
‘పిజ్జా’ను మరపించే విల్లా
తెలుగు, తమిళ భాషల్లో విజయవంతమైన ‘పిజ్జా’ చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రం ‘విల్లా’(పిజ్జా-2). అశోక్ సెల్వన్, సంచిత శెట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి దీపన్.ఆర్ దర్శకుడు. గుడ్ సినిమా గ్రూప్, స్టూడియో సౌత్ సంస్థలు ఈ చిత్రాన్ని నేడు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాయి. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన మారుతి మాట్లాడుతూ -‘‘ ‘పిజ్జా’ చిత్రానికి ఏ మాత్రం తక్కువ కాకుండా ఈ సినిమా ఉంటుంది.
డాల్బీ ఎట్మాస్ సౌండ్ సిస్టమ్‌లో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 14న తమిళనాట విడుదలై మంచి విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పిస్తుందని మా నమ్మకం’’ అన్నారు. ఇంకా ఈ సమావేశంలో నిర్మాతలు శ్రీనివాసమూర్తి, ఎస్‌కెఎన్, శ్రీనివాస్ కూడా మాట్లాడారు.