పిజా తింటూ క్రికెట్ చూస్తున్నారు!
ముంబై: భారతీయులు ఫుడ్, క్రికెట్ పట్ల అనురక్తి చూపుతారని సర్వేలో వెల్లడైంది. పిజా తింటూ క్రికెట్ చూడడానికి ప్రాధాన్యత ఇస్తారని తేలింది. గ్రూపాన్ ఇండియా వెబ్ సైట్ 'ఫుడ్ ప్రీమియర్ లీగ్' పేరుతో సరదా సర్వే నిర్వహించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) జరుగుతున్న నేపథ్యంలో దేశంలోని వివిధ నగరాల్లో ఈ సర్వే చేపట్టింది.
క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పుడు కూకింగ్ కంటే పిజా ఆర్డర్ చేయడానికి ఎక్కువ మంది(48 శాతం) ఆసక్తి చూపిస్తున్నారని సర్వేలో వెల్లడైంది. బర్గర్, పాస్టస్ కంటే పిజావైపే అధిక శాతం మంది మొగ్గుచూపారు. ఇక 63 శాతం మంది ఫుడ్ ఐటెమ్స్ డిస్కౌంట్ల కోసం ఆన్ లైన్ లో జల్లెడ పడుతున్నట్టు తేలింది. క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఫుడ్, డ్రింక్స్ కోసం రూ.300 నుంచి రూ. 500 వరకు ఖర్చు చేస్తున్నారని సర్వే వెల్లడించింది.