
వలంటీర్లకు స్మార్ట్‌ఫోన్లు అందజేస్తున్న ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
సాక్షి, నెల్లూరు: రాష్ట్రాభివృద్ధిని ఓర్వలేక పిచ్చిప్రేలాపనలు చేస్తూ రాజధాని రైతులను రెచ్చగొడుతున్న చంద్రబాబునాయుడు నరరూపరాక్షసుడని, తమ నాయకుడు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత ఆయనకు లేదని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక బెజవాడగోపాల్‌రెడ్డి పార్క్ వద్ద ఆదివారం జరిగిన వలంటీర్ల స్మార్ట్‌ఫోన్ల పంపిణీలో ఆయన మాట్లాడారు. జగన్‌మోహన్‌రెడ్డిని బలివ్వాలని అన్న చంద్రబాబునాయుడి మాటలపై ఆయన మండిపడ్డారు. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన నీచమైన చరిత్ర చంద్రబాబునాయుడిదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజల ఆశీర్వదించారని, 151 మందిని ఎమ్మెల్యేలుగా, 22 మందిని ఎంపీలుగా గెలిపించారన్నారు. అటువంటి వ్యక్తిపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న చంద్రబాబును నడిరోడ్డుపై ఉరితీయాలన్నారు. రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండాల్సిందేనన్నారు. పాదయాత్రలో ప్రతి ప్రాంతం సమస్యలను జగన్‌మోహన్‌రెడ్డి తెలుసుకున్నారని పేర్కొన్నారు.
అందుకే పాలనా వికేంద్రీకరణ దిశగా సాగుతున్నారన్నారు. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. నమ్మినవారికి అండగా ఉండడం జగన్‌మోహన్‌రెడ్డి నైజమని తెలిపారు. నమ్మినవారిని తడిగుడ్డతో గొంతుకోయడం చంద్రబాబునైజమని పేర్కొన్నారు. చంద్రబాబు ఒక మానసిక రోగి అని విమర్శించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమన్నారు. అందుకు ఎమ్మెల్యేందరూ కలసికట్టుగా పనిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సూరా శ్రీనివాసులురెడ్డి, ఇప్పగుంట విజయ్‌భాస్కర్‌రెడ్డి, టంగుటూరు మల్లికార్జున్‌రెడ్డి, తిరువాయిపాటి నందకుమార్, కామాక్షితాయి ఆలయ పాలకమండలి సభ్యుడు ఇన్నమూరి నరసింహరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment