
సాక్షి, నెల్లూరు: ఏ ముఖం పెట్టుకుని ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రలు చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ఇచ్చిన హామీలు నెరవేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి చంద్రబాబు బెంబేలెత్తుతున్నారన్నారు. మద్యం ధరలు పెరిగాయని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ప్రజలు చాలా తెలివైన వారని.. అందుకే ఆయనను చిత్తుగా ఓడించారని ప్రసన్నకుమార్ రెడ్డి పేర్కొన్నారు.