
'వైఎస్ హయాంలో రైతులు సుభిక్షంగా ఉన్నారు'
నెల్లూరు : దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులు సుభిక్షంగా ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. ప్రసన్నకుమార్రెడ్డి తెలిపారు. ఆదివారం నెల్లూరులో విలేకర్లతో మాట్లాడుతూ.... ప్రస్తుతం రెండో పంటకు నీరు విడుదల చేసేందుకు చంద్రబాబు సర్కార్ మీనమేషాలు లెక్కిస్తున్నారని ఎద్దేవా చేశారు. పండిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. రైతు పండించిన పంటను కోనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రసన్నకుమార్రెడ్డి డిమాండ్ చేశారు.