టీవీ లైవ్‌లో అలా బుక్‌ అయ్యాడు | Pizza Eating Man Photo Bombs Reporter  Viral Video | Sakshi
Sakshi News home page

టీవీ లైవ్‌లో అలా బుక్‌ అయ్యాడు

Published Thu, Feb 28 2019 5:46 PM | Last Updated on Thu, Feb 28 2019 5:53 PM

Pizza Eating Man Photo Bombs Reporter  Viral Video - Sakshi

వివిధ సందర్భాల్లో టీవీ చానెళ్లు, వాటి వ్యవహారంపై దుమారం రేగుతూనే ఉంటుంది. మరికొన్ని బ్లూఫర్స్‌లా నవ్వు పుట్టిస్తాయి కూడా. తాజాగా అలాంటి సంఘటన ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఒకవైపు లైవ్‌ టెలికాస్ట్‌ అవుతుండగా, మరోవైపు ఆత్రంగా పిజ్జా తింటూ అడ్డంగా బుక్కయిపోయాడో ఉద్యోగి. పని ఒత్తిడి, క్షుద్బాధకు ఓర‍్వలేక అలా కక్కుర్తి పడ్డాడో ఏమోగానీ , ఈ వీడియోతో మాత్రం పిజ్జా మ్యాన్‌ లక్షలాది వ్యూస్‌తో ఇంటర్నెట్‌ హీరో అయిపోయాడు. 

తాజా ఘటనలో చానెల్ లైవ్‌లో రిపోర్టర్‌ రిపోర్టింగ్ చేస్తుండ‌గా.. చానెల్‌కు చెందిన మరో ఉద్యోగి పిజ్జా తింటూ  లైవ్‌లో కనిపించాడు. దొంగచాటుగా తింటూ.. సడన్‌గా అలా లైవ్‌ లో ప్రత్యక్షమయ్యే సరికి అతగాడు బిక్క చచ్చిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో  సెన్సేషన్‌గా నిలిచింది.  సీబీఎస్‌ఎన్ చానెల్‌లో ఈ ఫన్నీ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు  హాల్‌వే పిజ్జా గై అనే నిక్‌ నేమ్‌తో ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement