుకలో దీన్ని ప్రదర్శించారు. ప్రపంచంలోనే అతి పొడవైన పిజ్జాగా గిన్నిస్ రికార్డును సైతం బద్దలుగొట్టడం దీని మరో ప్రత్యేకత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement