Italian dishes
-
గూగుల్‌లో ఇది చూశారా? దాని వాల్యూ ఎంతో తెలుసా?
Google Doodle Celebrating Pizza: ఇవాళ గూగుల్ ఓపెన్ చేశారా? చేస్తే.. డూడుల్‌లో ఉన్న పిజ్జా మార్క్‌ను చూశారా?.. కనీసం క్లిక్ చేసి చూశారా?.. ప్రపంచంలో మోస్ట్ పాపులర్ డిష్ అయిన పిజ్జాకు ఇదేరోజున ఓ అరుదైన గుర్తింపు దక్కింది. 2017 డిసెంబర్లో పిజ్జా సంప్రదాయ తయారీ విధానం Neapolitan "Pizzaiuolo"(నేపుల్స్-ఇటలీ)కు యునెస్కో తరపున అరుదైన గుర్తింపు దక్కింది. అందుకే గూగుల్ డూడుల్ ద్వారా మినీ గేమ్‌ను నిర్వహిస్తోంది. ఈ మినీ పజిల్ గేమ్ ఉద్దేశం ఏంటంటే.. పిజ్జాను కట్ చేయడం. సాధారణంగా పిజ్జాలను వాటిలోని వెరైటీల ఆధారంగా డిఫరెంట్ షేప్స్‌లో కట్ చేసి(కస్టమర్ల సంఖ్యకు తగ్గట్లుగానే).. సర్వ్ చేస్తుంటారు. అయితే ఈ గేమ్ ఆడేవాళ్లు అక్కడ చూపించే పిజ్జా వెరైటీని సరిగ్గా అక్కడ చూపించే నెంబర్స్‌కి.. సరిపోయేలా సరైన విధానంలో చేయాలి. కరెక్ట్‌గా కట్ చేస్తేనే పాయింట్లు(స్టార్స్) దక్కుతాయి. అలా లెవెల్స్‌ను దాటుకుంటూ కాయిన్స్ కలెక్ట్ చేసుకుంటూ వెళ్లాలి. ►పిజ్జా.. ఇటాలియన్ డిష్ అనే ప్రచారం వందల ఏళ్ల నుంచి ఉంది. ఎందుకంటే ఆ డిష్ పుట్టింది ఇటలీలోనే అని నమ్ముతారు కాబట్టి!(ఈజిప్ట్ అనే ప్రచారం కూడా ఉంది). ►నెపోలిటన్ పిజ్జాయ్‌యువొలొ.. అనేది పిజ్జాను సంప్రదాయ పద్దతిలో(నాలుగు దశల్లో) కట్టెలతో కాల్చే ఒవెన్ ద్వారా తయారు చేయడం. ►నేపుల్స్(కాంపానియా రీజియన్ రాజధాని)లో 3 వేలమంది పిజ్జా తయారీదారులు ఉన్నారు. ►పిజ్జాను తయారు చేసే వ్యక్తిని ‘పిజ్జాయ్‌యువొలొ’ అంటారు. ►పిజ్జా పరిశ్రమ ప్రపంచ స్థాయిలో బిలియన్ డాలర్ల బిజినెస్ చేస్తుంటుంది. ►2020 పిజ్జా గ్లోబల్ బిజినెస్‌లో.. వెస్ట్రన్ యూరప్ వాటా అత్యధికంగా ఉంది. ఏకంగా 49.3 బిలియన్ డాలర్ల వ్యాపారం చేసింది. ►ఉత్తర అమెరికా 48.6 బిలియన్ డాలర్లు. ►ఆసియా దేశాల్లో 11.7 బిలియన్ డాలర్లు ►ఆస్ట్రేలియా పరిధిలో అతితక్కువగా 1.9 బిలియన్ డాలర్ల బిజినెస్ చేసింది. ►ప్రతీ ఏడాది ఐదు బిలియన్ల పిజ్జాలు అమ్ముడుపోతుంటాయి (సెకనుకి ఒక్క అమెరికాలోనే 350 పిజ్జాల ఆర్డర్) వెళ్తుంటాయి. ►2019 నుంచి పిజ్జా మార్కెటింగ్ గ్లోబల్ వైడ్‌గా విపరీతంగా జరుగుతోంది. ►2023 నాటికి పిజ్జా బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 233.26 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందనేది ఒక అంచనా. ►సోషల్‌మీడియా అడ్వర్టైజింగ్ కీలక పాత్ర వహించబోతోందని మార్కెటింగ్ నిపుణుల అంచనా. ►నార్వే, స్వీడన్లలో ఫ్రొజెన్, గ్లూటెన్ పిజ్జాలకు ఫుల్ డిమాండ్ ఉంటోంది ఇప్పుడు. ►యూరప్, నార్త్ అమెరికా, ఆసియా-ఫసిఫిక్, లాటిన్ అమెరికా ఖండాల రీజియన్లను పరిశీలిస్తే.. ఇటలీ, యూకే, జర్మనీ, కెనడా, చైనా, భారత్, బ్రెజిల్.. పిజ్జా మార్కెట్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లనున్నాయి. ►భారత్‌లో కరోనా సీజన్లోనూ కిందటి ఏడాది పిజ్జా బిజినెస్ మార్కెట్ వాల్యూ 1.52 బిలియన్ డాలర్లు దాటేసింది. ► యువత, పిల్లలు, మధ్య, ఎగువ తరగతి వర్గాల ప్రజల నుంచి పిజ్జాకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఉత్తర భారతంలో ఆర్డర్లు ఎక్కువగా వస్తుంటాయి. ►మొత్తం భారత్ పిజ్జా మార్కెట్లో డొమినోస్ వాటా 55 శాతంగా ఉంటోంది. పైగా డొమినోస్ 70 శాతం హోం డెలివరీలతోనే ఆదాయం వెనకేసుకుంటోంది. ►ఈ ఏడాది జూన్ 1వ తేదీ నాటికి భారత్‌లో 45 మిలియన్ల మంది పిజ్జా డెలివరీ యాప్‌లను డౌన్లోడ్ చేసుకున్నారు. ►అయితే భారత్‌లో బ్రాండెడ్ పిజ్జా బిజినెస్‌తో పోలిస్తే.. స్ట్రీట్ పిజ్జా మార్కెట్ బిజినెస్ విపరీతంగా నడుస్తోంది. ఆ ఆదాయం లెక్కలోకి తీసుకుంటే బ్రాండెడ్ పిజ్జా మార్కెట్‌కు మూడు రెట్లు ఎక్కువే ఉంటుందనేది నిపుణుల అంచనా. ►ఎదురయ్యే ఛాలెంజ్.. పిజ్జా తయారీలో వాడే ముడిసరుకుల ధరలు ఆకాశాన్ని అంటడం.. ఇండిపెండెంట్ ఆపరేటర్లతో పాటు ఔట్లెట్లు, ఫ్రాంఛైజీలను సమర్థవంతంగా నిర్వహించడంలో ఎదురయ్యే సవాళ్లు. -సాక్షి వెబ్‌స్పెషల్ -
పాస్తా తినే మహిళలకు శుభవార్త
లండన్: ఇటాలియన్ ఫేమస్ వంటకమైన పాస్తా మీరు తింటున్నారా... అయితే పాస్తా ప్రేమికులకు, ముఖ్యంగా మహిళలకు ఇది నిజంగానే శుభవార్త. పాస్తా తింటే ఊబకాయం రాదని శాస్త్రవేత్తలు చెబున్నారు. అంతేకాదు ఊబకాయం మన దరిచేరకుండా చేస్తుందని వెల్లడించారు. ఇటలీ సంస్థ ఐఆర్సీసీఎస్ న్యూరోమెడ్ శాస్త్రవేత్తలు సుమారు 23 వేల మందిపై పరిశోధనలు చేసి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పాస్తాను నిత్యం ఆహారంగా తీసుకునే వారు బరువు పెరగలేదని, వారిలో ఊబకాయ సమస్య కూడా తలెత్తలేదని శాస్త్రవేత్తల్లో ఒకరైనా జార్జ్ పునిస్ తెలిపారు. పాస్తా తినేవారు ఆరోగ్యంగాను, సన్నని నడుముతోనూ ఉన్నారని పునిస్ పేర్కొన్నారు. బరువు పెరిగె అవకాశాలు ఉంటాయని అపోహపడి చాలా మంది మహిళలు పాస్తా అంటే ఎంతో ఇష్టం ఉన్నా, చాలా సందర్భాలలో నోరు కట్టేసుకుని ఉండాల్సి వస్తోంది. పాస్తా తింటే బరువు పెరుగుతామని చాలా మంది అపోహ పడతారని, అందులో నిజం లేదని ఐఆర్సీసీఎస్ పరిశోధకులు అంటున్నారు. ఈ అధ్యయనంలో తేలిన విషయాలను ఇటీవల విడుదలైన న్యూట్రీషియన్, డయాబెటిస్ జర్నల్‌లో ఈ వివరాలను ప్రచురించారు. -
సిటీ వంటయ్యెన్...
మల్టీ క్విజిన్: ఇపుడు నగరంలో ఇటాలియన్ క్విజిన్ అంటే స్వదేశీ రుచిలాగే అయిపోయింది. మారుసి ఐడొని రెస్టారెంట్లో కనీసం 50 రకాల పాస్తాలను సర్వ్ చేస్తున్నాం. సిటీలో మోడ్రన్ పీపుల్ కాస్త తక్కువ స్పైసీగా ఉండే క్వీజన్కు ఓటేస్తున్నారు. దీంతో పాస్తాలతో పాటు, పిజ్జాలు, గార్లిక్ బ్రెడ్, క్రీమ్-ముష్రూమ్ అర్బారియో రైస్ కలిపి చేసే రిసొట్టో వంటి వాటికి మంచి ఆదరణ ఉంది. ఇటు వెజ్ అటు నాన్‌వెజ్, డిజర్ట్లు కూడా ఇటాలియన్వే కావాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు.’ - విక్రమ్సిన్హా , ఒహ్రీస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ ఇటాలియన్ ఈ భాష ఎంత మధురమో.. ఇటాలియన్ రుచులు కూడా అంతకంటే మధురం. నోరూరించే పిజ్జా.. వంటి వంటకాలు.. ఇటలీ నుంచి దిగుమతైన రుచులే. అక్కడి పిజ్జాలు.. పాస్తాలు.. కేపచినో కాఫీలు అన్నీ మన ఇంటి వంటలుగా ఆదరిస్తున్నాం. శతాబ్దాల చరిత్ర ఉన్న ఇటాలియన్ రుచుల ఘుమఘుమలు ఖండాంతరాలు వ్యాపించాయి. ప్రపంచ దేశాల ఆహార్యాలను అందంగా ఇముడ్చుకునే హైదరాబాద్ ఆయా దేశాల ఆహారాలను అంతే ఆనందంగా స్వాగతించింది. అలా మన మెనులోకి వచ్చి చేరిన పాశ్చాత్య క్విజిన్స్లో ఇటాలియన్ టాప్‌లో ఉంది. కూరగాయలే ‘కీ’లకం... ఎక్కువ మోతాదులో టమాటా.. కాస్త పెద్ద వంకాయ, బ్లాక్-గ్రీన్ ఆలివ్స్, క్యాప్సికం ఇవే ఇటలీ క్విజిన్స్లో మనకు కనిపిస్తాయి. అందుకే ఇవి మన ఇంటి రుచిని మరిపిస్తున్నాయి. పెప్పర్ సాసెస్, వెల్లుల్లి, పుదీనా, మీట్ (మాంసపు) వెరైటీలు... ఇటాలియన్ క్యుజిన్‌ను రుచులకు కేరాఫ్‌గా మారుస్తున్నాయి. ఇటలీలో స్పైసీగా ఫీలయ్యే రుచులు.. మన హైదరాబాదీల జిహ్వకు సరిపడా టేస్టీగా ఉంటున్నాయి. ఈ వంటకాల తయారీలో ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగిస్తుండడంతో హెల్త్ పరంగా కూడా నో ప్రాబ్లమ్. ఫిష్, పొటాటోస్, రైస్, కార్న్, సాసేజెస్, పోర్క్, విభిన్న రకాల ఛీజ్‌లు.. ఇటాలియన్ వంటకానికి సాటిలేని బలాన్ని చేకూరుస్తున్నాయి. కార్న్(మొక్కజొన్న)తో తయారు చేసే ‘పొలెంటా’ కూడా సిటీలో బాగా ఫేమస్. పాస్తాలెంతో ప్రీతి... ఐస్‌క్రీమ్‌లతో మొదలై ఇటాలియన్ క్విజిన్ హవా పిజ్జాలతో పుంజుకుని కాఫీలతో కొనసాగి, ప్రస్తుతం పాస్తాలతో పరిపుష్టమైంది. ఇటాలియన్ క్విజిన్లో పాస్తా అనేది మెయిన్ కోర్స్. గోధుమ పిండి, ఆలివ్ ఆయిల్, గుడ్లు, ఉప్పు మేళవించి తయారు చేసే ఈ పాస్తాలను కాంబినేషన్‌గా సాస్‌తో కలిపి సర్వ్ చేస్తున్నారు. రకరకాల సైజులు, షేపుల్లో పాస్తాలు అందుబాటులోకి వచ్చాయి. ఫ్రెష్ పాస్తాలను రిఫ్రిజిరేటర్లో కొన్ని రోజుల పాటు మాత్రమే ఉంచవచ్చు. ఎగ్ కలవకుండా తయారు చేసే డ్రైడ్ పాస్తాలను రెండేళ్ల పాటు కొన్ని అవసరమైన దినుసుల తో కలిపి నిల్వ చేయవచ్చు. రెడీమేడ్ పాస్తాలు, వాటికి జతగా సాస్‌లు, ఛీజ్‌లు కూడా సూపర్మార్కెట్లలో లభిస్తున్నాయంటే ఇటాలియన్ డిష్‌లకు ఎంత ఆదరణ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.