యమదొంగ, చింతకాయల రవి, కింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కన్నడ భామ మమతామోహన్ దాస్. అయితే క్యాన్సర్ రావడంతో కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరమైన ఈ భామ..ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ కానుంది. సుధీర్ఘ విరామం తర్వాత లాల్‌బాగ్ అనే ఓ తెలుగు చిత్రంలో నటిస్తోంది. ప్రశాంత్ మురళి పద్మానాభన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఐటీ, థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో సాగుతున్న ఈ మూవీ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో నందినీరాయ్, సిజోయ్ వర్గిస్, అజిత్ కోషి కీ రోల్స్ పోషిస్తున్నారు. రాహుల్ రాజ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో తెరెకక్కుతున్న ఈ మూవీ రిలీజ్ డేట్స్ విడుదల కావాల్సి ఉంది.
చదవండి : ‘బిగ్‌బాస్’ ఆఫర్ వచ్చింది, డబ్బు కోసం కాదు కానీ.., : ఇంద్రజ
'అతని వల్లే ఆర్తి అగర్వాల్ కెరీర్ ఫేడ్ అవుట్ అయ్యింది'
Comments
Please login to add a commentAdd a comment