
ఎంత తిన్నావన్నది కాదన్నయ్యా...ఎంత సేపు కూర్చున్నావన్నదే..!
ఉచితం
ఇక్కడ పిజ్జా ఉంది. పాస్తా ఉంది. రిసాటో ఉంది. ఢిల్లీ సమీపంలోని గుర్‌గావ్‌లో పీపుల్స్ అండ్ కో అనే ఒక రెస్టారెంట్‌కి వెళితే ఈ మూడు ఐటమ్స్‌లో మనకు ఇష్టమైన దాన్ని తినొచ్చు. ఇష్టమైతే మూడూ తినొచ్చు! ఇందులో విషయం ఏముందీ?! ఉంది. ఇవి మూడూ అక్కడ ఫ్రీ! ఉచితం!! అయితే చిన్న కండిషన్. సోమ, మంగళ వారాల్లో మాత్రమే ఉచితం.
అయితే ఏంటి? కుమ్మేయడానికి ఆ రెండు రోజులు చాలవా? చాల్తాయి. కానీ ఇంకో కండిషన్ కూడా ఉంది. ఫుడ్డుకి బిల్లు కట్టేక్కర్లేదు కానీ, రెస్టారెంట్‌లో కూర్చున్న టైమ్‌కి బిల్లు కట్టాలి! ఎంతంటే.. నిమిషానికి 15 రూపాయలు. ఆఫర్ బాగుందా? టైమ్ లెక్కేసుకుని తింటే బాగానే ఉంటుంది.