
పూజా హెగ్డే
స్కూల్ డేస్‌లో పీ ఫర్ పీకాక్ అని చదువుకుంటాం. పెద్దయ్యాక పి ఫర్‌కి మనకు అనిపించిన పదాలు చెబుతాం. ఒక్కోసారి మన పేరు కూడా చెబుతాం. అలాగే పూజా హెగ్డే కూడా అప్పుడప్పుడూ సరదాగా ‘పి’ ఫర్ ‘పూజా’ అంటుంటారు. ఒక్కోసారి వేరే చెబుతారు. ఇప్పుడు మాత్రం ‘పి’ ఫర్ ‘పిజ్జా’ అంటున్నారు. కానీ సిల్వర్ స్క్రీన్‌పై మెరుపు తీగలా కనిపించాలంటే పిజ్జాలు, బర్గర్‌లు లాగిస్తే కుదరదు. అందుకే చాలామంది కథానాయికలు అయిష్టంగానే వాటికి దూరంగా ఉంటారు. పూజా మాత్రం అలా నోరు కట్టేసుకోని కూర్చోలేను అంటున్నారు.
పిజ్జా అంటే ఆమెకు అంత ఇష్టం. పిజ్జా మీద ప్రేమ గురించి పూజా హెగ్డే చెబుతూ– ‘‘ఫిట్‌గా ఉండాలని నచ్చిన ఫుడ్ తినకుండా ఉండటం నా వల్ల కాదు. ముఖ్యంగా పిజ్జా విషయంలో అస్సలు కాదు. నా ఉద్దేశంలో నిజమైన ప్రేమంటే పిజ్జానే. పిజ్జాతో విడదీయలేని ప్రేమ నాది. జిమ్‌లో ఇంకొంచెం సేపు వర్కౌట్ చేస్తాను కానీ పిజ్జాను చూస్తే మాత్రం తినకుండా ఉండలేను’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ భామ ఎన్టీఆర్–త్రివిక్రమ్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. వాటితో పాటు మహేశ్‌బాబు, ప్రభాస్ నెక్ట్స్ సినిమాల్లో కూడా కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment