praja chaitanya yatra
-
ఆ ముగ్గురే ముంచారు!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: కుప్పం నియోజకవర్గంలోని పంచాయతీల్లో టీడీపీ ఘోర పరాభవానికి ఎమ్మెల్సీ శ్రీనివాసులు, పార్టీ ఇన్చార్జి మునిరత్నం, చంద్రబాబు పీఏ మనోహర్ కారణమని ఓడిన సర్పంచ్ అభ్యర్థులు చంద్రబాబు ఎదుట ఏకరువు పెట్టారు. దీటైన పోటీ ఇచ్చేందుకు ఆ ముగ్గురూ సహకరించలేదని తెలిపారు. గురు, శుక్రవారాల్లో చంద్రబాబును వేర్వేరుగా కలిసిన రామకుప్పం, శాంతిపురం మండలాల పార్టీ నాయకులు, సర్పంచ్ అభ్యర్థులు ఆ ముగ్గురిపైనా ఫిర్యాదులు చేశారు. అధికారంలో ఉండగా ఆ ముగ్గురి వల్ల ఆర్థికంగా లబ్ధి పొందిన వ్యక్తులను పంచాయతీ ఎన్నికల్లో పోటీకి దించలేదని తెలిపారు. అధికార పార్టీని దీటుగా ఎదుర్కొనే సామర్థ్యం, శక్తి తమకు లేకపోయినా పార్టీపై గల అభిమానంతో పోటీ చేశామని వివరించారు. ఆ ముగ్గురినీ ఇంకా నమ్ముకుంటే అసలుకు ఎసరు తప్పదని చంద్రబాబు ఎదుట తేల్చి చెప్పారు. చంద్రబాబు వారికి బదులిస్తూ.. అన్నీ తెలుసుకున్నానని, ఇకనుంచి క్రమం తప్పకుండా తాను లేదా లోకేశ్ కుప్పంలో పర్యటిస్తామని బుజ్జగించే ప్రయత్నం చేశారు. నియోజకవర్గంలో వైఫల్యాలను సమీక్షించుకుని పార్టీలో పునరుత్తేజం నింపుతారని భావించిన కార్యకర్తలకు నిరుత్సాహమే మిగిలింది. తానెంతో గొప్పవాడినని చెప్పుకోవడానికి, ఎదుటి వారిపై నిందలు వేయడానికే చంద్రబాబు పరిమితమయ్యారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కుప్పం నుంచే ప్రజా చైతన్య యాత్ర రామకుప్పం, రాజుపేట రోడ్డు, శాంతిపురంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభల్లో చంద్రబాబు మాట్లాడుతూ.. కుప్పం నియోజకవర్గం నుంచే ప్రజా చైతన్య యాత్ర చేపట్టనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం నడవటం లేదని, పులివెందుల రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. ఇలాంటి అరాచక పాలన చేస్తుంటే యువకులుగా మీరేం చేస్తున్నారు, నిద్రపోతారా అంటూ రెచ్చగొట్టారు. తాను కూడా పట్టించుకోకపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుందోననే బాధ ఉందని చెప్పుకొ చ్చారు. పోలీసు వ్యవస్థతో పోరాటం చేయాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదని, అధికారంలోకి రాగానే చక్రవడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మ ఒడి డబ్బు నాన్న బుడ్డికి సరిపోయిందంటూ ప్రభుత్వ పథకాలపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. -
ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలను రెచ్చగొట్టి, ప్రాంతీయ విభేదాలు సృష్టించేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అని ధ్వజమెత్తారు. ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ.. ఒక ప్రాంతానికి నష్టం కలిగించేలా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. ఉత్తరాంధ్ర ప్రజల వ్యతిరేకత మధ్య చంద్రబాబు విశాఖలో పర్యటించడం సరైంది కాదన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు శాంతి కాముకులని అన్నారు. అంబటి రాంబాబు గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి.. బాబు కుళ్లు బుద్ధికి మధ్యనే ఇవాళ పోరాటం జరుగుతోందని పేర్కొన్నారు. ఇది వైఎస్సార్సీపీ, టీడీపీల మధ్య జరుగుతున్న పోరాటం కాదని స్పష్టం చేశారు. బాబు ఇంత చేసినా విశాఖ ప్రజలు హుందాగానే వ్యవహరించారన్నారు. విశాఖ ప్రజలే బాబును వెనక్కి పంపారు ‘‘తమ ప్రాంతంలో పర్యటించే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని ఉత్తరాంధ్ర ప్రజలు నినదించారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని ఆయన అంటున్నారు. కానీ, రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానులు అన్న ఆలోచన చేశారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర వెళ్లి ప్రజలను ఏ విధంగా చైతన్యవంతం చేస్తారు? ఉత్తరాంధ్ర రాజధానిగా పనికి రాదని చెప్పదలుచుకున్నారా? ఉత్తరాంధ్రలో బాబు ఉన్మాద చర్యలకు పాల్పడ్డారు. 5 వేల మంది రాయలసీమ నుంచి వచ్చారని టీడీపీ నేతలు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. పులివెందుల నుంచి ఒక్కరు కూడా విశాఖకు రాలేదు. విశాఖ ప్రజలే బాబును వెనక్కి తిప్పి పంపారు’’ అని ఉద్ఘాటించారు. -
ప్రజా వంచన యాత్ర
-
రావొద్దు బాబూ.. !
చంద్రబాబు జిల్లాకు వస్తున్నా రంటే... ఊరంతా ‘పచ్చ’ తోరణాలు కట్టేసి హడావుడి చేసే నేతలంతా ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారు. బాబ్బాబు మా జిల్లా కొద్దు... ఆ పక్క జిల్లాలో మీ ఇష్టం వచ్చినన్ని నియోజకవర్గాలు తిరగండి మేమే వచ్చిపోతాం... మా దగ్గరకు మాత్రం రాకండి... అంటూ వేడుకుంటు న్నారు. బాబు ప్రజాచైతన్య యాత్రలకు స్పందన లేక పోగా... బాబు టూర్‌కు జనాన్ని తేలేక చేతి చమురు వదులుతుండటంతో నేతలంతాచంద్రబాబే కబురుపంపుతున్నా... ముఖంచాటేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజాచైతన్య యాత్రపై ఆ పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. యాత్రకు ప్రజల నుంచి స్పందన లేకపోవడం....పైగా చేతి చమురు వదులుతుండటంతో జిల్లాలో యాత్ర చేపట్టేందుకు ఆ పార్టీ నేతలు ససేమిరా అంటున్నారు. తమ నియోజకవర్గాల్లో ప్రజా చైతన్య యాత్ర వద్దంటే... వద్దంటూ స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి ప్రజాచైతన్య యాత్ర పేరుతో రాష్ట్రమంతా తిరిగి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయాలని టీడీపీ అధినేత భావించారు. ఈ విధంగా సుమారు 100 నియోజకవర్గాల్లో యాత్ర నిర్వహించాలని ప్రణాళిక వేసుకున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఈ నెల 17వ తేదీన ప్రకాశం జిల్లా బొప్పూడిలో యాత్ర ప్రారంభించారు. కానీ ఎక్కడా స్పందన కనిపించడం లేదు. అంత్మరథనంలో అనంత నేతలు.. చంద్రబాబు చేపట్టిన ప్రజాచైతన్య యాత్ర ఏఏ నియోజకవర్గాల్లో చేపట్టాలనే అంశంపై టీడీపీ నేతలు తాజాగా సమావేశమయ్యారు. అయితే, తమ నియోజకవర్గంలో వద్దంటే...తమ నియోజకవర్గంలో వద్దని నేతలు మూకుమ్మడిగా తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. యాత్రకు ప్రజల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో పాటు యాత్రకు అయ్యే ఖర్చును ఎందుకు భరించాలనే భావనతోనే చంద్రబాబు యాత్ర వద్దని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నట్టు సమాచారం. దీంతో పరువు పోతుందని భావించిన నేతలు... కనీసంరెండు నియోజకవర్గాల్లోనైనా యాత్ర చేపట్టి చేతులు దులుపుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజాచైతన్యం... స్పందన శూన్యం ఆరేడు నెలల కాలంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు మూడు రాజధానులపై ప్రజా చైతన్య యాత్ర చేపట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అయితే, మొదటి రోజున ప్రకాశం జిల్లాలో చేపట్టిన యాత్రలో చంద్రబాబు పాల్గొనగా... ప్రజల నుంచి స్పందన కనిపించలేదు. అంతేకాకుండా ఆరేడు నెలల కాలంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఉద్యోగాల కల్పన, పింఛన్ల మొత్తం పెంపు, అర్హులైన వారందరికీ అమ్మఒడి, రైతుభరోసా వంటి పథకాలు ప్రజల్లోకి బాగా వెళ్లిపోయాయి. అంతేకాకుండా చంద్రబాబు హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు కూడా ఏకంగా రూ.7 లక్షల నష్టపరిహారం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చెల్లిస్తోంది. వీటికితోడు ఆటోవాలాలకు రూ.10 వేల సాయంతోపాటు విద్యార్థులకు జగనన్న వసతి దీవెన కూడా ఈ నెల 24వ తేదీన ప్రారంభించనున్నారు. మరోవైపు ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో ఇన్నాళ్లూ పట్టించుకోని సాగునీటి ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుండగా.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే పేరుతో రాజకీయ ఉద్దేశంతో చేపడుతున్న ఈ యాత్రకు ప్రజల నుంచి స్పందన ఏ మాత్రమూ ఉండటం లేదు. ఈ విషయం జిల్లాలోని టీడీపీ నేతలకు కూడా అర్థమయ్యింది. అందుకే యాత్ర వద్దంటే వద్దని స్పష్టం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఖర్చులకు జడిసి...! ఒకవైపు చంద్రబాబుయాత్రకు ప్రజా స్పందన లేకపోవడం... మరోవైపు యాత్ర విజయవంతం చేయాలంటే తాము బాగా కష్టపడాల్సి వస్తుందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుందని వాపోతున్నారు. అధికారం కోల్పోయిన నేపథ్యంలో తమ జేబుల్లో నుంచి తీసి ఖర్చు ఎందుకు చేయాలనే భావనలో ఉన్నట్టు సమాచారం. అందులోనూ బలవంతంగా జనసమీకరణ చేయాల్సి రానుండటంతో ఖర్చు కొంచెం ఎక్కవే చేయాల్సి వస్తుందని వారంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖర్చుకు జడిసి కూడా ఆ పార్టీ నేతలు యాత్ర వద్దంటే వద్దని తేల్చిచెబుతున్నారు. అందువల్లే పార్టీ పరువును కాపాడేందుకు కనీసం రెండు నియోజకవర్గాల్లోనైనా యాత్ర చేపట్టాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం ఆయా నియోజకవర్గాల నేతలను ఒప్పించేపనిలో పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. మొత్తమ్మీద చంద్రబాబు యాత్రకు ప్రజల నుంచే కాదు ఆ పార్టీ నేతల నుంచి కూడా స్పందన కనిపించకపోవడం గమనార్హం. -
ఏ ముఖం పెట్టుకుని ప్రజా చైతన్య యాత్రలు..!
సాక్షి, నెల్లూరు: ఏ ముఖం పెట్టుకుని ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రలు చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ఇచ్చిన హామీలు నెరవేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి చంద్రబాబు బెంబేలెత్తుతున్నారన్నారు. మద్యం ధరలు పెరిగాయని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ప్రజలు చాలా తెలివైన వారని.. అందుకే ఆయనను చిత్తుగా ఓడించారని ప్రసన్నకుమార్ రెడ్డి పేర్కొన్నారు. (చంద్రబాబుది ప్రజావంచన యాత్ర) ‘చిన్నమెదడు చితికిపోయి యాత్ర చేస్తున్నారు’ -
ప్రజాచైతన్య యాత్ర
-
చంద్రబాబూ.. ఏంటయ్యా నీ బాధ?
సాక్షి, అమరావతి: ఐటీ దాడుల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాచైతన్య యాత్ర చేపట్టారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు యాత్రను తాము అడ్డుకుంటున్నామన్న ఆరోపణలను తోసిపుచ్చారు. ప్రజలు చైతన్యవంతులు కాబట్టే టీడీపీ తోకను కత్తిరించారని ఎద్దేవా చేశారు. మార్టూరు సభలో 108 అంబులెన్స్‌కు దారి ఇవ్వని సంస్కృతి చంద్రబాబుదని దుయ్యబట్టారు. రోజుకో డ్రామాతో నాటకాలా? తన వ్యక్తిగత మాజీ కార్యదర్శి అక్రమాల ఆరోపణలపై చంద్రబాబు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బాబు పీఎస్‌ను పట్టుకుంటేనే రూ. 2 వేల కోట్ల అక్రమాలు బయటపడ్డాయని అన్నారు. పెన్షన్లపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని, పార్టీలకు అతీతంగా తమ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తోందని స్పష్టం చేవారు. ఎల్లోమీడియాతో కలిసి శవ రాజకీయాలు చేస్తున్నారని, రోజుకో డ్రామాతో చంద్రబాబు నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. డబ్బులు ఖర్చుపెట్టి అధికారం చేజిక్కించుకోవాలని చంద్రబాబు ఆరాటపడుతున్నారని, ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని తగ్గించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచిస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ అవినీతిరహిత పాలన అందిస్తున్నారని, చంద్రబాబు ఎన్ని యాత్రలు చేసినా ఒరిగేది ఏమీ లేదని అంబటి రాంబాబు అన్నారు. (చదవండి: ఐటీ గుప్పిట్లో బిగ్‌బాస్ గుట్టు!) ఏంటయ్యా నీ బాధ? మద్యం ధరలపై సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని అంబటి ధ్వజమెత్తారు. ‘అన్ని బ్రాండ్ లు దొరకడం లేదట. మద్యం ధర పెరిగిందట. ఏంటయ్యా నీ బాధ నువ్వు చెప్పాల్సింది మద్యం తాగవద్దని. మద్యం మాన్పించాలని మేము కొత్త పాలసీ మేము తెస్తే జనం తాగలేకపోతున్నారని ఆయన బాధ పడుతున్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో మద్యం సరఫరా నివారణకు చట్టం చేస్తే అది మంచిది కాదని అంటాడు. మద్యం, డబ్బు ప్రభావం ఎన్నికలపై పడకూడదని మంచి ఉద్దేశంతో జగన్ గారు కృషి చేస్తున్నారు. దానికి కూడా చంద్రబాబు గగ్గోలు పెడుతున్నార’ని అంబటి అన్నారు. ప్రతిపక్షనేత కాదు.. పనికిమాలిన నేత: ఆర్కే రోజా -
చంద్రబాబుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు
-
ప్రజాచైతన్య యాత్రకు టీడీపీ వెనకడుగు
-
గిరిజనులను మోసం చేసిన కేసీఆర్
సాక్షి, ఆసిఫాబాద్: గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్ మోసం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. గిరిజనులపై సీఎం కు చిత్తశుద్ధి ఉంటే ఒక్కో కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇవ్వా లని డిమాండ్ చేశారు. బుధవారం ప్రజా చైతన్య బస్సుయాత్ర సందర్భంగా కుమురం భీం జిల్లా కేంద్రం ఆసిఫాబాద్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మద్దతు ధర అడిగిన పాపానికి ఖమ్మంలో రైతులకు బేడీలు వేశారని, భూపాలపల్లిలో పోడు భూము లు చేసుకుంటున్న గిరిజనుల్ని చెట్టు కట్టేసి కొట్టారన్నారు. ఎస్సీ, ఎస్టీల కోసం కేటాయించిన నిధుల్లో పది వేల కోట్ల రూపాయలు దారి మళ్లించినట్టు కాగ్ ఆక్షేపించిందని గుర్తుచేశారు. ఎన్నికల హామీల్లో ఒక్క దానిని కూడా నెరవేర్చలేదని, పైగా గిరిజనుల భూములు లాక్కుంటోం దని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే గిరిజనులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడటం లో ఆదివాసీ, సింగరేణి కార్మికుల త్యాగాలు మరువలేనివని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి అన్నారు. సిం గరేణి వారసత్వ ఉద్యోగాలను కారు ణ్య నియామకాలుగా మార్చార న్నా రు. కాంగ్రెస్ ప్రారంభించిన అనేక పథకాలను టీఆర్ఎస్ ప్రభు త్వం నిలిపివేసిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క అన్నారు. -
సింగరేణి అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికే ప్రాధాన్యం
సాక్షి, మంచిర్యాల అర్బన్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సింగరేణి అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికే తొలిప్రాధాన్యత ఇస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భరోసానిచ్చారు. మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లో ఐదు రోజలపాటు నిర్వహించే కాంగ్రెస్ పార్టీ ప్రజాచైతన్య బస్సుయాత్రలో భాగంగా ఆదివారం రాత్రి మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ చేసిన ప్రసంగంతో ప్రజలను ఆకట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన కార్మికులను అధికారం చేపట్టాక నమ్మించి మోసం చేసిన చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెల్లుతుందని విమర్శించారు. సింగరేణి డిస్మిస్ కార్మికులకు ఉద్యోగాలు, డిపెండెంట్ ఉద్యోగాలు, కాంట్రాక్టు కార్మికుల పర్మినెంట్, రూ.10 లక్షల ఇళ్ల రుణాలంటూ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 90 శాతం పూర్తి చేసిన జైపూర్ పవర్‌ప్లాంట్‌ను స్విచ్ ఆన్‌చేసి తమ ఘనతేనని చెప్పుకోవడం సిగ్గుచేటని ఉత్తమ్ విమర్శించారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డిస్మిస్ కార్మికులకు మరోసారి అవకాశం కల్పించడం, డిపెండెంట్ ఉద్యోగాలు, కాంట్రాక్టు కార్మికుల పర్మినెంట్ చేస్తామని స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో జిల్లాలో చేపట్టిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత–చేవేళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేసి జిల్లాకు నీరందించేందుకు పనులు ప్రారంభిస్తే.. కేసీఆర్ వచ్చిన తర్వాత ఏం చేసిండో ప్రజలు గమనించాలని అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా ఒక టీఎంసీ తాగునీరు, సాగునీరు అందించాలనే సంకల్పంతో నిర్మిస్తే తామే నిర్మించినట్లు నటిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాకు రావాల్సిన 1శాతం నీటిని తాగునీరు, సాగునీరు కాంగ్రెస్ ఇస్తుందని భరోసానిచ్చారు. రైతులకు బేడీలు వేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే.. గిట్టుబాటు ధర కల్పించాలని అడిగిన పాపానికి రైతులకు బేడీలు వేసిన చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టివిక్రమార్క విమర్శించారు. ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. శాసనమండలి ఉపనేత షబ్బీర్‌అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో తొమ్మిది రకాల నిత్యావసర సరకులు చౌకధరల దుకాణాల ద్వారా అందిస్తే టీఆర్ఎస్ హయాంలో ఏం ఇస్తుందో ప్రజలకు తెలియంది కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్న కేటీఆర్‌కు ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ధ్వజమెత్తారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హన్మంతరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో వేల కోట్లు సంపాదించిన మాజీ ఎంపీ వివేక్, వినోద్‌లు పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరడం దుర్మార్గమైన చర్య అంటూ వారిపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మోసం చేయని వారెవరున్నారని ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, మాజీ హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ మహిళల ఉద్యమంతో అధికార పీఠం ఎక్కిన కేసీఆర్‌ను మహిళలలే ఇంటిబాట పట్టిస్తారని చెప్పారు. దేశంలో ప్రజావేదికలు, పోరాటలను ధ్వంసం చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ మాత్రమేనని ప్రజా గాయకుడు గద్దర్ కుమారుడు సూర్యం ఆరోపించారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేస్తోందని అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పరామర్శించే తీరిక లేదని ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే కాకముందే రెండు రోజులకోకసారైనా నీరొచ్చేదని, ఇప్పుడు వారం రోజులైనా నీరు రాకుండా పోయిందని ఆరోపించారు. సింగరేణి కార్మికుల కుటుంబాల్లో డిపెండెంట్ పేరిట చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. ఎమ్మె ల్యే తండ్రి పేరిట ప్రభుత్వ భూమి రికార్డులోకి ఎక్కిస్తే అందరం కలిసికట్టుగా కొట్లాడడంతోనే తొలగించిన విషయాన్ని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు మాట్లాడుతూ కమీషన్ల కోసం మిషన్భగరీథగా అభివర్ణించారు. మున్సి పాల్టీలో వాళ్లు నీరుసరఫరా చేయరు.. తాను చేస్తానంటే నీళ్లు ఇవ్వరు ఇదెక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన ఇవ్వకున్నా తానే సొంతంగా బోరు వేయించుకుని నీటి సరఫరా చేస్తున్నానని తెలిపారు. వైఎస్సార్ కలల ప్రాజెక్టు ప్రాణహిత–చేవేళ్ల ద్వారా ఉమ్మడి జిల్లాలో తూర్పు ప్రాంతంలో 3లక్షల ఎకరాలకు సాగునీరుతోపాటు తాగునీరందేదని, ఐదుగురు చవుటదద్దమ్మల ఎమ్మెల్యేల వల్ల నీరురాకుండా పోయిందని ధ్వజమెత్తారు. జిల్లాకు నీరందిస్తారా లేదా రాజీనామాలు చేస్తారో తేల్చుకోవాలని సవాల్ చేశారు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శాసనమండలి ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ నేతలు మల్లు రవి, నరేష్‌జాదవ్, రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
సమరోత్సాహం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: చాలాకాలంగా నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో సమరోత్సాహం పెల్లుబుకుతోంది. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా చైతన్య యాత్ర పేరుతో ప్రారంభించిన బస్సు యాత్రకు స్పందన పెరుగుతుండడం నేతల్లో ఆనందానికి కారణమవుతోంది. ఇప్పటి వరకు రెండు దశల్లో 31 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర సాగించిన కాంగ్రెస్ అతిరథ మహారథులు ఆదివారం మంచిర్యాల పట్టణానికి రాబోతున్నారు. మూడో విడత బస్సుయాత్రను మంచిర్యాల నుంచి ప్రారంభించి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాల్లో ఒక్కోరోజు సభ నిర్వహించనున్నారు. అధికార పార్టీ నేతల హడావుడి మధ్య కాంగ్రెస్ జెండాలు కూడా కనిపించకుండా పోతున్న పరిస్థితుల్లో బస్సు యాత్ర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఊపిరిపోస్తోంది. ఈ నేపథ్యంలో నేతలంతా ఐక్యతారాగం పాడుతూ బస్సు యాత్రను విజయవంతం చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. డీసీసీ అధ్యక్షుడుమహేశ్వర్రెడ్డి చొరవతో.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి మూడో విడత బస్సు యాత్రను మంచిర్యాల నుంచి ప్రారంభించేందుకు తనవంతు కృషి చేశారు. గతంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ బస్సు యాత్ర సాగుతుందని ప్రకటించినప్పటికీ, నిర్మల్‌తోనే ఆగిపోయింది. తాను ఇన్చార్జిగా ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మల్‌లో సభను మహేశ్వర్‌రెడ్డి విజయవంతం చేయించారు. అదే సమయంలో మిగతా నియోజకవర్గాల్లో కూడా ప్రజా చైతన్యయాత్రలు నిర్వహించేలా కాంగ్రెస్ నేతలను ఒప్పించారు. అందులో భాగంగానే మూడో విడతలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, ఆసిఫాబాద్, సిర్పూరు నియోజకవర్గాల్లో ఐదు రోజులపాటు బస్సు యాత్ర సాగనుంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి, కాంగ్రెస్ నేతలు టి.జీవన్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, డి.కె.అరుణ, ఎ.రేవంత్‌రెడ్డి తదితరులు హాజరయ్యే ఈ యాత్ర, సభలను విజయవంతం చేయడం ద్వారా పార్టీకి తిరిగి ఊపిరి పోసినట్లవుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. నేతల ఐక్యతారాగం మంచిర్యాలలో ఆదివారం సాయంత్రం జరిగే ఆత్మగౌరవ సభను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలంతా ఒక్కటయ్యారు. డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి ఏకతాటిపైకి రావడం విశేషం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్న ప్రేంసాగర్‌రావు సహజంగానే మాజీ ఎమ్మెల్యే ఎం.అరవింద్‌రెడ్డిని వ్యతిరేకించారు. ఒక సందర్భంలో అరవింద్‌రెడ్డి టీఆర్ఎస్లోకి వెళతారనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దల జోక్యంతో వీరిద్దరు ఐక్యతారాగం పాడి కలిసి పనిచేయాలని నిర్ణయించుకోవడం కాంగ్రెస్ కార్యకర్తలకు ఉత్సాహాన్నిచ్చింది. సత్తా చాటే ఎత్తుగడలో ప్రేంసాగర్‌రావు మంచిర్యాలలో ఆదివారం సాయంత్రం జరిగే కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్ర సభ ఏర్పాట్లన్నీ మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు ఆధ్వర్యంలోనే సాగుతున్నాయి. సభా నిర్వహణ ఖర్చు మొదలుకొని, వాహనాలు సమకూర్చడం, భోజనాల ఏర్పాటు, ఆయా మండలాల నాయకుల ఇతర ఖర్చులు అన్నీ ప్రేంసాగర్‌రావు నేతృత్వంలోనే సాగుతుందనేది బహిరంగ రహస్యం. గత రెండేళ్లుగా మంచిర్యాల నియోజకవర్గంలో పాగా వేసుకొని కూర్చున్న పీఎస్ఆర్ ఈ సభ ద్వారా నియోజకవర్గానికి అన్నీ తానే అని నిరూపించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఇతర నియోజకవర్గాల్లో సైతం అదే ఊపు కాంగ్రెస్ ప్రజా చైతన్యయాత్రను విజయవంతం చేయాలనే సంకల్పంతో మిగతా నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మంచిర్యాల స్థాయిలో కాకపోయినా.. సభలకు జనం సమీకరించడంలో అందివచ్చే అవకాశాలన్నింటినీ ఉపయోగించుకునే ఆలోచనతో ఉన్నారు. అధిష్టానం నుంచి ఆర్థికంగా సహాయ సహకారాలు రాకపోవడం మిగతా నాలుగు నియోజకవర్గాలకు ఇబ్బంది కరమైన అంశం. చెన్నూరులో మాజీ మంత్రి బోడ జనార్దన్, సిర్పూరులో రావి శ్రీనివాస్, గోసుల శ్రీనివాస్‌యాదవ్, సిడాం గణపతి సభలను విజయవంతం చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కు గిరిజనులతో సభను విజయవంతం చేసే యోచనలో ఉన్నారు. బెల్లంపల్లిలో కాంగ్రెస్ ఇన్చార్జి, పీసీసీ సభ్యుడు చిలువల శంకర్ ఆధ్వర్యంలో 17న సభ జరుగనుంది. -
ఇసుక మాఫియాకు కేంద్రంగా భద్రాచలం: భట్టి
సాక్షి, భద్రాచలం : ఒకప్పుడు భద్రాచలం అంటే సీతారామచంద్ర ప్రభువు, భక్త రామదాసు గుర్తుకు వచ్చేవారని ప్రస్తుతం ఇసుక మాఫియా కేంద్రంగా మారిపోయిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా బుధవారం ఆయన తమ పార్టీ నాయకులతో కలిసి భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం భద్రాచలం అభివృద్ధికి ఎంతో కృషి చేసిందన్నారు. ఇప్పుడు గోదావరి నది మీద నిర్మించిన బ్రిడ్జి మొదలు వాజేడు వద్ద కొత్తగా కట్టిన బ్రిడ్జిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్మించిందని గుర్తుచేశారు. ఈ పరిసర ప్రాంతాల్లో ప్రవహించే శబరి నది మీద హైడల్ ప్రాజెక్టు, దానికి కింద భాగంలో శబరి-గోదావరి కలిసే ప్రాంతంలో దుమ్ముగూడెం ఇందిరాసాగర్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి 80 శాతం నిర్మాణాన్ని పూర్తి చేసింది తమ పార్టీనేనని చెప్పారు. ఇందిరా సాగర్ ప్రాజెక్టును పూర్తిగా చంపేసి ఈ ప్రాంత ప్రయోజనాలను కేసీఆర్ సర్కార్ చావుదెబ్బ తీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ముంపు మండలాలను అప్పనంగా ఆంధ్రకు అప్పగించారని నిప్పులు చెరిగారు. చివరకు అన్యాయంగా ఆంధ్రలో కలిపిన అయిదు గ్రామాల గురించి కూడా ప్రధానితో కేసీఆర్ మాట్లాడింది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో భట్టి విక్రమార్కతో పాటు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. -
నేడు కాంగ్రెస్ బస్సుయాత్ర
మహబూబాబాద్ : కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజాచైతన్య బస్సుయాత్ర ఆదివారం మానుకోటకు చేరుతుంది. మద్యాహ్నం 2 గంటలకు మరిపెడలో ప్రా రంభమై సాయంత్రం 6గంటలకు మానుకోటకు చేరుకుంటుంది. జిల్లా కేంద్రంలో బహిరంగ సభ నిర్వహణకు కాంగ్రెస్ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి ఆధ్వర్యంలో 25వేల జన సమీకరణకు సన్నాహాలు చేస్తున్నారు. యాత్ర మరిపెడ నుంచి కురవి మీదుగా జిల్లా కేంద్రంలో ఆర్ఓబీ, స్టేషన్ రోడ్, బస్టాండ్ రోడ్ నుంచి ఎన్టీఆర్ స్టేడియానికి చేరుతుంది. ఈ మేరకు స్టేడియంలో వేదిక నిర్మాణం, ఇతర ఏర్పాట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పనులను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భూక్యా ఉమ, జడ్పీటీసీ మూలగుండ్ల వెంకన్న, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గుగులోత్ సుచిత్ర, పార్టీ పట్టణ అధ్యక్షుడు ముల్లంగి ప్రతాప్‌రెడ్డి, మండల అధ్యక్షుడు సంద వీరన్న, నాయకులు చుక్కల ఉదయ్‌చందర్, ప్రసాద్, దస్రునాయక్, ఉప్పల వంశీ ఏర్పాట్లను పరిశీలించారు. వారు మాట్లాడుతూ యాత్రకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు బట్టి విక్రమార్క, పార్టీ ప్రతిపక్షనేత జానారెడ్డి, రాష్ట్ర నాయకుడు, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, జయపాల్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరవుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో మానుకోటపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. -
ఉనికి కోసమే ఉత్తమ్‌కుమార్ ఆరాటం
ఆత్మకూరు(పరకాల) : ఉనికికోసమే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరాటపడుతున్నాడని, కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హన్మకొండలోని తన నివాసగృహంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పరకాలలో కాంగ్రెస్ ప్రజా చైతన్య బస్సు యాత్ర విఫలమైందన్నారు. స్టేజీ మీదనే కాంగ్రెస్ టికెట్ల కొట్లాట కనిపించిందని, ప్రతిపక్ష పాత్ర పోషించలేని ఆ పార్టీ నాయకులకు ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయిలేదన్నారు. తన నియోజకవర్గంలో పనిచేయని ఓ కాంగ్రెస్ నాయకుడు పరకాల సెగ్మెంట్లో ఓ అభ్యర్థిని తయారుచేయడం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. అసెంబ్లీలో రౌడీయిజం చేసిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తే ముఖ్యమంత్రి, స్పీకర్‌ను విమర్శించడం సిగ్గుచేటన్నారు. పరకాల నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలకు దిగుతున్నారని, ఈ విషయాన్ని ప్రజలు అన్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు. భూరికార్డుల సమగ్రంగా ప్రక్షాళన చేసి రైతులకు పెట్టుబడులు ఇవ్వడానికి సిద్ధమవుతుంటే మింగుడుపడక విమర్శలు చేస్తున్నారని, వారికి ప్రజలు తగినబుద్ధి చెబుతారని అన్నారు. -
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం
సాక్షి, జనగామ: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వీస్తోందని, వచ్చే ఎన్నికల్లో అధికారం ఖాయమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి జనగామ జిల్లా పాలకుర్తిలో జరిగిన ఆ పార్టీ ప్రజా చైతన్య బస్సుయాత్ర సభలో ఆయన ప్రసంగించారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలు విసిగిపోయారని, ఆ పార్టీని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. డబుల్ బెడ్రూం, దళితులకు మూడెకరాల భూ పంపిణీ, ముస్లింలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇలా.. ప్రజలకు ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకో లేదని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ పాలనలో దళితులు, గిరిజనులు అవమానాలకు, అణచివేతకు గురవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు చేస్తున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న దళితులను పోలీస్ స్టేషన్‌కు తరలించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని మండిపడ్డారు. నేరెళ్ల బాధితులను పరామర్శించడానికి వచ్చిన లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ను అవమానపర్చే విధంగా కేసీఆర్ మాట్లాడారని చెప్పారు. మానకొండూరులో శ్రీనివాస్, పరుశురాం మూడు ఎకరాల భూమి కోసం ఆత్మహత్యాయత్నం చేసుకున్నా.. ఇప్పటికీ కేసు నమోదు కాలేదని ఉత్తమ్ పేర్కొన్నారు. మిర్చి మద్ధతు ధర అడిగిన గిరిజన రైతులకు బేడీలు వేశారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చెందిన రూ.10 వేల కోట్ల నిధులను దారి మళ్లించారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ పెద్ద అబద్ధాలకోరని మండిపడ్డారు. అప్పులు తెచ్చి ఆదాయంగా చూపుతున్నారని కాగ్ నివేదిక మొట్టికాయలు వేసిందన్నారు. ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడానికి ప్రయత్నిస్తున్న తమను అసెంబ్లీ నుంచి బహిష్కరించారని ఉత్తమ్ ఆరోపించారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. పత్తి పంటకు రూ.6 వేల కనీస మద్ధతు, వరి, మొక్కజొన్న, కందులకు రూ.2 వేలు, మిర్చికి రూ.10 వేల మద్దతు ధరను చెల్లిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 60 లక్షల డ్వాక్రా సంఘాల్లో ఉన్న 70 లక్షల మంది మహిళలకు వడ్డీలేని రుణాలను అందిస్తామని పేర్కొన్నారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల కింద రూ.10 లక్షలు చెల్లిస్తామన్నారు. ఒక్కో సంఘానికి లక్ష రూపాయల చొప్పున తిరిగి చెల్లించే అవసరం లేకుండా గ్రాంట్ కింద ఇస్తామన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి, అభయహస్తం తీసుకుంటున్న మహిళలకు నెలకు రూ.వెయ్యి చొప్పున అందిస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. దళితులను మోసం చేస్తున్న ప్రభుత్వాలు వరంగల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను మోసం చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం హన్మకొండలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ, కేసీఆర్‌లు అనుసరిస్తున్న విధానాల వల్ల దళితులు అన్యాయానికి గురవుతున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రివ్యూ పిటిషన్ వేస్తారని చెప్పారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు కేటాయించలేదని విమర్శించారు. బడ్జెట్లో రూ.10 వేల కోట్లు కేటాయించినట్లు ప్రకటించి.. ఆ నిధులను ఇతర పనులకు మళ్లించడంపై ప్రభుత్వానికి కాగ్ మొట్టికాయ వేసిందన్నారు. వర్గీకరణ చేయాలని డిమాండ్ చేసిన మంద కృష్ణను కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికి రెండు సార్లు జైలులో పెట్టిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. -
‘ప్రజా చైతన్య యాత్ర టీఆర్ఎస్కి అంతిమ యాత్ర’
సాక్షి, తాండూరు : కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర టీఆర్ఎస్ పార్టీకి, ఆ ప్రభుత్వానికి అంతిమ యాత్రలా మారుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సు యాత్రను చూసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భయంతో వణుకుతున్నారని అన్నారు. ప్రజా చైతన్య యాత్ర సందర్భంగా తాండూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో భట్టి విక్రమార్క మాట్లాడారు. ప్రజా చైతన్య యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే టీఆర్ఎస్ పీఠాలు కదలిపోవడం ఖాయమన్న విషయమం స్పష్టమవుతోందని అన్నారు. 2019 ఎన్నికల్లో దొరస్వామ్య, పెత్తందారీ టీఆర్ఎస్ పాలనకు ప్రజలు సమాధికట్టి, ప్రజలకోసం, ప్రజల కొరకు, ప్రజాస్వామ్య యుతంగా పాలించే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారన్న విషయం అర్థమవుతోందని అన్నారు. కేసీఆర్ పాలన అత్యంత క్రూరంగా, దుర్మార్గంగా ఉందని భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణకు తలమానికం అయిన సిగరేణి కాలరీస్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకర సంకేతాలను పంపేలా చర్యలు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు. నిజాం కాలంలో, బ్రిటీష్ పాలనలో సింగరేణికి అధికారింగా ఏనాడు సెలవు ఇవ్వలేదు. అదేవిధంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మరణించిన సమయంలో కూడా సింగరేణికి సెలవు ఇవ్వలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాంటిది ఈరోజు కేవలం సీఎం కేసీఆర్ సభ కోసం సింగరేణి ఒక్క రోజు సెలవు ఇవ్వడం ఏమిటని భట్టి తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. ఈ చర్య వల్ల సింగరేణికి ఒక్క రోజు ఉత్పత్తి ఆగిపోయి రాష్ట్ర ఖజనాకు నష్టం కలుగుతుంని ఆయన చెప్పారు. ఖజానాకు నష్టం వచ్చినా తన సభకు ఆహుతులు కావాలని కార్మికులనే సభికులుగా కేసీఆర్ మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని భట్టి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో రైతులు, విద్యార్థులు, మహిళలు, బీసీలు, ఎస్పీలు, ఎస్టీలు తీవ్రంగా నష్టపోతున్నారని భ్టటి ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను అమల్లోకి తీసుకువచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఈ చట్టం వల్ల జనాభాలోని దామాషా పద్దతిలో ఎస్సీలకు, ఎస్టీలకు నిధులు కేటాయింపు జరగాలని ఆయన చెప్పారు. ఈ చట్టం వల్ల ఈ నాలుగేళ్లలో ఎస్టీలకు, ఎస్టీలకు 50 నుంచి 60వేల కోట్ల నిధుల మంజూరు జరగాలని ఆయన అన్నారు. అయితే కేసీఆర్ పాలనతో దళితులు, గిరిజనులకు ద్రోహం జరిగిందనడానికి ఇదే పెద్ద నిదర్శనం అని అన్నారు. ఇటువంటి దిక్కుమాలిన ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో సమాధి కట్టాలని భట్టి విక్రమార్క ప్రజలకు పిలుపునిచ్చారు. అధికారంలోకి వస్తే ప్రతినియోజక వర్గంలోనూ లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చాడని, ఇచ్చిన హామీ మేరకు తాండూర్ నియోజకవర్గంలో ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చాడో చెప్పాలని ఆయన తీవ్ర స్వరంతో కేసీఆర్‌ని ప్రశ్నించారు. వెనుకబడిన రంగారెడ్డి జిల్లాకు నీళ్లు ఇచ్చే ఉద్ధేశంతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టింది. ఆ నీళ్లు ఎక్కడ పారితే అక్కడ కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుందన్న భయంతోనే ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును రీ డిజైన్ పేరుతో హత్య చేశారని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ అనేది కేవలం ఒక అబద్దపు ప్రచారంలా మిగిలిపోయిందని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతురుణ మాఫీకింద ఇప్పటివరకూ ప్రభుత్వం విడుదల చేసిన నిధులు కేవలం వడ్డీకే సరిపోలేదని భట్టి ప్రకటించారు. -
టీఆర్ఎస్ వైఫల్యాలే ఎజెండా
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం తేవడంతోపాటు పార్టీ కేడ ర్ను ఎన్నికల దిశగా సిద్ధం చేయడమే ఎజెండాగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘ప్రజా చైతన్య యాత్ర’(బస్సుయాత్ర) నేటి నుంచి ప్రారంభం కానుంది. 2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి పాదయాత్రను ప్రారంభించిన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచే ఈ యాత్ర కూడా మొదలుకానుంది. యాత్ర రూట్ కూడా వైఎస్ పాదయాత్ర సాగిన మార్గంలోనే సాగనుంది. యాత్ర తొలిదశ మార్చి 8న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముగియనుంది. ఈ యాత్ర కోసం పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. యాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు తాము అధికారంలోకి వస్తే చేయనున్న కార్యక్రమాలతో కూడిన మినీ మేనిఫెస్టోను కూడా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటిస్తారని పార్టీ వర్గాలంటున్నాయి. యాత్ర సాగుతుందిలా... సోమవారం ఉదయం 10 గంటలకు నాంపల్లి దర్గా వద్ద ప్రార్థనలు, 11 గంటలకు ఆరె మైసమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు, 12 గంటలకు మొయినాబాద్ చర్చి వద్ద ప్రత్యేక ప్రార్థనల తరువాత కాంగ్రెస్ నేతలు బస్సులో ఒంటిగంటకు చేవెళ్లకు చేరుకుంటారు. అక్కడ బస్సుయాత్ర తొలి బహిరంగసభ జరగనుంది. ఆ తర్వాత 4 గంటలకు వికారాబాద్‌లో జరిగే సభలో నేతలు ప్రసంగించనున్నారు. రాత్రికి బస కూడా అక్కడే చేసి నాయకులు, కార్యకర్తలతో నియోజకవర్గ సమస్యలపై చర్చించనున్నారు. మంగళవారం ఉదయం వికారాబాద్‌లో బయలుదేరి మధ్యాహ్నం ఒంటిగంటకు తాండూరు, 4 గంటలకు సంగారెడ్డిలో ప్రజా చైతన్యయాత్ర జరగనుంది. అలాగే 28వ తేదీ ఉదయం సంగారెడ్డి నుంచి బయలుదేరి ఒంటిగంటకు జహీరాబాద్, 4 గంటలకు నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రాల్లో సభలు జరుగుతాయి. రాత్రి నారాయణఖేడ్‌లో నేతలు బస చేస్తారు. ఆ తర్వాత మార్చి 1, 2, 3 తేదీల్లో బస్సు యాత్రకు విరామం ప్రకటించారు. మార్చి 4న బోధన్ నియోజకవర్గం నుంచి యాత్ర మళ్లీ ప్రారంభం అవుతుంది. అదే రోజు నిజామాబాద్‌లో, 5న ఆర్మూరు, బా ల్కొండ నియోజకవర్గాల్లో, 7వ తేదీన నిర్మల్, మెట్పల్లి నియోజకవర్గాల్లో యాత్ర జరగనుంది. 8 ,9 తేదీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో యాత్రతో తొలిదశ పూర్తి కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అప్పటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు యాత్రకు విరామం ఇవ్వనున్నారు. ఆ తర్వాత నుంచి మే 15 వరకు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పర్యటన సాగేలా టీపీసీసీ నాయకత్వం బస్సుయాత్రకు ప్రణాళికలు రూపొందించింది. -
సామాజిక న్యాయం కోసం పోరాటం
బనగానపల్లె రూరల్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లీం, క్రిష్టియన్ మైనార్టీలకు సామాజిక న్యాయం సిద్ధించే వరకు పోరాటాలు చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల సాధనకోసం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్ర ఆదివారం రాత్రి బనగానపల్లెకు చేరింది. ఈ సందర్భంగా పాతబస్టాండ్ సర్కీల్‌లో ఏర్పాటు చేసిన చైతన్య సభలో రామకృష్ణ మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు టీడీపీ పాలనలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. ముస్లీం, గిరిజనులకు మంత్రివర్గంలో చోటు కల్పించని సీఎం చంద్రబాబు తన కుమారున్ని మంత్రిని చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ప్రధాన మంత్రి మోడీ ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతున్నాడన్నారు. విషయంపై ప్రశ్నించలేని దుస్థితిలో సీఎం చంద్రబాబు ఉండడం దురదృష్టకరమని పేర్కొన్నారు. బడుగు, బలహీనవర్గాలవారు హక్కుల సాధన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో బీసీ జనసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు శేషఫణి, సామాజిక హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ రామాంజనేయులు, కో కన్వీనర్ జగన్నాథం, నాయకులు ఎర్రబాషా, సుబ్బారెడ్డి, బాలకృష్ణ, పెద్దమునెయ్య, శిల్పి సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. -
రాజధాని గ్రామాల్లో సీపీఐ యాత్ర
గుంటూరు: గుంటూరు జిల్లాలోని రాజధాని గ్రామాల్లో సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాజధాని గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. పేదలు, వృద్ధులు, వ్యవసాయ కార్మికులకు పెన్షన్లు పంపిణీ చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఈ నెల 11 న సీఆర్డీఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామని మధు హెచ్చరించారు. -
23 నుంచి గద్దర్ 'ప్రజా చైతన్య యాత్ర'
తెలంగాణలో నెలకొన్న సమస్యలపై గళమెత్తేందుకు ప్రజాగాయకుడు గద్దర్ సిద్ధమయ్యారు. చెరువుల పరిరక్షణకోసం ఈ నెల 23 నుంచి ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించనున్నారు. శనివారం హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన ఆయన మెదక్ జిల్లా కాళ్లకల్ నుంచి యాత్రను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కాగా ప్రభుత్వం తలపెట్టిన మిషన్ కాకతీయకు తాను వ్యతిరేకం కాదని గద్దర్ స్పష్టం చేశారు.