italian cuisine
-
ఎగతాళి నుంచి సంతాలి రుచుల దాకా...
మధుస్మిత సోరెన్ ముర్ము ఓ ట్రెండ్‌సెట్టర్. సంతాలి ఆదివాసీ వంటకాలను, ఇటాలియన్ వంటకాల శైలితో మేళవించి కొత్త రుచులను ఆవిష్కరిస్తోంది. సంతాలి సంప్రదాయ వంటల గురించి బ్లాగ్‌లో రాస్తోంది. కొద్దిరోజుల్లోనే ఓ సెలబ్రిటీ హోదాను సొంతం చేసుకుంది మధుస్మిత. బాల్యంలో ఎదురైన చిన్న చూపు నుంచి ఎదిగిన విజయ కిరణం ఆమె. ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లా, రాయ్‌రంగపూర్ అమ్మాయి మధుస్మిత.పోటీలో విజయంఆదివాసీల ఆహారపు అలవాట్లు నాగరక సమాజానికి భిన్నంగా ఉంటాయి. అడవుల్లో దొరికే చీమలు, నత్తలు, ఇతర కీటకాల వంటలు వారి ఆహారంలో ప్రధానంగా ఉంటాయి. లంచ్ బాక్సులో ఆమె ఆహారాన్ని చూసిన ఇతర విద్యార్థులు ఆమెను తక్కువగా చూసేవారు. అప్పటినుంచి ఆమెలో తమ ఆహారపు అలవాట్లను నాగరకులు ఎందుకు తక్కువగా చూస్తారు... అనే సందేహం కలిగింది. ఆమెతోపాటే ఆమె సందేహం కూడా పెద్దదైంది. ‘ఒడిశా హోమ్‌ఫుడ్ షెఫ్’ పోటీల్లో గెలవడం మధుస్మితలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. తమ సంప్రదాయ వంటకాలను ఇతర ప్రాంతాల వంటకాల శైలితో మేళవించి వండడం అనే ప్రయోగం కూడా విజయవంతమైంది. బీటెక్ చదివేనాటికి ఆమెకు ఒక పరిష్కారం దొరికింది. ఆ పరిష్కారం విజయవంతం అవుతుందా లేదా అనే ప్రశ్నకు కోవిడ్ లాక్డౌన్ చక్కటి సమాధానాన్ని చెప్పింది. లాక్డౌన్ సమయంలో వంటల మీద పరిశోధనలు మొదలుపెట్టింది. లాక్డౌన్ తర్వాత సంతాలి వంటలు ఎన్ని రకాలున్నాయో తెలుసుకోవడానికి ఆ గ్రామాల్లో పర్యటించింది. ఎలా వండుతున్నారో తెలుసుకుంది. తెలుసుకున్న విషయాలను బ్లాగ్‌లో రాయడం మొదలుపెట్టింది.ఇప్పుడామె చెఫ్‌లకు శిక్షణనిస్తోంది. ప్రముఖ రెస్టారెంట్లలో సంతాలి తెగ వంటకాలు ప్రముఖ స్థానంలో కనిపిస్తున్నాయి. 2022లో మాస్టర్ షెఫ్ పోటీల్లో పాల్గొంది. ఆమె చేసిన రెండు వంటలు న్యాయనిర్ణేతల జిహ్వను మైమరిపించాయి. ఇటాలియన్ వంటకం పోలెంతాని మధుస్మిత స్థానిక పద్ధతిలో ఎర్రబియ్యంతో చేసింది. వేయించిన చికెన్‌కు తోడుగా ఎర్ర చీమల చట్నీ వడ్డించింది. అలాగే పాల్వా చట్నీతో పాట్లపీత వంటకం కూడా. ఎండిన చింతాకు ΄పొడితో చేసిన వంటకాలను నగరవాసులు లొట్టలేసుకుని తింటున్నారు.గవర్నమెంట్ ఉద్యోగం కంటే ఎక్కువ‘‘మా తల్లిదండ్రుల ఆలోచనలు చాలా సంప్రదాయబద్ధమైనవి. నేను బాగా చదువుకుని ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనుకునేవారు. కానీ నేను మాత్రం మా సంతాలి తెగ మీద సమాజంలో నెలకొని ఉన్న తేలిక అభి్రపాయాన్ని తొలగించాలనుకున్నాను. సంతాలి వంటకాలను తెలియచేసే ఫుడ్ బ్లాగర్‌గా ప్రపంచానికి పరిచయమయ్యాను. మా వంటలను పరిచయం చేశాను.ప్రపంచç ³టంలో వంటకాల్లో ఇటలీకున్న స్థానంలో మా సంతాలి వంటకాలను చేర్చగలిగాను. పెద్ద పేరున్న రెస్టారెంట్లు మా వంటకాలకు మెనూ కార్డులో ‘ట్రైబల్ క్విజిన్’ అని ప్రత్యేక కేటగిరీ కల్పిస్తున్నారు. ఇప్పుడు మా సంతాలి వంటకాలు ప్రపంచ ఆహారపట్టికలో ఉన్నాయి. నేను అనుకున్నది సాధించాను’’ అని సంతోషంగా చె΄్తోంది 32 ఏళ్ల మధుస్మిత. బాల్యంలో మనసుకైన గాయంతో తమ సంతాలి తెగకు ప్రపంచస్థాయి గౌరవాన్ని తెచ్చి పెట్టింది మధుస్మిత సోరెన్ ముర్ము. -
సిటీ వంటయ్యెన్...
మల్టీ క్విజిన్: ఇపుడు నగరంలో ఇటాలియన్ క్విజిన్ అంటే స్వదేశీ రుచిలాగే అయిపోయింది. మారుసి ఐడొని రెస్టారెంట్లో కనీసం 50 రకాల పాస్తాలను సర్వ్ చేస్తున్నాం. సిటీలో మోడ్రన్ పీపుల్ కాస్త తక్కువ స్పైసీగా ఉండే క్వీజన్కు ఓటేస్తున్నారు. దీంతో పాస్తాలతో పాటు, పిజ్జాలు, గార్లిక్ బ్రెడ్, క్రీమ్-ముష్రూమ్ అర్బారియో రైస్ కలిపి చేసే రిసొట్టో వంటి వాటికి మంచి ఆదరణ ఉంది. ఇటు వెజ్ అటు నాన్‌వెజ్, డిజర్ట్లు కూడా ఇటాలియన్వే కావాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు.’ - విక్రమ్సిన్హా , ఒహ్రీస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ ఇటాలియన్ ఈ భాష ఎంత మధురమో.. ఇటాలియన్ రుచులు కూడా అంతకంటే మధురం. నోరూరించే పిజ్జా.. వంటి వంటకాలు.. ఇటలీ నుంచి దిగుమతైన రుచులే. అక్కడి పిజ్జాలు.. పాస్తాలు.. కేపచినో కాఫీలు అన్నీ మన ఇంటి వంటలుగా ఆదరిస్తున్నాం. శతాబ్దాల చరిత్ర ఉన్న ఇటాలియన్ రుచుల ఘుమఘుమలు ఖండాంతరాలు వ్యాపించాయి. ప్రపంచ దేశాల ఆహార్యాలను అందంగా ఇముడ్చుకునే హైదరాబాద్ ఆయా దేశాల ఆహారాలను అంతే ఆనందంగా స్వాగతించింది. అలా మన మెనులోకి వచ్చి చేరిన పాశ్చాత్య క్విజిన్స్లో ఇటాలియన్ టాప్‌లో ఉంది. కూరగాయలే ‘కీ’లకం... ఎక్కువ మోతాదులో టమాటా.. కాస్త పెద్ద వంకాయ, బ్లాక్-గ్రీన్ ఆలివ్స్, క్యాప్సికం ఇవే ఇటలీ క్విజిన్స్లో మనకు కనిపిస్తాయి. అందుకే ఇవి మన ఇంటి రుచిని మరిపిస్తున్నాయి. పెప్పర్ సాసెస్, వెల్లుల్లి, పుదీనా, మీట్ (మాంసపు) వెరైటీలు... ఇటాలియన్ క్యుజిన్‌ను రుచులకు కేరాఫ్‌గా మారుస్తున్నాయి. ఇటలీలో స్పైసీగా ఫీలయ్యే రుచులు.. మన హైదరాబాదీల జిహ్వకు సరిపడా టేస్టీగా ఉంటున్నాయి. ఈ వంటకాల తయారీలో ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగిస్తుండడంతో హెల్త్ పరంగా కూడా నో ప్రాబ్లమ్. ఫిష్, పొటాటోస్, రైస్, కార్న్, సాసేజెస్, పోర్క్, విభిన్న రకాల ఛీజ్‌లు.. ఇటాలియన్ వంటకానికి సాటిలేని బలాన్ని చేకూరుస్తున్నాయి. కార్న్(మొక్కజొన్న)తో తయారు చేసే ‘పొలెంటా’ కూడా సిటీలో బాగా ఫేమస్. పాస్తాలెంతో ప్రీతి... ఐస్‌క్రీమ్‌లతో మొదలై ఇటాలియన్ క్విజిన్ హవా పిజ్జాలతో పుంజుకుని కాఫీలతో కొనసాగి, ప్రస్తుతం పాస్తాలతో పరిపుష్టమైంది. ఇటాలియన్ క్విజిన్లో పాస్తా అనేది మెయిన్ కోర్స్. గోధుమ పిండి, ఆలివ్ ఆయిల్, గుడ్లు, ఉప్పు మేళవించి తయారు చేసే ఈ పాస్తాలను కాంబినేషన్‌గా సాస్‌తో కలిపి సర్వ్ చేస్తున్నారు. రకరకాల సైజులు, షేపుల్లో పాస్తాలు అందుబాటులోకి వచ్చాయి. ఫ్రెష్ పాస్తాలను రిఫ్రిజిరేటర్లో కొన్ని రోజుల పాటు మాత్రమే ఉంచవచ్చు. ఎగ్ కలవకుండా తయారు చేసే డ్రైడ్ పాస్తాలను రెండేళ్ల పాటు కొన్ని అవసరమైన దినుసుల తో కలిపి నిల్వ చేయవచ్చు. రెడీమేడ్ పాస్తాలు, వాటికి జతగా సాస్‌లు, ఛీజ్‌లు కూడా సూపర్మార్కెట్లలో లభిస్తున్నాయంటే ఇటాలియన్ డిష్‌లకు ఎంత ఆదరణ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.