nallapureddy prasanna kumar reddy
-
ఏ ముఖం పెట్టుకుని ప్రజా చైతన్య యాత్రలు..!
సాక్షి, నెల్లూరు: ఏ ముఖం పెట్టుకుని ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రలు చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ఇచ్చిన హామీలు నెరవేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి చంద్రబాబు బెంబేలెత్తుతున్నారన్నారు. మద్యం ధరలు పెరిగాయని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ప్రజలు చాలా తెలివైన వారని.. అందుకే ఆయనను చిత్తుగా ఓడించారని ప్రసన్నకుమార్ రెడ్డి పేర్కొన్నారు. (చంద్రబాబుది ప్రజావంచన యాత్ర) ‘చిన్నమెదడు చితికిపోయి యాత్ర చేస్తున్నారు’ -
చంద్రబాబు నర రూపరాక్షసుడు
సాక్షి, నెల్లూరు: రాష్ట్రాభివృద్ధిని ఓర్వలేక పిచ్చిప్రేలాపనలు చేస్తూ రాజధాని రైతులను రెచ్చగొడుతున్న చంద్రబాబునాయుడు నరరూపరాక్షసుడని, తమ నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే అర్హత ఆయనకు లేదని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక బెజవాడగోపాల్‌రెడ్డి పార్క్ వద్ద ఆదివారం జరిగిన వలంటీర్ల స్మార్ట్ఫోన్ల పంపిణీలో ఆయన మాట్లాడారు. జగన్మోహన్రెడ్డిని బలివ్వాలని అన్న చంద్రబాబునాయుడి మాటలపై ఆయన మండిపడ్డారు. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన నీచమైన చరిత్ర చంద్రబాబునాయుడిదన్నారు. జగన్మోహన్రెడ్డిని ప్రజల ఆశీర్వదించారని, 151 మందిని ఎమ్మెల్యేలుగా, 22 మందిని ఎంపీలుగా గెలిపించారన్నారు. అటువంటి వ్యక్తిపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న చంద్రబాబును నడిరోడ్డుపై ఉరితీయాలన్నారు. రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండాల్సిందేనన్నారు. పాదయాత్రలో ప్రతి ప్రాంతం సమస్యలను జగన్మోహన్రెడ్డి తెలుసుకున్నారని పేర్కొన్నారు. అందుకే పాలనా వికేంద్రీకరణ దిశగా సాగుతున్నారన్నారు. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. నమ్మినవారికి అండగా ఉండడం జగన్మోహన్రెడ్డి నైజమని తెలిపారు. నమ్మినవారిని తడిగుడ్డతో గొంతుకోయడం చంద్రబాబునైజమని పేర్కొన్నారు. చంద్రబాబు ఒక మానసిక రోగి అని విమర్శించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమన్నారు. అందుకు ఎమ్మెల్యేందరూ కలసికట్టుగా పనిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సూరా శ్రీనివాసులురెడ్డి, ఇప్పగుంట విజయ్‌భాస్కర్‌రెడ్డి, టంగుటూరు మల్లికార్జున్‌రెడ్డి, తిరువాయిపాటి నందకుమార్, కామాక్షితాయి ఆలయ పాలకమండలి సభ్యుడు ఇన్నమూరి నరసింహరావు పాల్గొన్నారు. -
తుదిశ్వాస వరకు జగన్‌తోనే ఉంటా
-
బాబు కోరిక మేరకు ఎన్టీఆర్ పార్టీ పెట్టారా!
నెల్లూరు: అబద్ధాలు చెప్పడంలో చంద్రబాను మించినవారు లేనేలేరని వైఎస్సార్ సీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. 'నేను కోరినందువల్లే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు' అని చంద్రబాబు ప్రచారం చేసుకోవడం దారుణమని మండిపడ్డారు. అలా చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఆదివారం నెల్లూరులో మీడియాతో మాట్లాడిన నల్లపురెడ్డి.. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు మోసం చేశారన్నారు. చంద్రబాబు తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధిని తాకట్టుపెట్టారని విమర్శించారు. -
'ఎమ్మెల్యే కనుసన్నల్లో నడుస్తున్న అధికార యంత్రాంగం'
నెల్లూరు : టీడీపీ నేతల అక్రమాలపై విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం నెల్లూరులో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి సోదరుడికి తెల్లరేషన్ కార్డు మంజూరు చేశారని ఆరోపించారు. నియోజకవర్గంలోని అధికార యంత్రాంగమంతా ఎమ్మెల్యే కనుసన్నల్లో నడుస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యే అవినీతిపై పోరాటం చేస్తామని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. -
'ఏపీలో అవినీతికి పీఎం మోదీ లైసెన్స్'
నెల్లూరు : అవినీతిని నిర్మూలిస్తామని పదేపదే చెబుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఏపీలో మాత్రం అవినీతికి లైసెన్స్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం గ్రామంలో గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబు రెండేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యమని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉన్నందున ప్రస్తుతం చంద్రబాబు అవసరం మోదీకి లేదన్నారు. కానీ, నరేంద్ర మోదీ మాత్రం చంద్రబాబు నాయుడ్ని ఎందుకు వెనకేసుకొస్తున్నారో ప్రజలకు అర్థం కావట్లేదని తెలిపారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన చంద్రబాబు...దీని నుంచి బయటపడేందుకు నరేంద్రమోదీ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. బాబుతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి గురించి పట్టించుకోవటం లేదో ప్రజలకు చెప్పాలని ఈ సందర్భంగా ప్రసన్నకుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధానమంత్రిపై తమకు ఎనలేని గౌరవం ఉందన్నారు. ఇచ్చిన మాటకు ప్రధాని కట్టుబడి ఉంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ దిశగా రాష్ట్రంలో అవినీతి అక్రమాలను అరికట్టాలని ప్రధానికి ప్రసన్నకుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు, లోకేష్‌లు కలసి రాష్ట్రంలో రూ.1,44,571 కోట్ల అవినీతికి పడగలెత్తారని విమర్శించారు. ఇరిగేషన్లో రూ.7,000 కోట్లు దోపిడీ చేశారని... అలాగే లిక్కర్ సిండికేట్ల నుంచి రూ.6,000 కోట్లు బహుమతిగా వచ్చాయన్నారు. పవర్ ప్రాజెక్టులలో రూ.5,000 కోట్లు ముడుపులు అందుకున్నారని, ఇసుక మాఫియా నుంచి రూ.2,600 కోట్లు వసూలు చేశారని ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు. -
చంద్రబాబుపై ప్రసన్నకుమార్ రెడ్డి ఫైర్
నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మంగళవారం నెల్లూరులో నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో దళితులు, గిరిజనులను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో పరిశ్రమల స్థాపన కోసం వడ్డీ లేని రుణాలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడేమో ఎస్టీ కార్పొరేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారని ఆరోపించారు. గిరిజన సంక్షేమం కోసం కమిటీ వేయకుండా కాలయాపన చేస్తున్నారంటూ చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. -
'వైఎస్ హయాంలో రైతులు సుభిక్షంగా ఉన్నారు'
నెల్లూరు : దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులు సుభిక్షంగా ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. ఆదివారం నెల్లూరులో విలేకర్లతో మాట్లాడుతూ.... ప్రస్తుతం రెండో పంటకు నీరు విడుదల చేసేందుకు చంద్రబాబు సర్కార్ మీనమేషాలు లెక్కిస్తున్నారని ఎద్దేవా చేశారు. పండిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. రైతు పండించిన పంటను కోనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రసన్నకుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
స్పీకర్ తీరు శోచనీయం: నల్లపురెడ్డి
నెల్లూరు: స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లా మార్చేశారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్, ఇతర కుంభకోణాలపై చర్చ జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు బండారం బయటపడుతుందని స్పీకర్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ హోదాలోని వ్యక్తి ఇలా ప్రవర్తించడం శోచనీయమన్నారు. అధికారపక్షానికి పూర్తి అనుకూలంగా, పక్షపాతపూరితంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షనేతకు కనీసం మైక్ కూడా ఇవ్వనందుకు నిరసనగా స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై అవిశ్వాసం అస్త్రాన్ని ప్రయోగించాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నిర్ణయించిన సంగతి తెలిందే. -
వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా నల్లపురెడ్డి
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నియామితులయ్యారు. అలాగే, పార్టీ రాష్ట్ర కమిటీ క్రమశిక్షణా సంఘం సభ్యుడిగా యల్లసిరి గోపాల్ రెడ్డి నియమితులయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కొత్త నియామకాలు జరిగాయి.