నెల్లూరు : టీడీపీ నేతల అక్రమాలపై విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం నెల్లూరులో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి సోదరుడికి తెల్లరేషన్ కార్డు మంజూరు చేశారని ఆరోపించారు.
నియోజకవర్గంలోని అధికార యంత్రాంగమంతా ఎమ్మెల్యే కనుసన్నల్లో నడుస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యే అవినీతిపై పోరాటం చేస్తామని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి స్పష్టం చేశారు.