సామాజిక న్యాయం కోసం పోరాటం | fight for social justice | Sakshi
Sakshi News home page

సామాజిక న్యాయం కోసం పోరాటం

Mar 13 2017 12:55 AM | Updated on Sep 5 2017 5:54 AM

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లీం, క్రిష్టియన్‌ మైనార్టీలకు సామాజిక న్యాయం సిద్ధించే వరకు పోరాటాలు చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

బనగానపల్లె రూరల్‌ :  ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లీం, క్రిష్టియన్‌ మైనార్టీలకు సామాజిక న్యాయం సిద్ధించే వరకు పోరాటాలు చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల సాధనకోసం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్ర ఆదివారం రాత్రి బనగానపల్లెకు చేరింది. ఈ సందర్భంగా పాతబస్టాండ్‌ సర్కీల్‌లో ఏర్పాటు చేసిన చైతన్య సభలో రామకృష్ణ మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు టీడీపీ పాలనలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. ముస్లీం, గిరిజనులకు మంత్రివర్గంలో చోటు కల్పించని సీఎం చంద్రబాబు తన కుమారున్ని మంత్రిని చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారన్నారు.  రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌ సాక్షిగా ప్రధాన మంత్రి మోడీ ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతున్నాడన్నారు.  విషయంపై ప్రశ్నించలేని దుస్థితిలో సీఎం చంద్రబాబు ఉండడం దురదృష్టకరమని పేర్కొన్నారు.  బడుగు, బలహీనవర్గాలవారు హక్కుల సాధన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమించాలని పిలుపు నిచ్చారు.  కార్యక్రమంలో బీసీ జనసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు శేషఫణి, సామాజిక హక్కుల వేదిక జిల్లా కన్వీనర్‌ రామాంజనేయులు, కో కన్వీనర్‌ జగన్నాథం, నాయకులు ఎర్రబాషా, సుబ్బారెడ్డి, బాలకృష్ణ, పెద్దమునెయ్య, శిల్పి సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement