Pizza History Facts, పిజ్జా వెనుక పెద్ద చరిత్ర తెలుసా? | History Of Pizza In Telugu - Sakshi
Sakshi News home page

పిజ్జా వెనుకున్న పెద్ద చరిత్ర తెలుసా?

Published Thu, Feb 11 2021 2:42 PM | Last Updated on Thu, Feb 11 2021 7:15 PM

 Do you theDelicious story of The PIZZA - Sakshi

న్యూఢిల్లీ: పిజ్జా.. ఈ పేరు వింటేనే తిండి ప్రియులకు నోరూరుతుంది. క్యాప్సికమ్, టమోటా, ఉల్లిపాయ ముక్కలు, చీజ్‌తో టాపింగ్‌ చేసే ఇటాలియన్‌ వంటకం పిజ్జాను ఇష్టపడని వాళ్లు ఎవరు ఉంటారు. ఆన్‌లైన్‌ ఫుడ్‌ యాప్‌లు వచి్చన తర్వాత చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఘుమఘుమలాడే పిజ్జా నేరుగా ఇంటికే వచ్చేస్తోంది. నోరూరుంచే ఈ పిజ్జా వెనుక పెద్ద చరిత్రే ఉంది. విశ్వవ్యాప్తమైన పిజ్జాకు కూడా ఓ రోజుంది తెలుసా... ఫిబ్రవరి 9  ప్రపంచ పిజ్జా దినోత్సవం. ఈ సందర్భంగా ఆ విశేషాలు ఓసారి చూద్దాం. 

  • పదో శతాబ్దానికి చెందిన ఓ లాటిన్‌ కథలో పిజ్జా ప్రస్తావన ఉంది. ఈ కథ దక్షిణ ఇటలీ ప్రాంతంలోని గాయిటా పట్టణానికి సంబంధించినది. 
  • అయితే రిపోర్టుల ప్రకారం 1500వ సంవత్సరంలో పిజ్జాను కనుగొన్నారు. చవుకగా లభించే ఈ పిజ్జాను నేపుల్స్‌కు చెందిన దిగువ తరగతి ప్రజలు వండుకుని తినేవారు. చీజ్‌కు తోడు టమోటా ముక్కలు పిజ్జా రొట్టెపై టాపింగ్‌ చేసుకుని వారు ఆరగించేవారు.  
  • 18వ శతాబ్దం చివర్లో నేపుల్స్‌లోని పోర్ట్‌ అలబాలో ఓ పిజా షాప్‌ తెరిచినట్లు రికార్డులు చెబుతున్నాయి.  
  • పిజ్జాలు తొలుత చతురస్రాకారంలో ఉండేవట. తర్వాత అవి గుండ్రటి ఆకారంలోకి మారాయి. పిజ్జాను తయారు చేసేవారిని ఇటాలియన్‌లో పిజ్జాయిలో అంటారట. 
  • రెండో ప్రపంచ యుద్ధ కాలం వరకూ అమెరికన్లను పిజ్జా గురించి తెలియదు. ఆ యుద్ధంలో పాల్గొన్న అమెరికా సిపాయిలు పిజ్జా టేస్ట్‌కు ఫిదా అయి.. ఆ వంటకాన్ని అమెరికాకు తెచ్చారు. ఆ తర్వాత అది అమెరికన్లకు ప్రీతిపాత్రమైంది.  
  • ప్రపంచంలో అన్ని చోట్లా బేక్‌ చేసిన పిజ్జా లభిస్తుంది. అయితే స్కాట్లాండ్‌లో మాత్రం డీప్‌ ఫ్రై పిజ్జా దొరుకుతుంది.  
  • వ్యోమగాముల ఫుడ్‌ కోసం నాసా తయారు చేసిన 3డి ప్రింటర్‌లో పిజ్జాకు కూడా చోటు దక్కింది.  

  • చవకగా దొరికే పిజ్జాలతో పాటు అత్యంత ఖరీదైనవి కూడా దొరుకుతాయి. ఇప్పటి వరకూ అత్యంత ఖరీదైన పిజ్జా ధర రూ. 7,93,880గా ఉంది.  
  •  2013లో డోమినోస్‌ రూపొందించిన డీవీడీ.. పిజ్జా వాసన రావడం విశేషం 
  • ప్రపంచంలోనే అత్యంత వేగంగా పిజ్జాను తయారు చేసేదిగా పేరున్న డోమినోస్‌కు మూడు పెద్ద పిజ్జాలను చేయడానికి కేవలం 47.56 సెకన్లు మాత్రమే పడుతుందట.  
  • ఓ అధ్యయనం ప్రకారం వారానికి ఓ పిజ్జాను తిన్న వారికి కేన్సర్‌ సోకే అవకాశం తక్కువగా ఉంటుందట. 
  • కొత్త సంవత్సరం రోజు నిమిషానికి 4100 పిజ్జా ఆర్డర్లు వచ్చాయని జొమాటో సీఈవో దీపీందర్‌ గొయెల్‌ చెప్పడాన్ని బట్టి చూస్తే భారత్‌లో కూడా పిజ్జాకు ఎంత ఆదరణ ఉందో అర్థమవుతుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement