సిటీ వంటయ్యెన్... | Italian dishes is famous as known as Indian dishes | Sakshi
Sakshi News home page

సిటీ వంటయ్యెన్...

Published Mon, Jul 7 2014 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 AM

సిటీ వంటయ్యెన్...

సిటీ వంటయ్యెన్...

మల్టీ క్విజిన్: ఇపుడు నగరంలో ఇటాలియన్ క్విజిన్ అంటే స్వదేశీ రుచిలాగే అయిపోయింది.  మారుసి ఐడొని రెస్టారెంట్‌లో కనీసం 50 రకాల పాస్తాలను సర్వ్ చేస్తున్నాం. సిటీలో మోడ్రన్ పీపుల్ కాస్త తక్కువ స్పైసీగా ఉండే క్వీజన్‌కు ఓటేస్తున్నారు. దీంతో పాస్తాలతో పాటు, పిజ్జాలు, గార్లిక్ బ్రెడ్, క్రీమ్-ముష్రూమ్ అర్బారియో రైస్ కలిపి చేసే రిసొట్టో వంటి వాటికి మంచి ఆదరణ ఉంది. ఇటు వెజ్ అటు నాన్‌వెజ్, డిజర్ట్‌లు కూడా ఇటాలియన్‌వే కావాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు.’
 - విక్రమ్‌సిన్హా , ఒహ్రీస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చెఫ్  
 
 ఇటాలియన్ ఈ భాష ఎంత మధురమో.. ఇటాలియన్ రుచులు కూడా అంతకంటే మధురం. నోరూరించే పిజ్జా.. వంటి వంటకాలు.. ఇటలీ నుంచి దిగుమతైన రుచులే. అక్కడి పిజ్జాలు.. పాస్తాలు.. కేపచినో కాఫీలు అన్నీ మన ఇంటి వంటలుగా ఆదరిస్తున్నాం. శతాబ్దాల చరిత్ర ఉన్న ఇటాలియన్ రుచుల ఘుమఘుమలు ఖండాంతరాలు వ్యాపించాయి. ప్రపంచ దేశాల ఆహార్యాలను అందంగా ఇముడ్చుకునే హైదరాబాద్ ఆయా దేశాల ఆహారాలను అంతే ఆనందంగా స్వాగతించింది. అలా మన మెనులోకి వచ్చి చేరిన పాశ్చాత్య క్విజిన్స్‌లో ఇటాలియన్ టాప్‌లో ఉంది.
 
 కూరగాయలే ‘కీ’లకం...
 ఎక్కువ మోతాదులో టమాటా.. కాస్త పెద్ద వంకాయ, బ్లాక్-గ్రీన్ ఆలివ్స్, క్యాప్సికం ఇవే ఇటలీ క్విజిన్స్‌లో మనకు కనిపిస్తాయి. అందుకే ఇవి మన ఇంటి రుచిని మరిపిస్తున్నాయి. పెప్పర్ సాసెస్, వెల్లుల్లి, పుదీనా, మీట్ (మాంసపు) వెరైటీలు... ఇటాలియన్ క్యుజిన్‌ను రుచులకు కేరాఫ్‌గా మారుస్తున్నాయి. ఇటలీలో స్పైసీగా ఫీలయ్యే రుచులు.. మన హైదరాబాదీల జిహ్వకు సరిపడా టేస్టీగా ఉంటున్నాయి. ఈ వంటకాల తయారీలో ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగిస్తుండడంతో హెల్త్ పరంగా కూడా నో ప్రాబ్లమ్. ఫిష్, పొటాటోస్, రైస్, కార్న్, సాసేజెస్, పోర్క్, విభిన్న రకాల ఛీజ్‌లు.. ఇటాలియన్ వంటకానికి సాటిలేని బలాన్ని చేకూరుస్తున్నాయి. కార్న్(మొక్కజొన్న)తో తయారు చేసే ‘పొలెంటా’ కూడా సిటీలో బాగా ఫేమస్.
 
 పాస్తాలెంతో ప్రీతి...
 ఐస్‌క్రీమ్‌లతో మొదలై ఇటాలియన్ క్విజిన్ హవా పిజ్జాలతో పుంజుకుని కాఫీలతో కొనసాగి, ప్రస్తుతం పాస్తాలతో పరిపుష్టమైంది. ఇటాలియన్ క్విజిన్‌లో పాస్తా అనేది మెయిన్ కోర్స్. గోధుమ పిండి, ఆలివ్ ఆయిల్, గుడ్లు, ఉప్పు మేళవించి తయారు చేసే ఈ పాస్తాలను కాంబినేషన్‌గా సాస్‌తో కలిపి సర్వ్ చేస్తున్నారు. రకరకాల సైజులు, షేపుల్లో పాస్తాలు అందుబాటులోకి వచ్చాయి. ఫ్రెష్ పాస్తాలను రిఫ్రిజిరేటర్‌లో కొన్ని రోజుల పాటు మాత్రమే ఉంచవచ్చు. ఎగ్ కలవకుండా తయారు చేసే డ్రైడ్ పాస్తాలను రెండేళ్ల పాటు కొన్ని అవసరమైన దినుసుల తో కలిపి నిల్వ చేయవచ్చు. రెడీమేడ్ పాస్తాలు, వాటికి జతగా సాస్‌లు, ఛీజ్‌లు కూడా సూపర్‌మార్కెట్లలో లభిస్తున్నాయంటే ఇటాలియన్ డిష్‌లకు ఎంత ఆదరణ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement